ఇస్లామాబాద్: కిరాతకమైన ఐఎస్ ఉగ్రవాదం పాకిస్తాన్‌లో చాలా వేగంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (పీఐపీఎస్) సంస్థ తాజా గణాంకాలు విడుదల చేసింది. పాక్‌లో ఐఎస్ ప్రభావం ఉత్తర సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో విస్తృతంగా ఉందని పిప్స్ పేర్కొంది. ఇటీవల బలూచిస్తాన్‌లో ఇద్దరు చైనీయుల హత్యకు పాల్పడింది ఈ ఉగ్రవాద సంస్థేనని తెలిపింది.
‘స్పెషల్ రిపోర్ట్ 2017’ పేరుతో విడుదల చేసిన సర్వేలో పాకిస్తాన్ ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్లను పిప్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సంస్థల కన్నా తెహ్రిక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్, జమాతుల్ అహ్రార్ సంస్థలు పాక్ అంతర్గత భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొంది. 2016తో పోలిస్తే 2017లో పాకిస్తాన్‌పై సీమాంతర దాడులు 131 శాతం పెరిగాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment