మైలవ రం/జమ్మలమడుగు రూరల్: మైలవరం మండలం నావాబు పేట సమీపంలో ఏర్పాటు చేసిన దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన గనుల తవ్వకాలను కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఇన్‌ఛార్జి తహశీల్దార్ సాయినాథరెడ్డి నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ పెద్దకొమెర్ల, హనుమంతరాయునిపేట గ్రామాల్లో కార్బన్ వాయువు ప్రభావంచేత పంటలు నల్లగా మసకబారిపోతుండటంతో, అలాగే ప్రజల ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోందని ఫిర్యాదులు వచ్చాయన్నారు.
దీనికి తోడు నవాబుపేట గ్రామంలో గనుల బ్లాస్టింగ్ వల్ల ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయని గ్రామస్థులంతా కలిసి కలెక్టర్ రమణకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గనుల తవ్వకాలను పూర్తిగా నిలుపుదల చేసినట్లు ఆయన వివరించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం జనవరి 5వతేదీలోగా కలెక్టర్‌ను కలిసి సంజాయిషీ ఇవ్వాలని సూచించినట్లు వివరించారు.
దాల్మియా గనుల తవ్వకాలు నిలిపివేత
Published Fri, Dec 19 2014 3:44 AM | Last Updated on Wed, Apr 3 2019 3:55 PM
Advertisement