dangers
-
సోషల్ మీడియాతో తప్పని తిప్పలు
దేశంలోని ప్రతి టీనేజర్ రాత్రి నిద్రకు ముందు, ఉదయం నిద్ర లేవగానే చూసేది సోషల్ మీడియానే అంటే అతిశయోక్తి కాదేమో! ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్ చాట్, షేర్ చాట్, డిస్కార్డ్, వాట్సప్, టెలిగ్రామ్.. ఒకటా రెండా, అనేకానేక సోషల్ మీడియా యాప్‌లు యువత జీవితాలను చుట్టేస్తున్నాయి. సోషల్ మీడియా లేకుండా బతకడం లేదా దాన్ని తప్పించుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. అయితే సోషల్ మీడియా కేవలం కమ్యూనికేషన్ సాధనంగా కాకుండా, టీనేజర్లు తమను తాము ఎలా చూసుకుంటున్నారనేదాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వారి బాడీ ఇమేజ్, సోషల్ లైఫ్, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. మానసిక ఆరోగ్య సమస్యలుసోషల్ మీడియా విపరీత వినియోగానికీ ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం వంటి సమస్యలకూ మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో చూపించే లైఫ్‌స్టయిల్, ఐడియలైజ్డ్ ఇమేజ్‌లు టీనేజర్లలో అసంతృప్తికి, ఆత్మవిశ్వాసలోపానికి దారితీస్తాయి. ఇన్ఫ్లుయెన్సర్లు సృష్టించే స్టాండర్డ్లు అందుకోలేక తామెందుకూ పనికిరామనే భావనకు లోనవుతారు. సోషల్ మీడియాను ఎక్కువగా వాడే వారిలో తమ ఫ్రెండ్స్ గురించి అప్డేటెడ్గా ఉండాలన్న ఒత్తిడి ఉంటుంది. ఫ్రెండ్స్ పోస్టులు ఎప్పటికప్పుడు చూడకపోతే ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. అంతులేని సోషల్ మీడియా ఫీడ్స్ చూసి, లైకులు, కామెంట్స్ కోసం ఎదురుచూడటం వారి ఆత్మవిశ్వాసం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వీటితోపాటు ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్’ అనే సమస్య కూడా టీనేజర్ల మానసిక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బాడీ ఇమేజ్‌పై దుష్ప్రభావం..సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అందం, విజయానికి సంబంధించిన ఐడియలైజ్డ్ వర్షన్లను చూపడం వల్ల టీనేజర్లలో తమ శరీరం పట్ల ప్రతికూల ప్రభావం పడుతోంది. నాజూకుగా ఉండే ఫొటోలను పదేపదే చూడటం వల్ల కాస్తంత బొద్దుగా ఉన్న తాను బాలేనని అసంతృప్తికి లోనవుతున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. ‘ఫిట్‌స్పిరేషన్’,‘థిన్సిపిరేషన్’ వంటి కంటెంట్ల వల్ల టీనేజర్లు తక్కువ బరువు, ప్రత్యేకమైన శరీరాకృతికై తహతహలాడుతుంటారు. జీరోసైజ్ చేరుకోవాలని లేదా సిక్స్ ప్యాక్ సాధించాలని ప్రయత్నిస్తుంటారు. ఇది అనారోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రేరేపిస్తుంది.సామాజిక సంబంధాలకు దూరంగా.. సామాజిక సంబంధాలను ఎలా ఏర్పరచుకోవాలో, ఎలా నిర్వహించాలో సోషల్ మీడియా పూర్తిగా మార్చేస్తుంది. ఒకవైపు, తమలాంటి అభిరుచులున్న వ్యక్తులను కలుసుకునేందుకు, అభిప్రాయాలను పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. మరోవైపు, వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకోవడానికి అంతరాయం కలిగిస్తుంది. డిజిటల్ కమ్యూనికేషన్, సోషల్ మీడియాలపై విపరీతంగా ఆధారపడటం వల్ల అవసరమైన సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆన్లైన్లో చురుగ్గా ఉండే టీనేజర్లు కూడా వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కొత్తవారితో కలవాలంటే ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు సైబర్ బుల్లీయింగ్, ట్రోలింగ్ వల్ల అనేకమంది మానసిక సమస్యల పాలవుతున్నారు. మరోవైపు నిజమైన స్నేహానికి, ఆన్లైన్ కనెక్షన్ల సంఖ్యకు తేడా గుర్తించలేకపోతున్నారు. ఎంత ఎక్కువమంది ఆన్లైన్ స్నేహితులు లేదా ఫాలోయర్లు ఉంటే అంత గొప్పగా ఫీలవుతున్నారు. కానీ జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు వారెవ్వరూ తోడురాక ఒంటరితనానికి లోనవుతున్నారు. వీటన్నింటి నుంచీ తప్పించుకోవాలంటే సోషల్ మీడియాను పరిమితంగా వాడటం నేర్చుకోవాలి.మరేం చెయ్యాలి?👉 స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. విరామాలు తీసుకోండి ∙కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడండి 👉 రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి ∙సమతుల ఆహారం తీసుకోండి, సరిపడినంత నీటిని తాగండి ∙స్పష్టమైన లక్ష్యాలను సెట్ చేసుకోండి. దాన్ని చిన్నచిన్న భాగాలుగా విభజించుకోండి 👉మీ ఆలోచనలు, భావాలు, అనుభవాలు రోజూ రాయండి. అలాగే ప్రతిరోజూ మీరు కృతజ్ఞత తెలపాల్సిన మూడు విషయాలను రాసుకోండి 👉ఏ తీర్పులూ లేకుండా ఈ క్షణంపై దృష్టి పెట్టండి. ప్రతిరోజూ మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి 👉మీ గురించిన నెగటివ్ ఆలోచనలను సవాలు చేయండి. మీ పట్ల మీరు క్షమతో ఉండండి 👉మీ హాబీలపై సమయాన్ని పెంచండి. మీరు ఆస్వాదించే కార్యక్రమాల్లో పాల్గొనండి ∙ఇవన్నీ చేసినా మీరు ఒత్తిడికి లోనవుతుంటే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవడానికి సందేహించకండి. -
శక్తి: ఆటుపోట్లకు వెరవని ‘షి’జర్నీ
ప్రమాదాల సముద్రం మీద 8 నెలల పాటు ప్రపంచ దేశాలు తిరిగి రావడానికి ఇద్దరు సాహస నేవీ మహిళా అధికారులు దిల్నా, రూపా అక్టోబర్ 2న గోవా నుంచి బయలుదేరారు. కేవలం వారిద్దరు మాత్రమే ఉండే ఈ సాహసభరిత యాత్రలో వారు తోడు తీసుకెళుతున్నవి ఏమిటి? వారికి తోడుండేవి ఏమిటి? ఇంత సాహసం చేసే వీరిని చూస్తే ప్రతి అమ్మాయిలోనూ కలగదా సముద్రమంత సాహస భావన!‘గమ్యం ఎలాగూ ముఖ్యమే. కాని ప్రయాణం కూడా ముఖ్యం. ఈ యాత్రలోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి’ అని అక్టోబర్ 2న గోవాలో జెండా ఊపి భవిష్యత్ చరిత్రలో చిరస్థాయిగా నిలబడనున్న ‘నావికా సాగర్ పరిక్రమ–2’ను ప్రారంభించారు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి. కేవలం ఇద్దరు మహిళా నేవీ ఆఫీసర్లు ఐఎన్ఎస్వి తారిణి పేరున్న సెయిల్ బోట్లో ఎనిమిది నెలల పాటు చేయనున్న ఈ సాహసయాత్ర విజయవంతం కావాలని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ కోరుకున్నారు.ఐదు అంచెల యాత్రయాభై ఆరు అడుగుల ΄పొడవుండే సెయిల్ బోట్ తారిణిలో కమాండర్లు దిల్నా, రూప ఒకరికి ఒకరు తోడుగా నిలిచి మొత్తం 23000 నాటికల్ మైళ్లు అంటే 40000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అక్టోబర్ 2న గోవా నుంచి బయలుదేరిన వీరు ఈ యాత్రను ఐదు భాగాలుగా చేస్తారు. ⇒ గోవా నుంచి ఆస్ట్రేలియా 2.ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ 3. న్యూజిల్యాండ్ నుంచి ఫాక్‌ల్యాండ్ ఐలాండ్స్ (దక్షిణ పసిఫిక్ సముద్రం) 4.ఫాక్‌ల్యాండ్ నుంచి సౌత్ ఆఫ్రికా 5. సౌత్ ఆఫ్రికా నుంచి గోవా. భారతీయ మహిళలు అత్యంత శక్తిమంతులని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు సాగుతున్న ఈ యాత్ర కోసం తరిణికి సారధిగా లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా.కే వ్యవహరిస్తుండగా.. మరో లెఫ్టినెంట్ కమాండర్ రూపా సారథ్యం వహిస్తున్నారు.మైక్రోప్లాస్టిక్స్‌పై పరిశోధన‘నావికా సాగర్ పరిక్రమ–2’ మన స్త్రీ శక్తిని నిరూపించడానికే కాదు ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ’తో అనుసంధానమై సముద్రజలాల్లోని మైక్రోప్లాస్టిక్స్‌ను అధ్యయనం చేయడానికి కూడా ఉపయోగపడనుంది. అలాగే ‘వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’తో కలిసి సముద్రాలలోని పుష్పపత్రాలు, భారీ సముద్ర జీవులపై కూడా పరిశోధనకు అవసరమైన సమాచారం కూడా సేకరిస్తారు. వీటన్నింటికి వీలుగా ‘తారిణి’ని సిద్ధం చేశారు. ఈ బోట్ ముందు భాగంలో మాస్ట్సెయిల్స్ ఉంటాయి.వెనుక భాగంలో రెండు స్టీరింగ్ వీల్స్, ఆటో పైలట్ సిస్టమ్, నెలకు 20 జీబీ వినియోగించుకునే సౌకర్యంతో కూడిన శాటిలైట్ యాంటెన్నా ఉంటుంది. సముద్ర జలాల్ని శుద్ధి చేసి గంటకు 30 లీటర్లు మంచినీరు ఇవ్వగల ఆర్వో ప్లాంట్ అమర్చారు. అవసరమైన సందర్భాల్లో వినియోగించుకునేందుకు 22 తాళ్లను అందుబాటులో ఉంచారు. ల్యాప్‌టాప్‌లు, మ్యూజిక్ సిస్టం సైతం బోట్లో ఉన్నాయి. బోట్ తయారీలో అధికభాగం ఫైబర్ గ్లాస్‌ను ఉపయోగించారు. వీరి యాత్రను జీపీఎస్ విధానం ద్వారా ట్రాక్ చేస్తూ ప్రయాణం ఎలా సాగుతోందో భారత నౌకాదళం నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది.సోదరి ఇచ్చిన పాండా బొమ్మతో ‘ప్రయాణం చేయడానికి భయం లేదని చెప్పడం లేదు. కానీ అంతకుమించిన ఆత్మ విశ్వాసం కూడా ఉంది. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉంటుందని నా సోదరి పాన్పాన్ అని పిలుచుకునే పాండా బొమ్మ ఇచ్చింది. దీంతోపాటు ఖగోళశాస్త్రవేత్త కార్ల్‌సాగన్ రచించిన పుస్తకాలు తోడు తీసుకెళ్తున్నాను’ అంది లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఈ సందర్భంగా.అమ్మ చేసిన ఊరగాయలతో‘సముద్రం ఒక గొప్ప గురువు. మాకు సహనాన్ని నేర్పిస్తుంది. బోట్‌ను మనం మంచిగా చూసుకుంటే, అది మనల్ని మంచిగా చూసుకుంటుందనే సూత్రాన్నే పాటిస్తాను. తరిణిలో మేమే ఇంజినీర్లం, ఎలక్ట్రీషియన్లం, కార్పెంటర్లం. వాతావరణ నివేదికల్ని అనుసరిస్తూ ప్రయాణం సాగించాలి. ఎనిమిది నెలల పాటు తరిణిలోనే మా నివాసం కాబట్టి పుస్తకాలు తెచ్చుకున్నా. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్, సంగీత వాద్య పరికరాలతోపాటు అమ్మ చేసిన ఊరగాయలు, కాలికట్ చిప్స్, టాపియోకా చిప్స్ తీసుకెళ్తున్నా. ఈ ప్రయాణం మొత్తానికి సరిపడా దోశల పిండి కూడా మా వెంట తీసుకువెళుతున్నాం. డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబొరేటరీ రూ΄పొందించిన ప్రత్యేకమైన ఆహారాన్ని మాకు అందుబాటులో ఉంచారు’ అని తెలిపింది లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా. వీరి యాత్ర సఫలం కావాలని కోరుకుందాం. – కరుకోల గోపీకిశోర్ రాజా, సాక్షి, విశాఖపట్నం -
ప్రాణాలతో సెల్‌గాటం..!
విజయనగరం: వైపు పోలీసులు రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. రోడ్డు నిబంధనలపై వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. అతివేగం ప్రమాదకరమని, ఏమరుపాటుగా ప్రయాణించి ప్రమాదాలకు గురికావద్దని, మీ భద్రత.. మీ చేతిలోనే ఉందంటూ జాగ్రత్తలు చెబుతున్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అయినా.. కొందరు వాహనచోదకుల్లో మార్పు రావడంలేదనేందుకు విజయనగరం పట్టణం పరిసరాల్లో శుక్రవారం ‘సాక్షి’కి చిక్కిన ఈ చిత్రాలే సజీవసాక్ష్యం. సెల్ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నవారిని చిత్రాల్లో చూడొచ్చు. -
ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?
సముద్ర గర్భంలో ఓ అతి పెద్ద అగ్నిపర్వతం బద్దలైతే? అది పెను వాతావరణ మార్పులకు దారి తీస్తే? ఫలితంగా మానవాళి చాలావరకు తుడిచిపెట్టుకుపోతే? ఏదో హాలీవుడ్ సినిమా సన్నివేశంలా అన్పిస్తోందా? కానీ ఇలాంటి ప్రమాదమొకటి కచ్చితంగా పొంచి ఉందట. అదీ ఈ శతాబ్దాంతంలోపు! ఇలాంటి ఉత్పాతాల వల్లే గతంలో మహా మహా నాగరికతలే తుడిచిపెట్టుకుపోయాయట. ఇప్పుడు అలాంటి ప్రమాదం జరిగితే దాని ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ జరగడం లేదంటూ వోల్కెనాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శతాబ్దాంతం లోపు సముద్ర గర్భంలో కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో అగ్నిపర్వత పేలుడు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ జనాభాలో సగానికి పైగా నశించిపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత జనవరి 14న దక్షిణ పసిఫిక్ మహాసముద్ర అంతర్భాగంలో హంగా టోంగా హంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జపాన్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలను భారీ సునామీ ముంచెత్తింది. ఇది ఆయా ప్రాంతాల్లో అపార ఆర్థిక నష్టం కలిగించింది. అంతకు 10 నుంచి ఏకంగా 100 రెట్ల తీవ్రతతో అలాంటి ప్రమాదమే మరికొన్నేళ్లలోనే మనపైకి విరుచుకుపడవచ్చని డెన్మార్క్‌లోని కోపెన్హెగన్లో ఉన్న నీల్స్ బోర్ ఇన్స్టిట్యూట్ బృందం హెచ్చరిస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లోని మంచు నిల్వలపై వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందట. ‘మాగ్నిట్యూడ్ 7’ తీవ్రతతో విరుచుకుపడే ఆ ఉత్పాతాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో లేదని బర్మింగ్హం యూనివర్సిటీలో వోల్కెనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జిస్టు మైకేల్ కసిడీ అంటుండటం ఆందోళన కలిగించే విషయం. హంగా టోంగా హంగా అగ్నిపర్వత పేలుడును పలు అంతరిక్ష ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రించాయి. ‘‘దాని తాలూకు బూడిద వాతావరణంలో వేలాది అడుగుల ఎత్తుకు ఎగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి కూడా ఇది స్పష్టంగా కన్పించింది’’ అని నాసా పేర్కొంది. ‘‘ఆస్టిరాయిడ్లు ఢీకొనడం వంటి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని తప్పించే కార్యక్రమాలపై నాసా వంటి అంతరిక్ష సంస్థలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. కానీ తోకచుక్కలు, ఆస్టిరాయిడ్లు ఢీకొనే ముప్పుతో పోలిస్తే భారీ అగ్నిపర్వత పేలుడు ప్రమాదానికే వందలాది రెట్లు ఎక్కువగా ఆస్కారముందన్నది చేదు నిజం. అయినా ఇలాంటి వినాశనం తాలూకు ప్రభావం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి కార్యక్రమమూ లేకపోవడం విచారకరం’’ అంటూ కసిడీ వాపోయారు. అప్పట్లో అపార నష్టం ‘7 మాగ్నిట్యూడ్’తో చివరిసారిగా 1815లో ఇండొనేసియాలోని తంబోరాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని దెబ్బకు లక్ష మందికి పైగా మరణించారు. పేలుడు ఫలితంగా అప్పట్లో వాతావరణంలోకి ఎగసిన బూడిద పరిమాణం ఎంత భారీగా ఉందంటే 1815ను ఇప్పటికీ వేసవి లేని ఏడాదిగా చెప్పుకుంటారు. దాని దెబ్బకు భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గింది. ఆ ఫలితంగా సంభవించిన వాతావరణ మార్పుల దెబ్బకు ఆ ఏడాది చైనా, యూరప్, ఉత్తర అమెరికాల్లో ఒకవైపు భారీగా పంట నష్టం జరిగింది. మరోవైపు భారత్, రష్యా తదితర ఆసియా దేశాలను భారీ వరదలు ముంచెత్తాయి. 1815తో పోలిస్తే నేటి ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతోందని గుర్తుంచుకోవాలని కసిడీ అంటున్నారు. ‘‘ఇప్పుడు గనక అలాంటి ఉత్పాతం జరిగితే లెక్కలేనంత మంది చనిపోవడమే గాక అంతర్జాతీయ వర్తక మార్గాలన్నీ చాలాకాలం పాటు మూతబడవచ్చు. దాంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలు, మరికొన్నిచోట్ల వరదల వంటివి తలెత్తుతాయి’’ అని హెచ్చరించారు. ‘‘సముద్ర గర్భంలో ఎన్ని వందలు, వేల అగ్నిపర్వతాలు నిద్రాణంగా ఉన్నదీ మనకు తెలియదు. ధ్రువాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది. సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడికి సముద్ర గర్భంలో ఏదో ఓ నిద్రాణ అగ్నిపర్వతం అతి త్వరలో ఒళ్లు విరుచుకోవచ్చు. కనీవినీ ఎరగని రీతిలో బద్దలు కావచ్చు. అది జనవరి 14 నాటి పేలుడును తలదన్నేలా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటినుంచే సన్నద్ధమైతే మంచిదని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బొద్దింకల నుంచి రక్షించుకుందాం!
ఈ లోకంలో దొరికే సమస్త పదార్థాలన్నింటినీ తిని హారాయించుకునే ఏకైక జీవులు బొద్దింకలు. అవి ఎంతకూ అంతరించిపోవట. అందుకే... అణుయుద్ధం సంభవించి జీవజాతులన్నీ అంతరించిపోయినా బొద్దింకలు బతికే ఉంటాయని ఒక అంచనా. అంతేకాదు... బొద్దింక తలను తొలగించినా... అది తొమ్మిది రోజులు బతుకుతుంది. చివరికి మెదడు లేనందకవి మరణించవు గానీ... తల లేకపోవడంతో ఆహారం అందని కారణంగానే అవి చనిపోతాయట. అంతటి పవర్ఫుల్ బొద్దింకలు పెరిగే ప్రధాన ప్రదేశాలు మన వంటిళ్లు. ఈ ప్రపంచంలోని ఏ కిచెన్ కూడా బొద్దింకలకు మినహాయింపు కాదంటే అది అతిశయోక్తి కాదు. ఈ బొద్దింకలనుంచి ఆరోగ్యాలకు వచ్చే ప్రమాదలేవీ వెనువెంటనే రావు. కానీ మన వంటింట్లోని ఆహార పదార్థాలన్నింటినీ అవి కలుషితం చేస్తాయి. ప్రధానంగా రాత్రిపూట మనం వంటింట్లోకి వెళ్లినప్పుడు మనం దాచిన ఆహారపదార్థాలపై అవి స్వైరవిహారం చేస్తూ కనిపిస్తాయి. మళ్లీ పగటిపూట అవి ఎక్కడిదొంగలు అక్కడేలా గప్‌చిప్‌గా ఉండిపోతాయి. క్రితం రాత్రి సైలెంట్‌గా సంచరించిన ఆ బొద్దింకల ప్రభావం కారణంగా మనకు నీళ్ల విరేచనాలు వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. వటితో మనకు వచ్చే మరో అనర్థం ఏమిటంటే... బొద్దింకలు అలర్జీని, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అందువల్ల ఆస్తమా రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వెరసి ఆస్తమా, అలర్జీ రోగులు తమ ఇళ్లలో బొద్దింకల నుంచి వచ్చే ప్రమాదాలను రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మరి బొద్దింకల నుంచి రక్షించుకోవడం ఎలా? బొద్దింకలను తుదముట్టించడానికి మార్కెట్లో దొరికే విషపదార్థాలున్న ద్రావణాలను పిచికారి చేయడం మరింత ప్రమాదం. దాని వల్ల మన కిచెన్‌ను మనమే విషపూరితం చేసుకునే ప్రమాదం ఉంటుంది. ఈ విషాల్లో సంచరించిన బొద్దికలు మళ్లీ మన ఆహారాలపై తిరిగితే అది మరల మనకే హాని చేసే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మనం తినగా మిగలిగిన ఆహార పదార్థాలను మెష్ ఉండే కప్‌బోర్డుల వంటి సురక్షితమైన చోట ఉంచుకోవాలి. ఇక బొద్దింకలు బాగా తేమగా, తడిగా, వెలుగు అంతగా ప్రసరించని చోట పెరుగుతాయి. కాబట్టి ఇంట్లోని ప్రతి ప్రదేశమూ పొడిగా, వెలుతురూ, గాలీ ధారాళంగా వచ్చేలా చూసుకుంటే బొద్దింకలు పెద్దగా పెరగవు. బొద్దింకల సంఖ్య తక్కువగా ఉండేలా చూసుకుంటే వాటితో కలిగే అనర్థాలను సాధ్యమైనంతగా తగ్గించవచ్చు. -
ముంచే ఆట..
ఈత చాలా సరదాగా ఉండే ఆట మాత్రమే కాదు. శరీరానికి అవసరమైన వ్యాయామం కూడా. అయితే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇది ముంచేస్తుంది. అందుకే పిల్లలు ఈతకు వెళ్లాలంటే పెద్దలు తోడుండాల్సిందే! ఈత ఆడేటప్పుడు కూడా పెద్దలు గమనిస్తూనే ఉండాలి. లేకుంటే జరగరాని సంఘటన ఏదైనా జరగవచ్చు. తిరుపతి సిటీ : ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఇంకో పది రోజుల్లో వేసవి సెలవులు వస్తున్నాయి. ఇప్పుడు చిన్నారులు బడి నుంచి ఇంటికి రాగానే బ్యాగ్‌ను పక్కన పెట్టి ఆటల బాట పడుతున్నారు. నగరంలో ఈత కొలనులు తగినన్ని లేనందున శివారు ప్రాంతాల్లోని చెరువులు, బావుల్లో ఈత కొట్టేందుకు చిన్నారులు ఉత్సాహం చూపుతున్నారు. తల్లిదండ్రులు వీరిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. బడి ముగిశాక చిన్నారులు స్నేహితులతో ఆటలు ఆడేందుకు ఇష్టపడతారు. కానీ పిల్లలను ఇంటి ఆవరణలో, పరిసర ప్రాంతా ల్లో ఆడుకునేలా, చదువుకునేలా తల్లిదండ్రులు దృష్టిసారిం చాలి. పిల్లలకు ఈత నేర్పాలనుకుంటే తల్లిదండ్రులు కానీ, కుటుంబసభ్యులు కానీ తీసుకెళ్లి వెంట ఉండి నేర్పించడం ఉత్తమం. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్కాంప్లెక్స్లో ఉన్న స్వి మ్మింగ్ పూల్ ఈత నేర్చుకోవడానికి అందుబాటులో ఉంది. దాంతో పాటు తిరుపతి నగరంలోని పలు స్టార్ హోటళ్లలో స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులో ఉన్నాయి. గంటకు 500 నుంచి 1000 రూపాయలు లోపు ఫీజు వసూలు చేస్తారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు - బడి వదలగానే పిల్లలను అవసరమైతే తప్ప బయటకు పంపడం మంచిదికాదు. వీలైతే విశ్రాంతి తీసుకునేలా చూడాలి. - పిల్లల కోసం తల్లిదండ్రులు కొంత సమయాన్ని కేటాయించాలి. వారితో సరదాగా సంతోషంగా, విజ్ఞాన వినోద సంబంధమైన పుస్తకాలు చదివేలా చూడాలి. - పిల్లలకు ఇంటినుంచి బయటకు వెళ్లిన తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేలా అవగాహన కల్పించాలి. - తల్లిదండ్రులకు ఇంటిపనులకు సాయమందించేలా అలవాటు నేర్పించాలి. ఇంటిలోనే ఉంటూ క్యారంబోర్డు, చెస్ వంటి క్రీడలను పిల్లలకు అలవాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవి నుంచి ఉపశమనం ఈత నేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా వేసవిలో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే రోజూ గంట సేపు ఈత కొట్టడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుంది. కండరాలకు మంచి వ్యాయామం ఉంటుంది. ఎండల్లో పిల్లలు తిరగకుండా ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎక్కువగా తిరగడం వల్ల డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం పూట ఎండలో తిరగకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. -
పాక్‌లో వేళ్లూనుతున్న ఐఎస్
ఇస్లామాబాద్: కిరాతకమైన ఐఎస్ ఉగ్రవాదం పాకిస్తాన్లో చాలా వేగంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (పీఐపీఎస్) సంస్థ తాజా గణాంకాలు విడుదల చేసింది. పాక్‌లో ఐఎస్ ప్రభావం ఉత్తర సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో విస్తృతంగా ఉందని పిప్స్ పేర్కొంది. ఇటీవల బలూచిస్తాన్‌లో ఇద్దరు చైనీయుల హత్యకు పాల్పడింది ఈ ఉగ్రవాద సంస్థేనని తెలిపింది. ‘స్పెషల్ రిపోర్ట్ 2017’ పేరుతో విడుదల చేసిన సర్వేలో పాకిస్తాన్ ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్లను పిప్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సంస్థల కన్నా తెహ్రిక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్, జమాతుల్ అహ్రార్ సంస్థలు పాక్ అంతర్గత భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొంది. 2016తో పోలిస్తే 2017లో పాకిస్తాన్‌పై సీమాంతర దాడులు 131 శాతం పెరిగాయని తెలిపింది. -
స్మార్ట్‌ఫోన్ సెన్సర్లతో జాగ్రత్త
సింగపూర్: స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసేటప్పుడు కెమెరా, స్క్రీన్, బ్యాటరీ వంటి వాటితోపాటు ఏయే సెన్సర్లు ఉన్నాయో చూస్తుంటాం. స్మార్ట్‌ఫోన్‌లో యాక్సిలోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ, యాంబియంట్ లైట్ సెన్సర్లతో పాటు ఇతర సెన్సర్లు కూడా ఉంటాయి. ఇవన్నీ స్మార్ట్‌ఫోన్‌ను మరింత స్మార్ట్‌గా మారుస్తాయి. అయితే ఈ సెన్సర్లు చాలా ప్రమాదకరమైనవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ సెన్సర్ల సమాచారంతో పాస్వర్డ్స్, పిన్ నంబర్లను తేలికగా కనుక్కోవచ్చని చెబుతున్నారు. ఈ సమాచారాన్ని ఉపయోగించి హ్యాకర్లు ఫోన్ అన్‌లాక్ చేయగలరని సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధనలో భారత సంతతి శాస్త్రవేత్త కీలకపాత్ర పోషించారు. దీనిలో భాగంగా మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్, ఫోన్లోని ఆరు సెన్సర్ల సమాచారాన్ని ఉపయోగించి ఫోన్‌ను శాస్త్రవేత్తలు అన్‌లాక్ చేశారు. అది కూడా 99.5 శాతం కచ్చితత్వంతో కేవలం మూడు ప్రయత్నాల్లోనే ఫోన్‌ను అన్‌లాక్ చేయగలిగామని వివరించారు. ఇంతకుముందు ఫోన్ అన్‌లాక్ చేయగలిగే రేటు 74 శాతంగా ఉండేది. మనం ఫోన్ కీబోర్డులో పాస్‌వర్డ్స్‌ని ఎంటర్ చేసే సమయంలో ఫోన్లో కలిగే కదలికలను ఈ సెన్సర్లు సమాచార రూపంలో నమోదు చేసుకుంటాయి. ఈ సమాచారంతోనే ఫోన్ అన్‌లాక్ చేశారు. -
హెర్బల్, నేచురల్ సిగరెట్లతోనూ ప్రమాదమే..!
పొగరాయుళ్ళకు మరో షాక్... ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా... అందుకు బానిసలైనవారు మాత్రం మానలేకపోతుంటారు. కొందరు మానేందుకు ప్రయత్నించే మార్గంలో ఇతర అలవాట్లను చేసుకుంటే, కొందరు హెర్బల్ సిగరెట్లు, బీడీల వంటి ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తుంటారు. అయితే సిగరెట్ ఎలాంటిదైనా ప్రమాదమే అంటున్నారు వైద్య నిపుణులు. ధూమపానం... స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కొరోనరీ ఆర్టరీ వంటి వ్యాధులకు కారణమౌతుందని, క్లోవ్ (లవంగం) సిగరెట్లను కూడ టుబాకోతో కలిపే తయారు చేస్తారని చెప్తున్నారు. మారుమూల గ్రామాల్లోనూ, పల్లెల్లోనూ వాడే బీడీల అలవాటుకూడ ఆరోగ్యానికి హాని చేకూరుస్తుందని హెచ్చరిస్తున్నారు. సిగరెట్లలో ఉండే నికోటిన్ మనుషులను బానిసలుగా మారుస్తుంది. అంతేకాక గుండె జబ్బులు, కొరోనరీ ఆర్టెరీ వ్యాధులకు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణమౌతుంది. ఈ నేపథ్యంలో ధూమపానాన్ని మానుకోలేని వారు సాధారణ సిగరెట్లకు ప్రత్యామ్నాయంగా హెర్బల్, నేచురల్ సిగరెట్లను ఆశ్రయిస్తుంటారు. కొంతలో కొంత ఈ సిగరెట్లు ఆరోగ్యానికి హాని కలిగించవని నమ్ముతారు. అయితే ఈ హెర్బల్, నేచురల్ సిగరెట్లవల్ల కూడ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అన్న విషయాన్ని గుర్తించక, మంచివే అన్న భ్రమలో రోగాలను కొనితెచ్చుకుంటారు. హెర్బల్ పదార్థాలు కూడ కాలుతున్నపుడు కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికారక టాక్సిన్స్ ను విడుదల చేస్తాయి. అటువంటి హెర్బల్ సిగరెట్ల పొగను పీల్చుకున్నపుడు శ్వాస ద్వారా టాక్సిన్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. అందుకే ఫెడరల్ ట్రేడ్ కమిషన్ లెక్కల ప్రకారం హెర్బల్ సిగరెట్లపై కూడ ఆరోగ్యానికి హానికరం అన్న హెచ్చరిక ఇవ్వాల్సి ఉంది. హెర్బల్ సిగెరెట్లు కూడ సాధారణ సిగరెట్లలాగే ఆరోగ్యానికి తీవ్ర నష్టాన్ని కలుగ జేస్తాయన్న విషయం పొగరాయుళ్ళకు షాక్ కలిగించవచ్చు. అయితే వీటిలో అభిరుచి పుష్పం, మొక్కజొన్న పట్టు, గులాబీ రేకులు, తామర ఆకు , లికోరైస్ వేరు , మల్లెపూవు, గిన్సెంగ్, ఎర్ర లవంగ పూలను వాడుతుంటారు. కాగా లవంగాల వంటివి వాడే హెర్బల్ సిగరెట్ల లాగానే బీడీలు కూడ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లవంగం సిగరెట్లలో 60 నుంచి 70 శాతం టుబాకోతో పాటు.. 30 నుంచి 40 శాతం మాత్రమే లవంగాలను వాడతారు. దీంతో ఈ ప్రత్యామ్నాయ సిగరెట్టలో పొగాకు ఉత్పత్తులకంటే ఎక్కువగా నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుందని, ఇది కూడ ధూమపానంకంటే ఆరోగ్యానికి అధిక హాని కలిగిస్తుందని పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాదరణ పొందిన బీడీల్లో కూడ శుద్ధి చేయని, వడకట్టని టుబాకో వాడతారని, సిగరెట్లకన్నా తక్కువ ధర ఉండటంతో వీటిని గ్రామాల్లో ఎక్కువగా వాడుతుంటారని, వీటిలో ఉండే నికోటిన్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని చెప్తున్నారు. -
స్టెరాయిడ్స్‌తో పా‘పాలు’!
* పాడి పశువుల్లో పాల దిగుబడి పెంపునకు తయారీ * ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్ట్ * వెయ్యి స్టెరాయిడ్ బాటిళ్ల స్వాధీనం హైదరాబాద్: పాడి పశువుల్లో అధిక పాల దిగుబడి కోసం నగరంలో (హైదరాబాద్) ఆక్సిటోసిన్ ఉత్ప్రేరకాల (స్టెరాయిడ్)ను తయారు చేసి మార్కెట్లో చెలామణి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ముఠాలోని ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి వెయ్యి స్టెరాయిడ్ బాటిళ్లతోపాటు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కార్యకలాపాల వివరాలను నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం...బహదూర్‌ఫురా కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన వ్యాపారి లచ్చు రాయి (34) అనే వ్యక్తి ఏడాదిగా ఆక్సిటోసిన్ స్టెరాయిడ్ తయారు చేస్తున్నాడు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఠాకూర్ సుఖ్‌దేవ్‌సింగ్ , చార్మినార్ జోన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ రఫీలు సంయుక్తంగా దాడులు చేసి శనివారం బహదూర్‌పురాలో రెండు కాటన్లతో తచ్చాడుతున్న లచ్చు రాయిని అదుపులోకి తీసుకోగా అతని వద్ద 40 బాటిళ్ల ఆక్సిటోసిన్ స్టెరాయిడ్స్ లభ్యమయ్యాయి. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ వ్యాపారం చేస్తున్నానని పోలీసుల విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. లెసైన్స్ కలిగిన ఔషద దుకాణం నుంచి రసాయనాలు కొనుగోలు చేసి 150 మిల్లీ లీటర్ల బాటిళ్లలో స్టెరాయిడ్‌ను తయారు చేస్తున్నట్లు నిందితుడు తెలిపాడు. ఇలా తయారు చేసిన ఒక్కో స్టెరాయిడ్ బాటిల్‌ను చార్మినార్ ప్రాంతానికి చెందిన ముఖేశ్ అగర్వాల్(40)కు రూ. 10 చొప్పున విక్రయిస్తున్నట్లు వివరించాడు. ఫలక్‌నుమాలో డెయిరీ ఉత్పత్తుల దుకాణం నిర్వహించే ముఖేశ్ తన వద్దకు వచ్చే వినియోగదారులకు ఒక్కో బాటిల్‌ను రూ. 20 నుంచి రూ. 25కు వరకు విక్రయిస్తున్నాడు. లచ్చు రాయి అందించిన వివరాల ఆధారంగా ముఖేశ్ అగర్వాల్, ఈద్‌బజార్‌లో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న షేక్ అబ్దుల్ ఖలీద్ అలియాస్ అఫ్రోజ్ అలియాస్ నాసర్ అలీ అలియాస్ నానబా (30)లను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. యూపీకి చెందిన మోసిన్ అనే దళారీ నుంచి స్టెరాయిడ్ తయారీ ముడిసరుకును అబ్దుల్ ఖలీద్ కొనుగోలు చేసి స్టెరాయిడ్స్‌ను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు మోసిన్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. -
సెల్ఫీ తీసుకోవాలా.. ఇవి పాటించండి..
మాస్కో: ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తోన్న ట్రెండ్ ‘సెల్ఫీ’. యువతలో అయితే దీనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెల్ఫీ తీసుకోవడం, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అప్లోడ్ చేయడం.. తర్వాత వాటికి వచ్చే లైక్‌లు, కామెంట్ల కోసం ఎదురుచూసే ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. అందరిలా మామూలుగా సెల్ఫీలు తీసుకుంటే కిక్ ఏముంది అనుకొని కొందరు తమ ప్రత్యేకత చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదకర, వింత ప్రదేశాల్లో విభిన్న రీతిలో సెల్ఫీలు తీసుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో అనేక మంది గాయపడుతున్నారు. మరి కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సెల్ఫీ జాడ్యం వల్ల సమస్యలు కొనితెచ్చుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. రష్యాలో సెల్ఫీల మోజులో పడి అక్కడి యువత ఎక్కువగా గాయాలు పాలవుతోంది. ఇలా సెల్ఫీ ప్రమాదాలు పెరిగిపోతుండడంతో అక్కడి ప్రభుత్వం సెల్ఫీలు తీసుకోవడంపై ప్రజలకు ఇటీవల కొన్ని సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో సేఫ్ సెల్ఫీల కోసం నిపుణులు కొన్ని సూచనలు చేశారు. అవి. సెల్ఫీ తీసుకునే ప్రదేశం సురక్షితమైనదో కాదో చూడాలి. ఎత్తై ప్రదేశాలు, భవనాల అంచులకు వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించకూడదు. జంతుప్రదర్శన శాలలకు వెళ్లినప్పుడు అక్కడి జంతువులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం చేయొద్దు. ఆ సమయంలో జంతువులు దాడి చేసే అవకాశముంది. రోడ్డు మధ్యలో, రైలు పట్టాల మధ్యలో నిలబడి వెనుక వాహనాలు, రైలు వస్తున్నప్పుడు సెల్ఫీ కోసం ప్రయత్నించొద్దు. ఇది ప్రమాదకరం. కదులుతున్న వాహనాలపై నిలబడి కూడా సెల్ఫీ తీసుకోవద్దు. అలాగే విద్యుత్ వైర్లు తగిలే ప్రదేశాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదకర ఆయుధాలు చేతబట్టి వాటితో సరదాగా సెల్ఫీలు తీసుకోవడం కూడా ఎక్కువైంది. అయితే ఈ సమయంలో కొన్ని సార్లు పొరపాట్ల వల్ల గాయాలపాలవుతున్నారు. అందుకే ఇలాంటి సెల్ఫీలకు ప్రయత్నించకూడదు. జలపాతాల దిగువన, నదుల మధ్యలో సెల్ఫీలు తీసుకోవడం ప్రమాదకరం.