Dalmia cement factory
-
వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే!
జమ్మలమడుగు/మైలవరం: ‘మాకు మామూళ్లు ఇస్తేనే మీ లారీలు కదులుతాయి.. మీరు వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే’ అంటూ ట్రాన్స్పోర్ట్ సంస్థల యజమానులను టీడీపీ నాయకులు బెదిరించారు. తమకు మామూళ్లు ఇవ్వకపోతే అంతు చూస్తామంటూ హెచ్చరించారు. నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న తామెందుకు డబ్బులివ్వాలని ట్రాన్స్‌పోర్టు సంస్థల యజమానులు ప్రశ్నించడంతో టీడీపీ నాయకులు ఏకంగా 11 లారీలను ధ్వంసం చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలో జరిగింది. ఇక్కడి దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలోకి ప్రతిరోజూ వివిధ ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు చెందిన వందలాది లారీలు సిమెంట్ రవాణా కోసం వస్తుంటాయి. కొన్నిరోజులుగా ఈ కంపెనీల యజమానులను టీడీపీ నాయకులు మామాళ్లు డిమాండ్ చేస్తున్నారు.వ్యాపారాలు సాఫీగా జరగాలన్నా.. లారీలు రోడ్డెక్కాలన్నా మామూళ్లు ఇవ్వాలని బెదిరించారు. అయినా యజమానులు పట్టించుకోకపోవడంతో.. కక్ష పెంచుకున్న టీడీపీ నాయకులు గురువారం తెల్లవారుజామున లారెన్స్ ట్రాన్స్పోర్ట్కు చెందిన 11 లారీలను ధ్వంసం చేశారు. మామూళ్లు ఇవ్వకపోతే మిగతా కంపెనీలకూ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. దీంతో ట్రాన్స్పోర్ట్ కంపెనీల యజమానులు, పారిశ్రామికవేత్తలు ఆందోళనకు గురవుతున్నారు. బాడుగల రూపంలో వస్తున్న ఆదాయం తమ ఖర్చులకే సరిపోవడంలేదని, డ్రైవర్లకు, క్లీనర్లకు జీతాలు, లారీలకయ్యే ఖర్చులు పెరిగిపోయాయని, ఇప్పుడు ఇలా రౌడీయిజం చేస్తే తామంతా బతికేదెలా అని ట్రాన్స్పోర్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తలమంచిపట్నం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ హనుమంతప్పకు లారెన్స్ ట్రాన్స్‌పోర్టు మేనేజర్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. చేపల పెంపకానికీ మామూళ్లు.. లేదంటే దాడే జమ్మలమడుగులో చేపల పెంచుకోవాలన్నా టీడీపీ నాయకులకు మామూళ్లు ఇవ్వాల్సిందే. లేదంటే దాడి చేసి చంపడానికీ వెనుకాడట్లేదు. చేపల పెంపక కేంద్రం నిర్వహిస్తున్న మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ సుబ్బారాయుడిని కూడా ఇటీవల టీడీపీ నాయకులు బెదిరించారు. రూ.20 లక్షలు ఇవ్వకపోతే చేపల కేంద్రాన్ని మూసేస్తామంటూ హెచ్చరించారు. వారి హెచ్చరికలను లెక్కచేయకపోవడంతో సుబ్బారాయుడు, అతని కుమారులపై దాడి చేశారు. చికిత్స కోసం వెళ్తుండగా.. ప్రభుత్వాస్పత్రి ఆవరణలో కూడా దాడి చేశారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ నాయకుల తీరుతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. -
హామీలకు రెండేళ్లు.. అమలుకు ఇంకెన్నేళ్లో ?
జమ్మలమడుగు: నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ నాడు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. అందులో మైలవరం మండలం నవా బుపేట సమీపంలో రెండువేల ఎకరాల్లో రెండేళ్లలోనే దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ ని ర్మాణాన్ని పూర్తి చేయించారు. చేనేత కా ర్మికులకు టెక్స్టైల్ పార్కు నిర్మాణం కోసం నిధులు కేటాయించారు. జలాశయం ఉండడంతో చేపల ఉత్పత్తి కేంద్రానికి కూడా 2005లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు. వైఎస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలెన్నో.. గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సంకల్పించి 2008లో పదివేల కోట్ల రూపాయలతో గ్లోబెల్ టెండర్లను ఆహ్వానించారు. జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు సమీపంలో ఎవరూ చేయని విధంగా 1,499 ఇళ్లు నిర్మించి రాజీవ్‌కాలనీ ఏర్పాటు. ∙జమ్మలడుగు–తాడిపత్రి రహదారి బైపాస్ రోడ్డు మంజూరు ∙మైలవరం జలాశయం నుంచి 60 గ్రామాలకు, సీపీడబ్ల్యూ స్కీం కింద ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా మైలవలరం మండలంలో.. రూ.380 కోట్లతో గండికోట ప్రాజెక్ట్ నిర్మాణం. అవుకు నుంచి మైలవరం మండలం లింగాపురం వరకు రూ.300 కోట్లతో కాలువల నిర్మాణం, మరో రూ.300 కోట్లతో ఐదున్నర కిలోమీటర్ల దూరం వరకు సొరంగ మార్గం పనులు ∙మైలవరం జలాశయం ఆధునీకరణ కోసం రూ.150 కోట్లు మంజూరు ∙పెద్దముడియం మండలంలో ఎస్ఆర్బీసీ పెండింగ్‌లో ఉన్న 38వ ప్యాకేజీ పనులు. ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కానివి.. మైలవరం మండలంలో ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఆ కంపెనీ యాజమాన్యం రైతుల నుంచి 20 ఏళ్ల క్రితం భూములు సేకరించింది. ఇప్పటికీ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టలేదు. గతేడాది ఏసీసీ యాజమాన్యం ఫ్యాక్టరీతో పాటు పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రజాభిప్రాయసేకరణ చేపట్టింది. ఈ సందర్భంగా మంత్రి ఆదినారాయణరెడ్డి భూములు నష్టపోయిన రైతులకు అదనంగా డబ్బులు ఇప్పిస్తామని ఉగాది పండుగప్పుడు హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు ఇవ్వలేదు. సీఎం చంద్రబాబు హామీకి రెండేళ్లు.. గండికోటను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2015 నవంబర్‌లో జమ్మలమడుగు పర్యటనకు వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఎటువంటి పనులు చేపట్టలేదు. ఇక్కడ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు అతీగతీ లేదు. గండికోట ముంపు సమస్య.. గండికోట ప్రాజెక్టు నిర్మాణంలో 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మొదటి విడతగా 14 గ్రామాల ప్రజలకు ముంపు పరిహారంతో పాటు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ పునరావాస కేంద్రాల్లో సరైన మౌలిక సదుపాయాలు కల్పించలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. ఆయన మరణానంతరం అభివృద్ధి అనే మాట కనుచూపు మేరలో ఆగిపోయింది. వైఎస్ తన హయాంలో పులివెందుల తర్వాత అభివృద్ధి కోసం జిల్లాలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నియోజకవర్గాల్లో జమ్మలమడుగు కూడా ఒకటి కావడం గమనార్హం. -
న్యాయం చేయండి.. సారో!
జమ్మలమడుగు: ‘మా భూములు కొనుగోలు చేసే ముందు.. నష్టపోయిన రైతులకు సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామని దాల్మియా యాజమాన్యం చెప్పింది. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఉత్పత్తి కూడా అవుతోంది. యాజమాన్యం మాత్రం తమ వారికి ఉద్యోగాలు కాదు కదా, ఉపాధి అవకాశాలు కూడా చూపించడం లేదు’ అని మైలవరం మండలం నవాబుపేట గ్రామానికి చెందిన బాధితులు ఆర్డీవో కె.వినాయకం ఎదుట వాపోయారు. సోమవారం ఆర్డీవో తన చాంబర్లో మీకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో దాదాపు 30 మంది రైతులు కలిసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. యాజమాన్యం రైతుల వద్ద నుంచి భూములు తీసుకుని పరిహారం ఇచ్చిందే తప్ప, తమకు ఎలాంటి ఉపాధి చూపెట్టడం లేదని వారు పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో పని చేసేందుకు యాజమాన్యం ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చుకుంటుందని, తమ వారికి మాత్రం అన్యాయం చేస్తోందని అన్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి యాజమాన్యం భూములు కొనుగోలు చేసి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిందని తెలిపారు. అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలంటే వారికి కూడా కష్టం అవుతుందని ఆయన పేర్కొన్నారు. భూములు కోల్పోయిన చాలా మందికి ఉద్యోగాలు గతంలో ఇస్తే వారు సక్రమంగా పని చేయడం లేదని, దీంతో తమ ఫ్యాక్టరీ ఉత్పత్తి కూడా తక్కువగా ఉందని, కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నామని యాజమాన్యం చెబుతోందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అలా కాకుండా యాజమాన్యంపై తిరుగుబాటు చేసి, పనులు చేయకుండా జీతాలు ఇవ్వాలంటే ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. అవకాశం ఏమైనా ఉంటే దాల్మియా యాజమాన్యంతో మాట్లాడి న్యాయం జరిగే విధంగా చేస్తామని ఆయన పేర్కొన్నారు. నష్ట పరిహారం మంజూరులో అన్యాయం: ‘గ్రామ వీఆర్వో, కట్టుబడిఇంటింటికి వచ్చి మీకు మేలు జరుగుతుంది. సంతకాలు పెట్టండి. ఆర్డీవో, తహసీల్దార్.. మీతో మాట్లాడిన తర్వాతనే పరిహారం ఇస్తారని చెప్పడంతో సంతకాలు చేశాం. ప్రస్తుతం మాకు అన్యాయంజరిగింది’ అని జాతీయ రహదారికి భూములు, ఇళ్లు కోల్పోయిన వారు ఆర్డీవో ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణానికి సమీపంలో ఉన్న తమ భూములు, ఇళ్లు మంచి రేటు పలుకుతాయని.. అధికారులు మాత్రం తక్కువ రేటు పెట్టి తమ భూములకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. తమ భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తారో అనే విషయాన్ని తమతో మాట్లాడకుండా అధికారులు నిర్ణయించడం ద్వారా తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రైతులతో ఆర్డీవో మాట్లాడుతూ రైతులకు సంబంధించిన భూములకు న్యాయపరంగా రావాల్సిన నష్టపరిహారం ఇచ్చామన్నారు. మూడేళ్లకు చెందిన రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగానే ఇటీవల నష్టపరిహారం అంచనా వేసి ఇచ్చామన్నారు. రైతులకు సంబంధించిన ఐదు ఎకరాల భూమి ముద్దనూరు రహదారిలో జాతీయ రహదారికి కేటాయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం తాను ఏమి చేయలేనని, మరో వారం రోజుల్లో జమ్మలమడుగు, ముద్దనూరు, బొందల కుంటలో నష్టపోయిన రైతులతో మాట్లాడి, వారి చెప్పిన అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మరింత నష్టపరిహారం పెంచేలా చేయటానికి ప్రయత్నం చేస్తానన్నారు. అంతేకాకుండా పునరావాసం కింద అదనంగా వచ్చేలా చేస్తానని వివరించారు. -
న్యాయం చేయండి.. సారో!
జమ్మలమడుగు: ‘మా భూములు కొనుగోలు చేసే ముందు.. నష్టపోయిన రైతులకు సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామని దాల్మియా యాజమాన్యం చెప్పింది. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఉత్పత్తి కూడా అవుతోంది. యాజమాన్యం మాత్రం తమ వారికి ఉద్యోగాలు కాదు కదా, ఉపాధి అవకాశాలు కూడా చూపించడం లేదు’ అని మైలవరం మండలం నవాబుపేట గ్రామానికి చెందిన బాధితులు ఆర్డీవో కె.వినాయకం ఎదుట వాపోయారు. సోమవారం ఆర్డీవో తన చాంబర్లో మీకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో దాదాపు 30 మంది రైతులు కలిసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. యాజమాన్యం రైతుల వద్ద నుంచి భూములు తీసుకుని పరిహారం ఇచ్చిందే తప్ప, తమకు ఎలాంటి ఉపాధి చూపెట్టడం లేదని వారు పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో పని చేసేందుకు యాజమాన్యం ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చుకుంటుందని, తమ వారికి మాత్రం అన్యాయం చేస్తోందని అన్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి యాజమాన్యం భూములు కొనుగోలు చేసి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిందని తెలిపారు. అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలంటే వారికి కూడా కష్టం అవుతుందని ఆయన పేర్కొన్నారు. భూములు కోల్పోయిన చాలా మందికి ఉద్యోగాలు గతంలో ఇస్తే వారు సక్రమంగా పని చేయడం లేదని, దీంతో తమ ఫ్యాక్టరీ ఉత్పత్తి కూడా తక్కువగా ఉందని, కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నామని యాజమాన్యం చెబుతోందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అలా కాకుండా యాజమాన్యంపై తిరుగుబాటు చేసి, పనులు చేయకుండా జీతాలు ఇవ్వాలంటే ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. అవకాశం ఏమైనా ఉంటే దాల్మియా యాజమాన్యంతో మాట్లాడి న్యాయం జరిగే విధంగా చేస్తామని ఆయన పేర్కొన్నారు. నష్ట పరిహారం మంజూరులో అన్యాయం: ‘గ్రామ వీఆర్వో, కట్టుబడిఇంటింటికి వచ్చి మీకు మేలు జరుగుతుంది. సంతకాలు పెట్టండి. ఆర్డీవో, తహసీల్దార్.. మీతో మాట్లాడిన తర్వాతనే పరిహారం ఇస్తారని చెప్పడంతో సంతకాలు చేశాం. ప్రస్తుతం మాకు అన్యాయం జరిగింది’ అని జాతీయ రహదారికి భూములు, ఇళ్లు కోల్పోయిన వారు ఆర్డీవో ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణానికి సమీపంలోఉన్న తమ భూములు, ఇళ్లు మంచి రేటు పలుకుతాయని.. అధికారులు మాత్రం తక్కువ రేటు పెట్టి తమ భూములకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. తమ భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తారో అనే విషయాన్ని తమతో మాట్లాడకుండా అధికారులు నిర్ణయించడం ద్వారా తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రైతులతో ఆర్డీవో మాట్లాడుతూ రైతులకు సంబంధించిన భూములకు న్యాయపరంగా రావాల్సిన నష్టపరిహారం ఇచ్చామన్నారు. మూడేళ్లకు చెందిన రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగానే ఇటీవల నష్టపరిహారం అంచనా వేసి ఇచ్చామన్నారు. రైతులకు సంబంధించిన ఐదు ఎకరాల భూమి ముద్దనూరు రహదారిలో జాతీయ రహదారికి కేటాయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం తాను ఏమి చేయలేనని, మరో వారం రోజుల్లో జమ్మలమడుగు, ముద్దనూరు, బొందల కుంటలో నష్టపోయిన రైతులతో మాట్లాడి, వారి చెప్పిన అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మరింత నష్టపరిహారం పెంచేలా చేయటానికి ప్రయత్నం చేస్తానన్నారు. అంతేకాకుండా పునరావాసం కింద అదనంగా వచ్చేలా చేస్తానని వివరించారు. -
దాల్మియా గనుల తవ్వకాలు నిలిపివేత
మైలవ రం/జమ్మలమడుగు రూరల్: మైలవరం మండలం నావాబు పేట సమీపంలో ఏర్పాటు చేసిన దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన గనుల తవ్వకాలను కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఇన్‌ఛార్జి తహశీల్దార్ సాయినాథరెడ్డి నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ పెద్దకొమెర్ల, హనుమంతరాయునిపేట గ్రామాల్లో కార్బన్ వాయువు ప్రభావంచేత పంటలు నల్లగా మసకబారిపోతుండటంతో, అలాగే ప్రజల ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనికి తోడు నవాబుపేట గ్రామంలో గనుల బ్లాస్టింగ్ వల్ల ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయని గ్రామస్థులంతా కలిసి కలెక్టర్ రమణకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గనుల తవ్వకాలను పూర్తిగా నిలుపుదల చేసినట్లు ఆయన వివరించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం జనవరి 5వతేదీలోగా కలెక్టర్‌ను కలిసి సంజాయిషీ ఇవ్వాలని సూచించినట్లు వివరించారు.