=సీకేఎంలో పైసలిస్తేనే వైద్యం
=ప్రతి గర్భిణీకి రెండు వేలకు పైగా ఖర్చు
=స్టిక్ ఫైల్, టిఫా స్కానింగ్ పేరిట అదనపు వ్యయం
ఎంజీఎం, న్యూస్‌లైన్ : వరంగల్‌లోని చందా కాంతమ్మ మెమోరియల్(సీకేఎం) ప్రసూతి ఆస్పత్రికి వస్తున్న గర్భిణులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడ ప్రతీ పనికి డబ్బు చెల్లిస్తే తప్ప వైద్యం అందని పరిస్థితి నెలకొంది. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవించే వర కు రెండు వేల రూపాయల చొప్పున ఖర్చు చేయాల్సి వస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
గర్భం దాల్చింది మొదలు...
మహిళ గర్భం దాల్చగానే ఆస్పత్రికి రాగానే డబ్బు వసూళ్లు ప్రారంభమవుతాయి. రక్త పరీక్షల కోసం రూ.40, ఆప్‌డామింగ్ స్కానింగ్ కోసం మరో రూ.60 వసూలుచేస్తున్నారు. ఇక స్టిక్ ఫైల్ కొనుగోలు చేయాల్సిందేంటూ మరో రూ.25, గర్భిణిని అపరేషన్ థియేటర్‌కు తరలించేటప్పుడు రూ.వంద, వార్డుకు తీసుకవచ్చేటప్పుడు మరో రూ.వంద, చాకలికి రూ.వంద, పాపను తుడిచేందుకు ఇంకో వంద చెల్లించాల్సి రావడమే కాకుండా సెక్యూరిటీ సిబ్బందికి నగదు ఇచ్చేసరికి తల ప్రాణం తోకకొస్తుంది.
టిఫా స్కానింగ్ పేరుతో ప్రైవేట్‌కు కాసుల పంట
ప్రతి గర్భిణీ ఐదు నెలలు పడగానే కడుపులోని శిశువు ఎదుగుదల ఏ విదంగా ఉందో తెలుసుకోవడానికి టిఫా స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. కాగా సీకేఎం ఆస్పత్రిలో ఇంత వరకు టిఫా స్కానింగ్ పరికరం లేకపోవడంతో ప్రైవేట్ సెంటర్లలో రూ.వెయ్యి చెల్లించి స్కానింగ్ చేయించుకుంటున్నారు. ఆస్పత్రిలో ఇద్దరు రేడియాలజిస్టులు ఉన్నా, రూ.20లక్షలు వెచ్చించి పరి కరం ఏర్పాటుచేయకపోవడంతో వారు ఖాళీ ఉంటున్నా రు. అలాగే, గర్భిణులకు తిప్పలు తప్పడం లేదు.
స్టిక్ ఫైళ్లతో జోరుగా దందా
స్టిక్ ఫైళ్ల పేరుతో సీకేఎం ఆస్పత్రిలో జోరుగా దందా కొ నసాగుతోంది. ఆస్పత్రి ప్రాంగణంలోని మెడికల్ షాపు నిర్వాహకులు ఈ ఫైళ్లను రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో వీటి ధర రూ.10కు మిం చదు. అయినప్పటికీ ఆస్పత్రి అధికారుల అండతో గర్భిణులకు అంటగడుతున్నారు. ఇక ఆస్పత్రిలో కాంట్రాక్టు నిర్వహిస్తున్న బయోమెడికల్ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలోని బయోమెడికల్ వేస్టేజ్‌ను మూడు కవర్లలో సేకరించి తరలించాల్సి ఉండగా, ఎక్కడికక్కడ సూదులు, సిరప్ బాటిళ్లు, సిరంజిలు పడవేస్తుండడం గమనార్హం.
196 పోస్టుల్లో 132 ఖాళీయే
వంద పడకల ఆస్పత్రిగా రూపాంతరం చెందిన సీకేఎం లో 196 పోస్టులు ఉన్నాయి. ఇందులో 132 పోస్టులు మంజూరు నోచుకోలేదు. ఫలితంగా 64 మందితోనే ఆ స్పత్రి నిర్వహణ సాగుతోంది. దీంతో ఆస్పత్రి వచ్చే వా రికి అంతంత మాత్రంగానే సేవలందుతున్నాయి.
ప్రసూతి ఆస్పత్రిలో దందా
Published Sat, Jan 4 2014 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement