Latest report
-
భవిష్యత్తు ప్రణాళిక బహు క్లిష్టం
సాక్షి, హైదరాబాద్: సంస్థలు, కుటుంబాలు, వ్యక్తులు.. ఎవరైనా భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం కీలకం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. భవిష్యత్తు ప్రణాళిక క్లిష్టంగా మారుతోంది. భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, స్తబ్ధతలో కూరుకుపోతున్నామనే భా వనలో మెజారిటీ ప్రజలున్నారు. 69 శాతం మంది భారతీయులు భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని తేలింది. ఊహించని మార్పులను ఎదుర్కొంటున్నట్టుగా 91 శాతం మంది అంగీకరించారు. పరిస్థితుల ›ప్రభావంతో ఆత్మవిశ్వాసం, నమ్మకం సన్నగిల్లుతుండడంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు సన్నద్ధంగా లేమని 62 శాతం మంది అభిప్రాయపడ్డారు. వ్యక్తులుగా.. సరైన వేళకు.. సరైన నిర్ణయాలు తీసుకో లేకపోతున్నామని మధనపడుతున్నట్లు 57 శాతం పేర్కొన్నారు. ఇదీ అధ్యయనం.. హెచ్ఎస్బీసీ సంస్థ ఆధ్వర్యంలో.. భారత్, హాంకాంగ్, సింగపూర్, యూఏఈ, యూకే, యూఎస్‌లలోని వివిధ రంగాలు, మార్కెట్లకు చెందిన దాదాపు 18వేల మంది వ్యక్తులు (దాదాపు 4 వేల బిజినెస్ లీడర్లు)పై జరిపిన గ్లోబల్ స్టడీ ఆధారంగా నివేదికను సిద్ధం చేశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలపై హెచ్ఎస్బీసీ ఇండియా హెడ్ (వెల్త్ అండ్ పర్సనల్ బ్యాంకింగ్) సందీప్ బాత్రా స్పందిస్తూ.. దైనందిన జీవనంలో సమస్యలు ఎదురైనపుడు వాటిని ఎదుర్కొనేందుకు.. ఏదో ఒక రూపంలో సహాయపడాలని హెచ్ఎస్బీసీ భావిస్తోందని తెలిపారు. వ్యాపార, వాణిజ్య, ఇతర రంగాల్లో ప్రజలకు తగిన సలహాలు, సూచనలిచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. జీవితంలో క్లిష్టమైన సవాళ్లు ఎదురైనపుడు అంతర్జాతీయ నెట్వర్క్ సహాయంతో అనిశి్చతిని అధిగమించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. నివేదికలో ఏముందంటే.. » వేగంగా మార్పులు సంభవిస్తున్న యుగంలో తామున్నట్టు 91 శాతం మంది భారతీయుల భావన » భవిష్యత్ ప్రణాళికల రచనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులు 69 శాతం మంది ఉన్నారు. » తీసుకున్న నిర్ణయాల అమలుకు సిద్ధంగా లేమని భావిస్తున్నవారు, ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందనుకున్నవారు 62 శాతం మంది ఉన్నారు. » తగిన సమయంలో అవకాశాలు కోల్పోయినందుకు, తగిన నిర్ణయం తీసుకోలేకపోయినందుకు చింతిస్తున్నవారు 57 శాతం మంది ఉన్నారు. » తాము తీసుకున్న నిర్ణయాలు చివరకు సరైనవి కావనే భావనలో 46 శాతం మంది ఉన్నారు. » సరైన నిర్ణయాలు తీసుకోలేక.. వాటిని వీలైనంత వాయిదా వేస్తున్న వారు 42 శాతం మంది ఉన్నారు. » నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులు 33 శాతం మంది ఉన్నారు.భారత్‌కు యూఎస్ తోడుఈ అధ్యయనానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే.. భారత్‌లో మాదిరిగానే యూఎస్ఏలోనూ 47 శాతం మంది అ మెరికన్లు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తప్పటడుగులు వేస్తున్నారు.» అమెరికన్లలో 33 శాతం మంది తాము తీసుకున్న పాత నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. » ఐదేళ్లలో.. ఇతరులతో సంబంధం లేకుండా వేరుగా ఉన్నామనే భావనలో 43 శాతం అమెరికన్ మహిళలున్నారు. అదే పురుషుల విషయానికొస్తే 26 శాతంగా ఉంది.» యూఎస్‌లో బిజినెస్ లీడర్లు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంతో పోల్చితే భవిష్యత్ ప్రణాళికలు మరింతగా సవాళ్లతో కూడుకున్నవనే భావనలో 51 శాతం మంది ఉన్నారు. -
వైఎస్ జగన్‌కు ప్రాణహాని ఉంది
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రాణహాని ఉందని రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్ఆర్సీ) అంగీకరించింది. ప్రాణహాని విషయంలో తాజా నివేదికను విశ్లేషించిన తరువాతే జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగించాలని సిఫారసు చేశామని ఆ కమిటీ హైకోర్టుకు వివరించింది. జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారని, ఆయన ఇంకా బతికే ఉన్నారని, చచ్చే వరకు కొట్టాలంటూ నర్సీపట్నం ఎమ్మెల్యే, శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మరో టీడీపీ నేత మధ్య సాగిన సంభాషణ కూడా నిజమేనని అంగీకరించింది. ఇవి అయ్యన్నపాత్రుడు స్పీకర్ కాక ముందు మాట్లాడిన మాటలని తెలిపింది. ఆ వీడియోను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పింది. ఈ సంభాషణకు, వైఎస్ జగన్‌కు ప్రాణహాని ఉందనేందుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. వైఎస్ జగన్ సొంత వాహనమైన టయోటా ఫారŠుచ్యనర్కు బుల్లెట్ ప్రూఫ్ చేసుకునేందుకు అనుమతినిచ్చామని పేర్కొంది. ప్రాణహాని నేపథ్యంలో నాటి భద్రత పునరుద్ధరణకు జగన్ పిటిషన్తనను అంతమొందించడమే ప్రస్తుత కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ నేపథ్యంలో తనకున్న ప్రాణహానిని పరిగణనలోకి తీసుకోకుండా భద్రతను భారీగా కుదించేసిందంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది జూన్ 3 నాటికి తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ఎస్ఆర్సీని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఎస్ఆర్సీ తరఫున ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) డీఐజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్పీ ఎస్.నచికేత్ విశ్వనాథ్ కౌంటర్ దాఖలు చేశా>రు. భద్రత విషయంలో జగన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి గురువారం మరోసారి విచారణ జరిపారు. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేసినట్లు హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి చెప్పగా.. కౌంటర్ బుధవారం సాయంత్రం అందజేశారని, తాము సమాధానం (రిప్లై) ఇస్తామని జగన్ తరఫు న్యాయవాది చింతల సుమన్ తెలిపారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. నిర్దిష్టంగా వాయిదా తేదీ ఇవ్వాలని సుమన్ కోరడంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 13కి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.ఎస్ఆర్సీ కౌంటర్లోని ముఖ్యాంశాలు‘జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎల్లో బుక్ ప్రకారం జెడ్ కేటగిరీ భద్రత ఉండేది. ముఖ్యమంత్రి అయిన తరువాత దానిని జెడ్ ప్లస్ కేటగిరీకి మార్చి 58 మందితో భద్రత కల్పించాం. ఈ ఏడాది జూలై 16న కమిటీ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి హోదా ఆధారిత భద్రత కల్పించాలని, ఓడిపోయిన వారికి హోదా ఆధారిత భద్రతను తొలగించాలని సిఫారసు చేశాం. అలాగే జగన్మోహన్రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కొనసాగించాలని కూడా సిఫారసు చేశాం. జగన్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన భద్రత బాధ్యతలను డీఎస్పీకి అప్పగించాం. జగన్ భద్రత విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం కల్పిస్తున్న భద్రత సరిపోదని చెప్పేందుకు జగన్ ఎలాంటి ఆధారాలను చూపలేదు. ప్రాణహాని ఉందనేందుకు జగన్ ఎలాంటి ఆధారాలు చూపలేదు. భద్రతను 59కి కుదించిన తరువాతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవలి కాలంలో ఆయనకు ప్రాణహాని కలిగించే ఘటనలేవీ జరగలేదు. ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్ వినియోగం ఉన్న చోటే జామర్లను అనుమతిస్తాం. అలాంటి ప్రాంతాలకు జగన్ వెళితే అప్పుడు లభ్యతను బట్టి జామర్లు ఏర్పాటు చేస్తాం’ అని నచికేత్ విశ్వనాథ్ తన కౌంటర్లో పేర్కొన్నారు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జగన్ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. -
ఈ కామర్స్ ఎలిఫెంట్ ఫ్లిప్‌కార్ట్
న్యూఢిల్లీ: దేశ ఈ కామర్స్ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. 48 శాతం మార్కెట్ వాటాతో వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ మొదటి స్థానంలో ఉన్నట్టు అలియన్స్ బెర్న్‌స్టీన్ తాజా నివేదిక వెల్లడించింది. అదే సమయంలో జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు కలిగిన మీషో వేగంగా చొచ్చుకుపోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ 21 శాతం మేర యూజర్లను పెంచుకోగా, మీషో 32 శాతం కొత్త యూజర్లను జోడించుకుంది. అదే సమయంలో అమెజాన్ యూజర్ల వృద్ధి 13 శాతానికే పరిమితమైంది. ‘2022–23 సంవత్సరంలో భారత ఈ–కామర్స్‌లో 48 శాతం వాటాతో ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ లీడర్‌గా ఉంది. పరిశ్రమ కంటే వేగంగా ఫ్లిప్‌కార్ట్ వృద్ధి చెందుతోంది. మొబైల్స్, వ్రస్తాలు ఫ్లిప్‌కార్ట్‌కు రెండు పెద్ద విభాగాలుగా ఉన్నాయి. మొబైల్స్‌లో 50 శాతం, వ్రస్తాల్లో 30 శాతం వాటా కలిగి ఉంది. ఆన్లైన్ స్మార్ట్ఫోన్లలో 48 శాతం, ఆన్లైన్ ఫ్యాషన్ విభాగంలో 60 శాతం చొప్పున మార్కెట్ వాటా ఫ్లిప్‌కార్ట్ కలిగి ఉంటుందని అంచనా’ అని ఈ నివేదిక తెలిపింది. చిన్న పట్టణాలపై మీషో గురి జీరో కమీషన్ నమూనాలో ద్వితీయ శ్రేణి, చిన్న పట్టణాలపై మీషో వ్యూహాత్మకంగా దృష్టి సారించడం ద్వారా మార్కెట్ వాటాను వేగంగా పెంచుకుంటున్నట్టు బెర్న్‌స్టీన్ నివేదిక వెల్లడించింది. భారత్‌లో ఈ కామర్స్ యాప్ డౌన్లోడ్లలో 48 శాతం మేర మీషోనే ఉంటున్నట్టు పేర్కొంది. ‘గడిచిన 12 నెలల్లో మీషో ఆర్డర్ల పరిమాణం 43 శాతం మేర పెరిగింది. ఆదాయంలో 54 శాతం వృద్ధి నెలకొంది. మళ్లీ, మళ్లీ కొనుగోలు చేసే కస్టమర్లు 80 శాతంగా ఉన్నారు. మీషోలో 80 శాతం విక్రేతలు రిటైల్ వ్యాపారవేత్తలు కాగా, ప్లాట్‌ఫామ్‌పై 95 శాతం కొనుగోళ్లు అన్బ్రాండెడ్వే ఉంటున్నాయి. నెలవారీ 12 కోట్ల సగటు యూజర్లతో మీషో భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ కంపెనీ. ప్రస్తుతం మీషో స్థూల వాణిజ్య విలువ (జీఎంవీ) 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ’అని ఈ నివేదిక వెల్లడించింది. ఫ్యాషన్‌లో మింత్రా టాప్... ఫ్యాషన్ ఈ–కామర్స్‌లో రిలయన్స్‌కు చెందిన అజియో 30 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నట్టు బెర్న్‌స్టీన్ నివేదిక తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సంస్థ మింత్రా ఈ విభాగంలో 50% మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉంది. 2023 డిసెంబర్లో పోటీ సంస్థల కంటే మింత్రాయే మెరుగ్గా 25 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. ఈ–గ్రోసరీలో బ్లింకిట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. ఉత్పత్తుల శ్రేణి, కస్టమర్లకు చేరువ విషయంలో జెప్టో బ్లింకిట్‌తో పోలిస్తే వెనుకనే ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. బ్లింకిట్ 40 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంటే, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 37–39% వాటా, జెప్టో 20% వాటాతో తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
చాలా అకౌంట్లు ఫేకే! హిండెన్‌బర్గ్‌కు చిక్కిన ‘బ్లాక్’ బాగోతం ఇదే..
ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు మాజీ సీఈవో జాక్ డోర్సే నేతృత్వంలోని అమెరికా మొబైల్ చెల్లింపు సంస్థ ‘బ్లాక్’పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదికను విడుదల చేసింది. అవకతవకలకు పాల్పడిదంటూ ఆరోపించింది. ఈ నివేదిక ప్రకారం.. గతంలో స్వేర్ (Square Inc) అనే పేరుతో ఉన్న ఈ బ్లాక్ (Block Inc) సంస్థ మార్కెట్ విలువ 44 బిలియన్ డాలర్లు. బ్యాంక్ ఖాతాలు లేనివారి కోసం ఈ సంస్థ సరికొత్త ఆర్థిక సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి? అయితే అదే టెక్నాలజీ ఆధారంగా వినియోగదారులను పెంచుకున్న బ్లాక్ సంస్థ దాన్ని అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. వినియోగదారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోసాన్ని సులభతరం చేయడం, నియంత్రణను నివారించడం, రుణాలు, ఫీజుల దోపిడీని విప్లవాత్మక సాంకేతికతగా మార్చిందని ఆక్షేపించింది. యూజర్ల సంఖ్యను ఎక్కువగా చూపించి ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించిందని ఆరోపించింది. 40 నుంచి 75 శాతం అకౌంట్లు ఫేక్‌వే కరోనా సంక్షోభం అనంతరం బ్లాక్ క్యాష్ యాప్ పురోగతి చాలా మంది విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. బ్లాక్ తన యూజర్ల సంఖ్యను ఎక్కువగా చూపిందని, అదే సమయంలో ఖర్చులను తక్కువగా చూపించిందని హిండెన్‌బర్గ్ నివేదిక పేర్కొంది. బ్లాక్ కస్టమర్ల అకౌంట్లలో 40 నుంచి 75 శాతం ఫేక్‌వేనని ఆరోపించింది. కోవిడ్ సమయంలో 18 నెలల్లో 639 శాతం పెరిగిన బ్లాక్ స్టాక్‌కు కొత్త వ్యాపారం ఒక్కసారిగా పెరుగుదలను అందించిందని నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! జాక్ డోర్సీపై ఆరోపణలు జాక్ డోర్సే బ్లాక్‌లో మోసాన్ని సులభతరం చేశారని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ట్విటర్ సహ వ్యవస్థాపకుడైన డోర్సే 2015 నుంచి 2021 వరకు దాని సీఈవోగా పనిచేశారు. కోవిడ్ సమయంలో బిలియన్ డాలర్ల విలువైన స్టాక్లను డంప్ చేయడం ద్వారా ఆయన లాభపడ్డారని హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆరోపించింది. బ్లాక్ సహ వ్యవస్థాపకులు జాక్ డోర్సే, జేమ్స్ మెక్‌కెల్వే ఇద్దరూ 1 బిలియన్ డాలర్ల స్టాక్‌ను విక్రయించారని పేర్కొంది. సీఎఫ్‌వో అమృతా అహుజాతో సహా ఇతర అధికారులు, క్యాష్ యాప్ లీడ్ మేనేజర్ బ్రియాన్ గ్రాసడోనియా కూడా మిలియన్ డాలర్ల విలువైన స్టాక్‌ను డంప్ చేశారని ఆరోపించింది. ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ పేరుతో కూడా.. బ్లాక్ క్యాష్ యాప్‌లో జాక్ డోర్సీకి అనేక ఫేక్ ఖాతాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ పేరిట కూడా డజన్ల కొద్దీ నకిలీ ఖాతాలు కూడా ఉన్నాయని వివరించింది. ఇదీ చదవండి: పిన్ అవసరం లేదు!.. పేమెంట్ ఫెయిల్ అయ్యే సమస్యే లేదు! -
మధ్యతరగతి విస్ఫోటం
డి.శ్రీనివాసరెడ్డి: మధ్య తరగతి జన విస్ఫోటనం. కొంతకాలంగా ప్రపంచమంతటా శరవేగంగా జరుగుతున్న పరిణామమిది! మార్కెట్ల విస్తరణ, ఆదాయ వనరుల పెరుగుదల తదితర కారణాలతో ఏ దేశంలో చూసినా మధ్య తరగతి జనం ఏటా విపరీతంగా పెరుగుతున్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రపంచ జనాభాలో 40 శాతం పైగా వాటా మధ్యతరగతిదే. దాదాపుగా అన్ని దేశాల్లోనూ ప్రభుత్వాలు నడవడానికి వీరి ఆదాయ వ్యయాలే ఇంధనంగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు! ప్రఖ్యాత వ్యాపార దిగ్గజాలు కూడా వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో మిడిల్ క్లాస్‌ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది! ఏటా 14 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా మధ్య తరగతి జనాభా ఏటా ఏకంగా 14 కోట్ల చొప్పున పెరిగిపోతోందని, ప్రస్తుతం 320 కోట్లుగా ఉందని ప్రపంచ బ్యాకు తాజా నివేదిక వెల్లడించింది. 2030 నాటికి వీరి సంఖ్య 520 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. అంటే ప్రపంచ జనాభాలో ఏకంగా 65 శాతానికి చేరనుందన్నమాట! మొత్తం ప్రపంచ ఆదాయంలో మూడో వంతు ఈ మధ్యతరగతి మహాజనుల నుంచే సమకూరుతోందట! సింహభాగం ఆసియాదే... ఈ శతాబ్దారంభంలో అమెరికా తదితర సంపన్న యూరప్ దేశాల్లో అధిక సంఖ్యాకులు మధ్యతరగతి వారే ఉండేవారు. క్రమంగా అక్కడ వారి వృద్ధి తగ్గుతూ ఆదియా దేశాల్లో శరవేగగంగా పెరుగుతోంది. వరల్డ్ డేటా లాబ్ అంచనా ప్రకారం వచ్చే ఎనిమిదేళ్లలో కొత్తగా రానున్న 100 కోట్ల మంది మధ్యతరగతి జనంలో ఏకంగా 90 శాతం ఆసియాకు చెందినవారే ఉండనున్నారు! భారత్, చైనాతోపాటు ఇండొనేసియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌వంటి ఆసియా దేశాలు మిడిల్ క్లాస్ జనంతో మరింతగా కళకళలాడతాయట. ఆ దేశాల్లో శరవేగంగా సాగుతున్న పట్టణీకరణే అక్కడ మధ్యతరగతి ప్రాబ ల్యానికి తార్కాణం. వీరు చైనాలో 2010 నాటికి జనాభాలో 49 శాతముండగా ఇప్పటికే 56 శాతానికి పెరిగారు. 2035 నాటికి చైనా జనాభాలో ఏకంగా 100 కోట్ల మంది పట్టణవాసులే ఉంటారని అంచనా. భారత్‌లోనూ 2035 నాటికి 67.5 కోట్ల మంది (45 శాతం) పట్టణాల్లో నివసిస్తారట. ఆసియాలో ఈ సంఖ్య 300 కోట్లుగా ఉండనుంది. యూఎస్‌లో పాపం మిడిల్‌క్లాస్... ఒకప్పుడు మధ్యతరగతి ఆదాయ వర్గాల దేశంగా నిలిచిన అమెరికాలో వారి సంఖ్య బాగా తగ్గుతోంది. అక్కడ 35 వేల నుంచి 1.06 లక్షల డాలర్ల వార్షికాదాయముంటే మధ్యతరగతిగా పరిగణిస్తారు. 1971లో దేశ జనాభాలో 61 శాతం మిడిల్ క్లాసే కాగా గతేడాదికి 50 శాతానికి తగ్గిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఇక రష్యా, ఉక్రెయిన్లలో యుద్ధం దెబ్బకు ఒక్క ఈ ఏడాదే ఏకంగా కోటి మంది దాకా మధ్య తరగతి నుంచి దిగువ తరగతికి దిగజారినట్టు ప్యూ నివేదిక వెల్లడించింది. దేశ, కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని తేడాలున్నా మొత్తమ్మీద ఒక వ్యక్తి తన అన్ని అవసరాలకు కలిపి రోజుకు దాదాపు రూ.1,000, ఆ పైన వెచ్చించగలిగితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అతన్ని మధ్యతరగతిగా లెక్కిస్తారు. రూ.5 లక్షల నుంచి 30 లక్షల వార్షికాదాయం ఉన్నవారిని మధ్యతరగతిగా పరిగణిస్తారు. మన దగ్గర కూడా... మధ్యతరగతి మందహాసమే భారత్‌లో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరు మిడిల్ క్లాస్ జీవులే. 2047 నాటికి వీరి సంఖ్య రెట్టింపై ప్రతి ముగ్గురిలో ఇద్దరు వాళ్లే ఉంటారని పీపుల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియాస్ కన్సూ్యమర్ ఎకానమీ (ప్రైజ్) అంచనా. 2005లో దేశ జనాభాలో కేవలం 14 శాతమున్న మధ్యతరగతి ఇప్పుడు ఏకంగా 31 శాతానికి పెరిగింది. 2035 కల్లా 43.5 శాతానికి వృద్ధి చెందనుంది! -
ఏడాదిలో 20 వేలకు పైగా స్కూళ్లు మూసివేత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో 2020–21లో 20 వేలకు పైగా స్కూళ్లు మూతపడ్డాయని కేంద్ర విద్యా శాఖ తాజా నివేదిక వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే టీచర్ల సంఖ్య 1.95% తగ్గిందని తెలిపింది. దేశంలో 44.85% స్కూళ్లకు మాత్రమే కంప్యూటర్ సదుపాయం ఉందని, 34% పాఠశాలల్లో మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉందని పాఠశాల విద్యపై యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+) నివేదించింది. ► 2020–21లో 15.09 లక్షల స్కూళ్లు ఉంటే 2021–22లో 14.89లక్షలకి తగ్గిపోయాయి. ► 2020–21లో 97 లక్షలున్న టీచర్ల సంఖ్య 2021–22 నాటికి 95 లక్షలకి తగ్గిపోయింది. ► దివ్యాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేక టాయిలెట్లు 27%స్కూళ్లలోనే ఉన్నాయి. ► 2020–21లో 25.38 కోట్ల మంది ఉండే విద్యార్థుల సంఖ్య 2021–22 వచ్చేసరికి 25.57 కోట్లకి పెరిగింది. ► ప్రి ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల చేరిక11.5 లక్షలు తగ్గింది. కరోనా ప్రభావంతో చిన్న పిల్లల్ని స్కూళ్లలో చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో వారి సంఖ్య తగ్గింది. -
జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్లపై పరిమితులు ఎత్తేయాలి
న్యూఢిల్లీ: జీరో బ్యాలన్స్తో కూడిన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాల నుంచి డిజిటల్ చెల్లింపులపై ఉపసంహరణ పరిమితులు ఎత్తివేయాలని ఐఐటీ బోంబే నివేదిక సూచించింది. ఈ ఖాతాలకు సంబంధించి విత్‌డ్రాయల్ పరిమితులు ఆర్బీఐ నియంత్రణల వెలుపల ఉండాలని అభిప్రాయపడింది. ఈ కామర్స్ లావాదేవీలపై 0.3 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటును ప్రభుత్వం అమలు చేసేందుకు అనుమతించాలి సూచించింది. 0.3 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) రూపంలో ఏటా రూ.5,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని, దీన్ని యూపీఐ సదుపాయాల బలోపేతానికి ఉపయోగించకోవచ్చని పేర్కొంది. డిజిటల్ పేమెంట్ ఫెసిలిటేషన్ ఫీజు మాదిరే ఈ కామర్స్ మర్చంట్స్, ఇనిస్టిట్యూషన్స్ నిర్వహించే డిజిటల్ లావాదేవీలపై ఎండీఆర్ విధించొచ్చని తెలిపింది. ‘‘ప్రస్తుత డిజిటల్ చెల్లింపుల దశకంలో.. డిజిటల్ చెల్లింపులను పాత తరానికి చెందిన సేవింగ్స్ డిపాజిట్ ఖాతాల ఉపసంహరణ పరిమితుల పరిధి నుంచి తొలగించాలి. కొన్ని బ్యాంక్‌లు లావాదేవీలపై నియంత్రణలు విధిస్తున్నాయి. ఉదాహరణకు ముంబైకి చెందిన ఒక బ్యాంక్ ఒక నెలలో బీఎస్‌బీడీ ఖాతాల నుంచి 10 సార్ల వరకే ఉపసంహరణలను పరిమితం చేసింది. సేవింగ్స్ ఖాతా అన్నది లావాదేవీల కోసం కాదు. కనీస పొదుపు కోసం. ధనిక, పేద మధ్య ఈ ఖాతాల విషయంలో వ్యత్యాసం చూపకూడదు. కావాలంటే ఖాతాలను బట్టి సర్వీజు చార్జీలు భిన్నంగా ఉండొచ్చు. అంతే కానీ, సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ల మధ్య ఉపసంహరణ లావాదేవీల పరంగా పరిమితులు విధించడం వివక్ష కిందకు వస్తుంది. సమానత్వ హక్కుకు భంగం కలిగిస్తుంది’’అని ఈ నివేదిక పేర్కొంది. -
‘జంపింగ్’ బాబులు జడుసుకునే వార్త
న్యూఢిల్లీ: రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా సిగ్నల్ జంప్ చేసే వాహనదారులు అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. జంపింగ్ బాబులు జడుసుకునే వార్త కేంద్రం తాజాగా వెల్లడించింది. రెడ్‌లైట్ జంపింగ్ కారణంగా రోడ్డు ప్రమాద మరణాలు 2019తో పోలిస్తే 2020లో 79 శాతం పెరిగాయని తాజా నివేదికలో పేర్కొంది. 'భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు - 2020' నివేదికను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ వల్ల 2020లో 919 ప్రమాదాలు సంభవించగా.. 476 మంది మృతి చెందారు. 2019లో 266 మంది దుర్మరణం పాలయ్యారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ కారణంగా 2020లో 3,099 మంది ప్రాణాలు కోల్పోగా.. 2019లో 2,726 మంది మృత్యువాత పడ్డారు. మద్యం మత్తులో ప్రమాదాలకు గురై 2020లో 1862 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019లో 2376 మరణాలు నమోదయ్యాయి. మితిమీరిన వేగమే అత్యధిక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. 2020 క్యాలెండర్ సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 3,66,138 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 1,31,714 మంది మరణించగా.. 3,48,279 మంది క్షతగాత్రులయ్యారు. అయితే 2019తో పోలిస్తే ప్రమాదాల సంఖ్య 18 శాతం, మరణాల రేటు 12.8 శాతం తగ్గింది. రోడ్డు ప్రమాద బాధితుల్లో 18-45 ఏళ్ల వయస్సు గల యువకులే 69 శాతం మంది ఉండగా.. మొత్తం మరణాల్లో 18 నుంచి 60 ఏళ్లలోపు వర్కింగ్ వయసులో ఉన్నవారు 87.4 శాతం మంది ఉండడం ఆందోళన కలిగించే అంశం. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020లో ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గడానికి కోవిడ్-19 లాక్డౌన్ కారణమని నివేదిక వెల్లడించింది. మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ, కొత్త మోటారు వాహన చట్టం అమలు చేయడం వల్ల కూడా దుర్ఘటనలు తగ్గినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనదేశంలో 11 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రహదారి దుర్ఘటనల్లో మరణించిన ప్రతి 10 మందిలో ఒకరు మనదేశానికి చెందినవారు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. (క్లిక్: బడికెళ్లాలంటే కాలి నడకే శరణ్యం) 2018లో స్వల్పంగా(0.46 శాతం) పెరగడం మినహా 2016 నుంచి రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే విషయం. వరుసగా రెండో ఏడాది ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గడం కొంతలో కొంత ఊరట. అదేవిధంగా, గాయపడిన వారి సంఖ్య కూడా 2015 నుండి తగ్గుతూ వస్తోంది. (క్లిక్: లడఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు జవాన్లు మృతి) -
టీకా తీసుకున్న వారి ద్వారా కూడా కరోనా వ్యాప్తి
లండన్: కోవిడ్–19 వైరస్ నుంచి రక్షణ కోసం టీకా రెండు డోసులు తీసుకున్న వారి నుంచి కూడా ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతున్నట్టు లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక వెల్లడించింది. అయితే, వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే టీకా తీసుకున్న వారిలో వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నట్టు తెలిపింది. యూకేలోని ఇంపీరియల్ కాలేజీ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తల అధ్యయనం ఫలితాలను లాన్సెట్ వెలువరించింది. ‘‘టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా వైరస్ సోకుతోంది. అయితే వారు త్వరగానే కోలుకుంటున్నారు. కానీ వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించేవారు వ్యాక్సిన్ తీసుకోకపోతే మహమ్మారి వారిని బాగా వేధిస్తోంది’’ అని ఆ నివేదిక వెల్లడించింది. ‘‘కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో వ్యాక్సిన్లే అత్యంత కీలకం. మన చుట్టూ ఉన్నవారు టీకా వేసుకున్నారు, మనకేం కాదులే అన్న ధీమా పనికిరాదు. టీకా వేసుకున్న వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది’’ అని అధ్యయనం సహ రచయిత ప్రొఫెసర్ అజీ లల్వానీ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ కరోనా కేసులు పెరిగిపోవడానికి ఇదే కారణమని వివరించారు. టీకా రెండో డోసు తీసుకున్న 3 నెలల తర్వాత నుంచి వారికి వైరస్ సోకి ఇతరులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించామన్నారు. -
మహమ్మారి తోకముడిచేది అప్పుడే..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ కేసులు 28 లక్షల మార్క్‌ను దాటడంతో వైరస్ వ్యాప్తిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. కోవిడ్-19 విస్తృత వ్యాప్తి నేపథ్యంలో ఇండియా ఔట్‌బ్రేక్ నివేదిక (ఐఓఆర్) ఊరట కలిగించే అంశాలు వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ 3 నాటికి కోవిడ్-19 భారత్‌లో వెనుతిరుగుతుందని స్పష్టం చేసింది. భారత్‌లో నెలకొన్న తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న మీదట సెప్టెంబర్ తొలివారం నాటికి ముమ్మర దశకు చేరుతాయని ఐఓఆర్ అంచనా వేసింది. ఆ సమయానికి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 7,80,000కు చేరుతాయని పేర్కొంది. సెప్టెంబర్ ప్రధమార్ధంలో వైరస్ తీవ్రంగా ప్రబలినా మాసాంతానికి క్రమంగా తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. భారత్‌లో డిసెంబర్ 3 నుంచి కోవిడ్-19 వెనుకపడుతుందని ఈ నివేదిక పేర్కొంది. గతంలో కరోనా హాట్‌స్పాట్స్‌గా పేరొందిన ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో కేసుల తగ్గుదల నేపథ్యంలో ఐఓఆర్ తాజా అంచనాలపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. చదవండి : 58 లక్షల మందిలో యాంటీబాడీలు వృద్ధి నవంబర్ నాటికి ముంబై నగరం కరోనా నుంచి బయటపడుతుందని భావిస్తున్నారు. కరోనా బారినపడిన మరో నగరం చెన్నై సైతం అక్టోబర్ చివరినాటికి మహమ్మారి నుంచి కోలుకుంటుందని నివేదిక పేర్కొంది. నవంబర్ తొలివారం నుంచి దేశ రాజధాని ఢిల్లీ కరోనా రహితమవుతుందని అంచనా వేసింది. ఇక ఆగస్ట్ మాసాంతానికి బెంగళూర్‌లో ముమ్మర దశకు చేరకునే కరోనా వైరస్ నవంబర్ మధ్యలో ఐటీ సీటీని విడిచిపెడుతుందని పేర్కొంది. కోవిడ్-19 కేసులు పెద్ద నగరాల నుంచి నిలకడగా తగ్గుతుండటంతో చిన్న, మధ్యశ్రేణి నగరాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని నివేదిక తెలిపింది. ఆగస్ట్‌లో ఇండోర్, థానే, సూరత్, జైపూర్, నాసిక్, తిరువనంతపురం వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కేసులు పెరుగుతున్నాయని, నవంబర్ ద్వితీయార్ధంలో ఈ నగరాల్లో మహమ్మారి వ్యాప్తికి బ్రేక్‌పడుతుందని నివేదిక అంచనా వేసింది. మరోవైపు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే రేటు (ఆర్ఓ)లో కూడా గణనీయంగా తగ్గుదల చోటుచేసుకుంటోంది. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ మహారాష్ట్రలో ఆర్ఓ 1.24కు తగ్గడం మహమ్మారి బలహీనపడిందనే సంకేతాలు పంపుతోంది. తెలంగాణలోనూ ఇవే గణాంకాలు నమోదవడం ఊరట ఇస్తోంది. -
సమీపకాలం ‘బంగారమే’!
ముంబై: బంగారం డిమాండ్ సమీప కాలంలో పటిష్టంగా ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక సూచిస్తోంది. ఈ ఏడాది (2019) డిమాండ్ పెరుగుదలకు పలు కారణాలు ఉంటాయని డబ్ల్యూజీసీ గురువారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. ఫైనాన్స్ మార్కెట్ల పనితీరు, భారత్‌సహా పలు దేశాల ద్రవ్య పరపతి విధానాలు, డాలర్ కదలికల వంటి అంశాలు పసిడి డిమాండ్‌ను నిర్ణయిస్తాయని వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► ఒడిదుడుకుల ఫైనాన్షియల్ మార్కెట్ల సమయంలో సహజంగా పసిడి పెట్టుబడులకు సురక్షితమైన మెటల్‌గా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రపంచం మొత్తంగా పసిడి డిమాండ్ చూస్తే, చైనా, భారత్‌సహా పలు వర్థమాన దేశాల వాటా 70 శాతంగా ఉంది. ► గత రెండేళ్లలో ప్రపంచంలో నెలకొన్న పలు అనిశ్చితి ఆర్థిక అంశాల ప్రభావం 2018 చివర్లో స్పష్టంగా కనిపించింది. ఇదే పరిస్థితితో 2019 సంవత్సరం కూడా ప్రారంభమైంది. ఆయా అంశాలు పసిడి డిమాండ్‌ను నిర్ణయిస్తాయి. ముఖ్యంగా సమీప భవిష్యత్‌లో పసిడి డిమాండ్ పెరుగుదలకే కొంత మొగ్గు ఉంది. ► మార్కెట్ అనిశ్చితి కొనసాగే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. పలు దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక ఆర్థిక విధానాలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఇది పసిడికి సానుకూల అంశమే. ► ఈ సందర్భంగా పసిడికి ప్రతికూలమైన వడ్డీరేట్ల పెరుగుదల, డాలర్ పటిష్టతను కూడా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. అయితే ఫెడ్ వడ్డీరేటు (ప్రస్తుతం 2.25–2.50 శాతం శ్రేణి) పెంపు స్పీడ్ తగ్గే అవకాశాలే కనిపిస్తుండటం పసిడికి సానుకూల అంశమే. ► వృద్ధి పెరిగినా, ఆ ఫలాలు అందరికీ అందుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇది పసిడి సెంటిమెంట్‌ను బలపరిచే అంశమే. ► ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఇదేరీతిన కొనసాగితే, 2019లో పసిడి ఆభరణాలకూ డిమాండ్ పటిష్టమవుతుందని కౌన్సిల్ భావిస్తోంది. ► పశ్చిమ దేశాల్లో వృద్ధి ధోరణి... వినియోగ సెంటిమెంట్‌ను బలపరిచే అంశం. -
హెచ్–4 వీసాల్లో 93% భారతీయులకే
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–4 (స్పౌస్) వీసాలు పొంది ఉద్యోగం చేస్తున్న వారిలో 93 శాతం మంది భారతీయులేనని అమెరికన్ సంస్థ సీఆర్ఎస్ తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో ఐదో వంతు కంటే ఎక్కువ (28,033) మంది కాలిఫోర్నియాలోనే పనిచేస్తున్నారని, టెక్సాస్, న్యూజెర్సీల్లో మరో 20 శాతం మంది పనిచేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల జీవిత భాగస్వాములకు ఈ హెచ్–4 వీసాలు మంజూరు చేస్తారు. మొత్తంగా అమెరికా మంజూరు చేసిన హెచ్–4 వీసాల్లో 93 శాతం మహిళలకు.. ఏడు శాతం పురుషులకు ఇచ్చారు. అమెరికన్ చట్టసభ సభ్యులకు ఆసక్తి ఉన్న అంశాలపై కాంగ్రెస్ ఇండిపెండెంట్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) ఎప్పటికప్పుడు సర్వేలు చేసి నివేదికలు రూపొందిస్తుంది. దీనిలో భాగంగా ఆ సంస్థ హెచ్–4 వీసాలపై తాజాగా 9 పేజీల నివేదిక విడుదల చేసింది. హెచ్–4 కింద ఉపాధి కోసం జారీ చేసిన వీసాల్లో 93 శాతం భారతీయులకు, 5 శాతం చైనీయులకు, ఇతర దేశాలకు చెందిన వారికి రెండు శాతం వీసాలిచ్చినట్టు తెలిపింది. 2017, డిసెంబర్ 25 నాటికి 1,26,853 మంది హెచ్–4 వీసాదారుల దరఖాస్తులను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆమోదించింది. -
రైల్వే, బ్యాంకులపైనే ఎక్కువ ఫిర్యాదులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, రైల్వేల మీదనే అవినీతికి సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. 2016తో పోలిస్తే 2017లో తమకు అందిన అవినీతి ఫిర్యాదుల సంఖ్య 52 శాతం తగ్గిందని పేర్కొంది. 2017కి సంబంధించిన వార్షిక నివేదికను ఇటీవల పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నివేదిక ప్రకారం.. గత ఏడాది మొత్తం 23,609 ఫిర్యాదులు అందాయి. 2016లో ఫిర్యాదుల సంఖ్య 49,847గా ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి చీఫ్ విజిలెన్స్ అధికారులకు అందిన ఫిర్యాదుల సంఖ్య 60 వేలకుపైనే ఉంది. వీటిలో అధికంగా రైల్వే ఉద్యోగులపై 12,089 ఫిర్యాదులు అందాయి. ఇందులో 9,575 ఫిర్యాదులను పరిష్కరించారు. రైల్వే ఉద్యోగులపై వచ్చిన 1,037 ఫిర్యాదులు 6 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ బ్యాంకుల అధికారులకు వ్యతిరేకంగా 8,018 ఫిర్యాదులు అందాయి. -
పాక్‌లో వేళ్లూనుతున్న ఐఎస్
ఇస్లామాబాద్: కిరాతకమైన ఐఎస్ ఉగ్రవాదం పాకిస్తాన్లో చాలా వేగంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (పీఐపీఎస్) సంస్థ తాజా గణాంకాలు విడుదల చేసింది. పాక్‌లో ఐఎస్ ప్రభావం ఉత్తర సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో విస్తృతంగా ఉందని పిప్స్ పేర్కొంది. ఇటీవల బలూచిస్తాన్‌లో ఇద్దరు చైనీయుల హత్యకు పాల్పడింది ఈ ఉగ్రవాద సంస్థేనని తెలిపింది. ‘స్పెషల్ రిపోర్ట్ 2017’ పేరుతో విడుదల చేసిన సర్వేలో పాకిస్తాన్ ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్లను పిప్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సంస్థల కన్నా తెహ్రిక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్, జమాతుల్ అహ్రార్ సంస్థలు పాక్ అంతర్గత భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొంది. 2016తో పోలిస్తే 2017లో పాకిస్తాన్‌పై సీమాంతర దాడులు 131 శాతం పెరిగాయని తెలిపింది. -
యుద్ధభూమిలో బాల్యం
పాఠశాలల్లో, ఆట మైదానాల్లో హాయిగా గడవాల్సిన బాల్యం కొన్ని దేశాల్లో యుద్ధోన్మాదుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోతోంది. ఉద్రిక్తతలు ఉండే కొన్ని ప్రాంతాల్లోని చిన్నారులు యుద్ధ సమస్యల్లో చిక్కుకుని నలిగిపోతున్నారు. తీవ్రవాదులు, సైనిక పక్షాలు పిల్లలను బాల సైనికులుగా, ఆత్మాహుతిదళ సభ్యులుగా, మానవకవచాలుగా మారుస్తున్నాయి. ఆడపిల్లలు తీవ్రమైన లైంగిక దాడులను, పీడనను ఎదుర్కొంటు న్నారు. చిన్నవయసులోనే వారంతా లైంగిక బానిసలుగా మారుతున్నారు. ఇరాక్, సిరియా, యెమెన్, నైజీరియా, దక్షిణ సూడాన్, మయన్మార్ తదితర దేశాల్లోని సంక్షోభ ప్రాంతాల్లో చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది. తీవ్రవాద గ్రూపుల కబంధహస్తాల్లో చిక్కుకున్న కొందరు పిల్లలు అక్కడి నుంచి బయటపడ్డాక భద్రతా బలగాల చేతుల్లో పడి మరోసారి అణచివేతకు, వేధింపులకు గురవుతున్నారు. యుద్ధ ఛాయలు కనిపిస్తున్న మరికొన్ని ప్రదేశాల్లోని చిన్నారులు తిండి, నీళ్లు, పారిశుధ్యం వంటి కనీస సౌకర్యాలకు నోచుకోక పోషకాహార లోపంతో రోగాల బారిన పడుతున్నారు. ఈ పిల్లల పాలిట 2017 క్రూరమైన ఏడాదిగా నిలుస్తోందని యూనిసెఫ్ తాజా నివేదిక ఆందోళన వెలిబుచ్చింది. అంతర్జాతీయ మానవ తా విలువలు, పిల్లల హక్కులకు ఏమాత్రం విలువనివ్వ కుండా ఒకవైపు సైన్యం, మరోవైపు సాయుధ సైనిక ముఠాలు వ్యవహరిస్తున్న తీరును యూనిసెఫ్ తప్పుబట్టింది. యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాదాపు మూడుకోట్ల మంది పిల్లలు బలవంతంగా బడులకు దూరమైనట్లు తెలిపింది. ‘ఈ దేశాల్లోని పిల్లలు ఇళ్లు, పాఠశాలలు, ఆటస్థలాలు ఇలా అన్ని చోట్ల దాడులకు, క్రూరమైన హింసకు గురవుతున్నారు. ప్రతి ఏడాదీ ఈ దాడులు పెరగడం. ఇది ఎంతమాత్రం మంచిది కాదు’ అని యూనిసెఫ్ అత్యవసర కార్యక్రమా ల డైరెక్టర్ మాన్యువల్ చెప్పారు. దారుణాలివీ... ► నైజీరియా, ఛాద్, నైజర్, కేమరూన్‌లలో విస్తరించి ఉన్న ‘బోకో హరం’ ఉగ్రవాద సంస్థ 2016 కంటే 2017లో అయిదు రెట్లు ఎక్కువగా పిల్లలను ఆత్మాహుతి దళాలుగా మార్చింది. ► తిరుగుబాటు ద్వారా సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్లో బోకోహరం ఆధిపత్యంపెరిగాక ఎంతోమంది పిల్లలు హత్యాచారాలకు గురయ్యారు. బలవంతంగా సాయుధ ముఠాల్లో చేర్చారు. ► కాంగోలో రాజకీయ, సాయుధ హింస కారణంగా 8.5 లక్షల మంది పిల్లలు ఇళ్లకు దూరమయ్యారు. ► సోమాలియాలో 2017 అక్టోబర్ కల్లా 1800 మంది పిల్లలను సాయుధగ్రూపుల్లో చేర్చుకున్నారు. దక్షిణ సూడాన్‌లో 19 వేల మంది పిల్లలు కూడా ఈ జాబితాలో భాగంగా ఉన్నారు. ► మూడేళ్ల అంతర్గత సంక్షోభం కారణంగా యెమెన్‌లో 5,000 మంది అమాయక చిన్నారులు మరణించారు. 18 లక్షల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ► ఇరాక్, సిరియాలో పిల్లలు మానవకవచాలుగా ఉపయోగపడుతున్నారు. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌లో 700 మంది పిల్లలు చనిపోయారు ► రోహింగ్యాల పిల్లలను ఒక క్రమపద్ధతిలో మయన్మార్ నుంచి బయటకు తరిమేస్తున్నారు. ఆ దేశంలోని సగానికి పైగా రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు పారిపోయేలా అక్కడి ప్రభుత్వం దాడులు, హింసాకాండకు దిగింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆ పాపం భక్తులదే!
♦ ముఖ్యమంత్రి, యంత్రాంగం తప్పేమీ లేదట! ♦ పుష్కర ఘాట్ తొక్కిసలాట ఘటనపై కలెక్టర్ తాజా నివేదిక సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికార యంత్రాంగం ప్రత్యక్ష ప్రమేయాన్ని దాచిపెడుతున్నారు. ఇందులో తమ తప్పు ఏమీ లేదని, యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందని ఏకసభ్య కమిషన్‌కు ఇచ్చేందుకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ రూపొం దించిన 15 పేజీల నివేదిక విస్మయం కలిగిస్తోంది. నాటి ఘటనకు భక్తుల తొందరపాటే కారణమని ఈ నివేదికలో స్పష్టం చేశారు. గత ఏడాది జూలై 14వ తేదీ నుంచి 25 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించారు. ప్రారంభం రోజు ఉదయం రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగి 27 మంది భక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగి ల్చింది. నాటి ఘటనకు ప్రధానం గా సీఎంపైనే విమర్శలు వెల్లువెత్తాయి. పుష్కరఘాట్‌లో చంద్రబాబు ఎక్కువ సేపు గడపడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని నాడు నివేదిక లో స్పష్టం చేసిన కలెక్టర్.. బాబు పుష్కర స్నానానికి ఈ ఘటనతో సంబంధం లేదని తాజా నివేదికలో వెనకేసుకు రావడం గమనార్హం. తాజా నివేదికలోని కీలకాంశాలు... ఘాట్‌కు చేరుకున్న వారు గంటల తరబడి నిద్రాహారాలు లేకుండా నిరీక్షించి ఎండవేడిమి కారణంగా డీహైడ్రేషన్‌కు గురయ్యారు.ఆక్సిజన్ అందకపోవడ మూ కారణం. అధికారులు, పోలీసులు సమూహాన్ని సమర్థవంతంగా నియంత్రించినా అనుకోకుండా ఈ ఘటన జరిగింది. తొలి రోజు తప్ప మిగిలిన 11 రోజులు ఎలాంటి అపశ్రుతి చోటుచేసుకోలేదు. పుష్కరఘాట్‌లో భక్తుల ప్రవేశ ద్వారం, బయటకు వె ళ్లే మార్గాలు చాలా వెడల్పుగా ఉన్నాయి. డాక్యుమెంటరీ చిత్రీకరణకు ఏపీ టూరిజం వారు నేషనల్ జియోగ్రాఫిక్ చానల్‌కు అనుమతి ఇచ్చారు. పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఘటన తాలూకు దృశ్యాలు రికార్డు కాలేదు. -
ఉగ్రబాధిత భారత్
2014లో దేశంలో ఉగ్రదాడుల మృతుల సంఖ్య 416 గ్లోబల్ టైజం ఇండెక్స్ తాజా నివేదిక వెల్లడి న్యూయార్క్: 2014లో ఉగ్రవాదంతో ప్రభావితమైన టాప్ 10 దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులతో సంభవిస్తున్న మృతుల్లో సగానికిపైగా ఐసిస్, బొకో హరమ్‌ల వల్లనే జరుగుతున్నట్లు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. గ్లోబల్ టైజం ఇండెక్స్-2015 మూడో ఎడిషన్ ప్రకారం మొత్తం 162 దేశాలు ఉగ్రవాదం బారిన పడగా, అందులో భారత్ ఆరో స్థానంలో ఉంది. పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉండగా, అమెరికా 35వ స్థానంలో నిలిచింది. భారత్‌లో 2014లో ఉగ్ర దాడుల మృతుల సంఖ్య 1.2 శాతం పెరిగి 416కు చేరింది. నివేదికలోని ముఖ్యాంశాలు: ► 2014లో భారత్‌లో లష్కరే తోయిబాతోపాటు, హిజ్బుల్ ముజాహిదీన్ అనే ప్రమాదకర ఉగ్రసంస్థలున్నాయి. పాక్‌కు చెందిన లష్కరే 24 మంది మృతికి, హిజ్బుల్ 11 మంది మృతికి కారణమయ్యాయి. ఇది గత ఏడాది (30) కన్నా తక్కువ. ► 2014లో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడుల మృతుల సంఖ్య 80 శాతానికి పైగా పెరిగి అత్యధికంగా 32,658కి చేరింది. ► ఇస్లామిక్ స్టేట్స్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్‌కు చెందిన ఐఎస్‌ఐఎల్‌కు విధేయంగా ఉన్న బొకో హరమ్ ఉగ్రసంస్థ వల్ల 2014లో 6,644 మంది, ఐఎస్ దాడుల్లో 6,073 మంది చనిపోయారు. ► 2000-2014 కాలంలో టాప్ 10 దేశాల్లో భారత్ 14 సార్లు చోటు దక్కించుకుంది. ► భారత్‌లో ఉగ్రవాద బృందాలను కమ్యూనిస్టులు, ఇస్లామిస్టులు, వేర్పాటువాదులు అని మూడు రకాలుగా వర్గీకరించింది. ఎక్కువగా దాడులకు పాల్పడుతున్నది కమ్యూనిస్టు తీవ్రవాదులే. వీరి వల్లనే ఎక్కువ మరణాలు జరిగాయి. 2014లో 172 మంది మృతికి తామే కారణమని రెండు మావోయిస్టు గ్రూపులు ప్రకటించాయి. ఉగ్రవాదం వల్ల జరిగిన మృతుల్లో ఇది 41 శాతం. ► మావోయిస్టులు ఎక్కువగా పోలీసులనే లక్ష్యంగా ఎంచుకున్నారు. వీరి దాడుల్లో మరణిస్తున్న వారిలో సగం మంది పోలీసులున్నారు. దేశంలో ఎక్కువగా బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో ఎక్కువగా మావో దాడులు జరిగాయి. ► పాక్‌తో ఉన్న జమ్మూకశ్మీర్ వివాదమే దేశంలోని ఇస్లామిక్ ఉగ్రవాదానికి కారణం. దీనివల్ల దేశంలో 57 మంది మరణించారు. ఇది మొత్తం మృతుల సంఖ్యలో 14 శాతంగా ఉంది. ► ప్రపంచవ్యాప్తంగా అఫ్ఘానిస్తాన్, ఇరాక్, నైజీరియా, పాకిస్తాన్, సిరియా అనే ఐదు దేశాల్లో ఉగ్రవాదం చాలా పటిష్టంగా ఉంది. 2014లో ఉగ్రదాడుల్లో 78 శాతం మరణాలు ఈ దేశాల్లోనే సంభవించాయి. ► మొత్తమ్మీద ఉగ్రవాదంపై పోరాటానికి చేస్తున్న వ్యయం గత ఏడాదితో పోలిస్తే 61 శాతం పెరిగి 52.9 బిలియన్ డాలర్లకు చేరింది. ► పాశ్చాత్య దేశాల్లో యువత నిరుద్యోగిత, డ్రగ్స్ నేరాలు లాంటి సామాజిక-ఆర్థిక పరమైన కారణాలు ఉగ్రవాదంవైపు నడిపిస్తున్నాయి. -
మౌలిక రంగానికి ‘పేమెంట్స్’ బూస్ట్!
- అందుబాటులోకి ఏటా రూ. 14 లక్షల కోట్ల నిధులు - ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలో అంచనా.. ముంబై: దేశంలో కొత్తగా ఏర్పాటుకానున్న పేమెంట్స్ బ్యాంకులు.. మౌలిక(ఇన్ఫ్రాస్ట్రక్చర్) రంగానికి చేదోడుగా నిలవనున్నాయి. నిధుల కొరతతో సతమతమవుతున్న ఇన్ఫ్రా రంగానికి ఏటా రూ.14 లక్షల కోట్ల మేర అందుబాటులోకి వచ్చేందుకు పేమెంట్స్ బ్యాంకులు వీలుకల్పించనున్నాయని ఎస్బీఐ రీసెర్చ్ తాజా నివేదికలో అంచనా వేసింది. ‘మారుమూల ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్ సేవల విస్తరణకు పేమెంట్స్ బ్యాంకులతో సాధ్యమవుతుంది. మరోపక్క, ఇవి సమీకరించే డిపాజిట్ నిధులను కేవలం ప్రభుత్వ బాండ్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన కారణంగా ఈ మొత్తమంతా ఇన్ఫ్రా రంగానికి నిధులందించేందుకు అందుబాటులోకి వస్తుంది. మా అంచనాల ప్రకారం ఏటా ఈ విధంగా రూ.14 లక్షల కోట్ల అదనపు నిధులు లభ్యమయ్యే అవకాశం ఉంది. వివరంగా చూస్తే.. రోజువారీ అవసరాలకోసం ప్రజలు తమదగ్గరున్న డబ్బులో 13 శాతాన్ని క్యాష్ రూపంలోనే ఉంచుకుంటారు. ఈ మొత్తంలో 1 శాతం తగ్గినా.. డిపాజిట్ల రూపంలో అదనంగా రూ.15 లక్షల కోట్లు వ్యవస్థలోకి వస్తాయి. ఇందులో 75 శాతాన్ని రుణంగా ఇచ్చేందుకు బ్యాంకులకు వీలుంది. అంటే రూ.11.25 లక్షల కోట్లు లభించినట్లే’ అని ’ అని నివేదిక తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎయిర్టెల్ సహా మొత్తం 11 సంస్థలకు పేమెంట్స్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ఆర్బీఐ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం రూ. లక్ష వరకూ ఇవి డిపాజిట్లను సమీకరించవచ్చు. దేశంలో ప్రస్తుతం ఉన్న చిన్న వాణిజ్య బ్యాంకుల సగటు డిపాజిట్ల పరిమాణం రూ. లక్ష కోట్లుగా ఉంది. ఇందులో కనీసం నాలుగో వంతును డిపాజిట్లుగా సమీకరించగలిగితే... 11 పేమెంట్స్ బ్యాంకులు కలిపి ఏడాదిలో దాదాపు రూ.2.75 లక్షల కోట్లను సమకూర్చుకోగలవని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఇక భారత్‌లో చెలామణీలో ఉన్న బ్యాంక్ నోట్లు, నాణేల విలువ కూడా చాలా అధికంగా ఉందని(జీడీపీలో 12 శాతం).. ఏవైనా చెల్లింపులకు క్యాష్‌ను వాడేందుకే ఎక్కువ మంది మొగ్గుచూపుతుండటమే దీనికి కారణమని నివేదిక పేర్కొంది. పేమెంట్స్ బ్యాంకుల రాక, అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) ప్రభావంతో దేశంలోని మొత్తం మనీ సప్లైలో నగదు పరిమాణం భారీగా తగ్గి.. అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది. బ్రిటన్‌లో ఈ పరిమాణం 2 శాతం కాగా, ఆస్ట్రేలియాలో 3 శాతం, జపాన్‌లో 6 శాతంగా ఉంది.