ఈత చాలా సరదాగా ఉండే ఆట మాత్రమే కాదు. శరీరానికి అవసరమైన వ్యాయామం కూడా. అయితే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇది ముంచేస్తుంది. అందుకే పిల్లలు ఈతకు వెళ్లాలంటే పెద్దలు తోడుండాల్సిందే! ఈత ఆడేటప్పుడు కూడా పెద్దలు గమనిస్తూనే ఉండాలి. లేకుంటే జరగరాని సంఘటన ఏదైనా జరగవచ్చు.
తిరుపతి సిటీ : ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఇంకో పది రోజుల్లో వేసవి సెలవులు వస్తున్నాయి. ఇప్పుడు చిన్నారులు బడి నుంచి ఇంటికి రాగానే బ్యాగ్‌ను పక్కన పెట్టి ఆటల బాట పడుతున్నారు. నగరంలో ఈత కొలనులు తగినన్ని లేనందున శివారు ప్రాంతాల్లోని చెరువులు, బావుల్లో ఈత కొట్టేందుకు చిన్నారులు ఉత్సాహం చూపుతున్నారు. తల్లిదండ్రులు వీరిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. బడి ముగిశాక చిన్నారులు స్నేహితులతో ఆటలు ఆడేందుకు ఇష్టపడతారు. కానీ పిల్లలను ఇంటి ఆవరణలో, పరిసర ప్రాంతా ల్లో ఆడుకునేలా, చదువుకునేలా తల్లిదండ్రులు దృష్టిసారిం చాలి. పిల్లలకు ఈత నేర్పాలనుకుంటే తల్లిదండ్రులు కానీ, కుటుంబసభ్యులు కానీ తీసుకెళ్లి వెంట ఉండి నేర్పించడం ఉత్తమం. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్‌కాంప్లెక్స్‌లో ఉన్న స్వి మ్మింగ్ పూల్ ఈత నేర్చుకోవడానికి అందుబాటులో ఉంది. దాంతో పాటు తిరుపతి నగరంలోని పలు స్టార్ హోటళ్లలో స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులో ఉన్నాయి. గంటకు 500 నుంచి 1000 రూపాయలు లోపు ఫీజు వసూలు చేస్తారు.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు
- బడి వదలగానే పిల్లలను అవసరమైతే తప్ప బయటకు పంపడం మంచిదికాదు. వీలైతే విశ్రాంతి తీసుకునేలా చూడాలి.
- పిల్లల కోసం తల్లిదండ్రులు కొంత సమయాన్ని కేటాయించాలి. వారితో సరదాగా సంతోషంగా, విజ్ఞాన వినోద సంబంధమైన పుస్తకాలు చదివేలా చూడాలి.
- పిల్లలకు ఇంటినుంచి బయటకు వెళ్లిన తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేలా అవగాహన కల్పించాలి.
- తల్లిదండ్రులకు ఇంటిపనులకు సాయమందించేలా అలవాటు నేర్పించాలి. ఇంటిలోనే ఉంటూ క్యారంబోర్డు, చెస్ వంటి క్రీడలను పిల్లలకు అలవాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వేసవి నుంచి ఉపశమనం
ఈత నేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా వేసవిలో
ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే రోజూ గంట సేపు ఈత కొట్టడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుంది. కండరాలకు మంచి వ్యాయామం ఉంటుంది. ఎండల్లో పిల్లలు తిరగకుండా ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎక్కువగా తిరగడం వల్ల డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం
పూట ఎండలో తిరగకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
Comments
Please login to add a commentAdd a comment