Tiffany scanning
-
గర్భధారణ సమయంలో టిఫా స్కానింగ్ ఎందుకు చేస్తారు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏటా వేలాది మంది చిన్నారులు ఏదో ఒక లోపంతో పుడుతున్నారు. ఈ సమస్యను అధిగమించి, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. అవసరమైన వారికి ‘టిఫా’ స్కానింగ్ చేయించాలని నిర్ణయించింది. ఈ టెస్ట్ ద్వారా బిడ్డకు ఉన్న లోపాలను గర్భస్థ దశలోనే గుర్తించేందుకు, తద్వారా తగు వైద్యం అందించేందుకు వీలుంటుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ తాజాగా ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇక టిఫా స్కానింగ్‌లు చేయనున్నారు. టిఫా అంటే.. టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్. టిఫా’ స్కానింగ్ దీని ద్వారా 18 నుంచి 22 వారాల మధ్య పిండాన్ని స్కాన్ చేస్తారు. శిశువు అవయవ క్రమం ఏర్పడే దశలోనే లోపాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఇలా గుర్తించిన సమస్యలకు మందులు వాడొచ్చు. లేదా అవకాశముంటే అబార్షన్ చేయించుకునేందుకు వీలుంటుంది. ఒక్కో స్కానింగ్‌కు రూ.వెయ్యి ఖర్చవుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా లేకుంటే.. ప్రైవేట్ డయాగ్నిస్టిక్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వమే ఉచితంగా చేయిస్తుంది. 7 శాతం మందిలో లోపాలు.. ప్రతి వంద మంది గర్భిణుల్లో 7 శాతం మందిలో లోపాలుండే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లందరికీ టిఫా స్కానింగ్ చేసి ఆ లోపాలను సరిదిద్దుతారు. ఎక్కువగా మేనరికం వివాహాల వల్ల, క్రోమోజోమ్స్ లోపం వల్ల, మానసిక లోపాలు(మెంటల్ డిజబిలిటీ), సింగిల్ జీన్ డిజార్డర్స్, 35 ఏళ్ల తర్వాత గర్భిణి అవడం వల్ల, బ్యాడ్ అబ్స్ట్రెటిక్ హిస్టరీ(గర్భం దాల్చిన రోజు నుంచే వివిధ సమస్యలు తలెత్తడం), కన్సాగ్యుయస్ మ్యారేజెస్(రక్త సంబంధీకులను పెళ్లి చేసుకోవడం), సెక్స్ లింక్డ్ డిజార్డర్స్(శృంగార సంబంధిత వ్యాధులు).. ఇలా రకరకాల కారణాలతో లోపాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే రాష్ట్రంలో ఏటా 8.96 లక్షల ప్రసవాలు జరుగుతాయని కుటుంబ సంక్షేమ శాఖ చెబుతోంది. వీటిలో 7 శాతం మందికి.. అంటే 62 వేల మందికి పైగా గర్భిణులకు టిఫా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. తల్లి ఆరోగ్య పరిస్థితులు, రక్త సంబంధీకులను వివాహం చేసుకున్నారా? గర్భం దాల్చాక పరిస్థితులు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాకే వైద్యాధికారి, లేదా గైనకాలజిస్ట్ టిఫా స్కానింగ్‌కు రిఫర్ చేస్తారు. -
ప్రసూతి ఆస్పత్రిలో దందా
=సీకేఎంలో పైసలిస్తేనే వైద్యం =ప్రతి గర్భిణీకి రెండు వేలకు పైగా ఖర్చు =స్టిక్ ఫైల్, టిఫా స్కానింగ్ పేరిట అదనపు వ్యయం ఎంజీఎం, న్యూస్‌లైన్ : వరంగల్‌లోని చందా కాంతమ్మ మెమోరియల్(సీకేఎం) ప్రసూతి ఆస్పత్రికి వస్తున్న గర్భిణులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడ ప్రతీ పనికి డబ్బు చెల్లిస్తే తప్ప వైద్యం అందని పరిస్థితి నెలకొంది. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవించే వర కు రెండు వేల రూపాయల చొప్పున ఖర్చు చేయాల్సి వస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గర్భం దాల్చింది మొదలు... మహిళ గర్భం దాల్చగానే ఆస్పత్రికి రాగానే డబ్బు వసూళ్లు ప్రారంభమవుతాయి. రక్త పరీక్షల కోసం రూ.40, ఆప్డామింగ్ స్కానింగ్ కోసం మరో రూ.60 వసూలుచేస్తున్నారు. ఇక స్టిక్ ఫైల్ కొనుగోలు చేయాల్సిందేంటూ మరో రూ.25, గర్భిణిని అపరేషన్ థియేటర్‌కు తరలించేటప్పుడు రూ.వంద, వార్డుకు తీసుకవచ్చేటప్పుడు మరో రూ.వంద, చాకలికి రూ.వంద, పాపను తుడిచేందుకు ఇంకో వంద చెల్లించాల్సి రావడమే కాకుండా సెక్యూరిటీ సిబ్బందికి నగదు ఇచ్చేసరికి తల ప్రాణం తోకకొస్తుంది. టిఫా స్కానింగ్ పేరుతో ప్రైవేట్‌కు కాసుల పంట ప్రతి గర్భిణీ ఐదు నెలలు పడగానే కడుపులోని శిశువు ఎదుగుదల ఏ విదంగా ఉందో తెలుసుకోవడానికి టిఫా స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. కాగా సీకేఎం ఆస్పత్రిలో ఇంత వరకు టిఫా స్కానింగ్ పరికరం లేకపోవడంతో ప్రైవేట్ సెంటర్లలో రూ.వెయ్యి చెల్లించి స్కానింగ్ చేయించుకుంటున్నారు. ఆస్పత్రిలో ఇద్దరు రేడియాలజిస్టులు ఉన్నా, రూ.20లక్షలు వెచ్చించి పరి కరం ఏర్పాటుచేయకపోవడంతో వారు ఖాళీ ఉంటున్నా రు. అలాగే, గర్భిణులకు తిప్పలు తప్పడం లేదు. స్టిక్ ఫైళ్లతో జోరుగా దందా స్టిక్ ఫైళ్ల పేరుతో సీకేఎం ఆస్పత్రిలో జోరుగా దందా కొ నసాగుతోంది. ఆస్పత్రి ప్రాంగణంలోని మెడికల్ షాపు నిర్వాహకులు ఈ ఫైళ్లను రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి ధర రూ.10కు మిం చదు. అయినప్పటికీ ఆస్పత్రి అధికారుల అండతో గర్భిణులకు అంటగడుతున్నారు. ఇక ఆస్పత్రిలో కాంట్రాక్టు నిర్వహిస్తున్న బయోమెడికల్ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలోని బయోమెడికల్ వేస్టేజ్‌ను మూడు కవర్లలో సేకరించి తరలించాల్సి ఉండగా, ఎక్కడికక్కడ సూదులు, సిరప్ బాటిళ్లు, సిరంజిలు పడవేస్తుండడం గమనార్హం. 196 పోస్టుల్లో 132 ఖాళీయే వంద పడకల ఆస్పత్రిగా రూపాంతరం చెందిన సీకేఎం లో 196 పోస్టులు ఉన్నాయి. ఇందులో 132 పోస్టులు మంజూరు నోచుకోలేదు. ఫలితంగా 64 మందితోనే ఆ స్పత్రి నిర్వహణ సాగుతోంది. దీంతో ఆస్పత్రి వచ్చే వా రికి అంతంత మాత్రంగానే సేవలందుతున్నాయి.