ఏడాదిలో 20 వేలకు పైగా స్కూళ్లు మూసివేత | Over 20K Schools Shut Down In India During 2020-21 | Sakshi
Sakshi News home page

ఏడాదిలో 20 వేలకు పైగా స్కూళ్లు మూసివేత

Published Fri, Nov 4 2022 6:09 AM | Last Updated on Fri, Nov 4 2022 6:09 AM

Over 20K Schools Shut Down In India During 2020-21 - Sakshi

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో 2020–21లో 20 వేలకు పైగా స్కూళ్లు మూతపడ్డాయని కేంద్ర విద్యా శాఖ తాజా నివేదిక వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే టీచర్ల సంఖ్య 1.95% తగ్గిందని తెలిపింది. దేశంలో 44.85% స్కూళ్లకు మాత్రమే కంప్యూటర్‌ సదుపాయం ఉందని, 34% పాఠశాలల్లో మాత్రమే ఇంటర్నెట్‌ సదుపాయం ఉందని పాఠశాల విద్యపై యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ (యూడీఐఎస్‌ఈ+) నివేదించింది.  

► 2020–21లో 15.09 లక్షల స్కూళ్లు ఉంటే 2021–22లో 14.89లక్షలకి తగ్గిపోయాయి.  
► 2020–21లో 97 లక్షలున్న టీచర్ల సంఖ్య 2021–22 నాటికి 95 లక్షలకి తగ్గిపోయింది.  
► దివ్యాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేక టాయిలెట్లు 27%స్కూళ్లలోనే ఉన్నాయి.  
► 2020–21లో 25.38 కోట్ల మంది ఉండే విద్యార్థుల సంఖ్య 2021–22 వచ్చేసరికి 25.57 కోట్లకి పెరిగింది.  
► ప్రి ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల చేరిక11.5 లక్షలు తగ్గింది. కరోనా ప్రభావంతో చిన్న పిల్లల్ని స్కూళ్లలో చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో వారి సంఖ్య తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement