this year
-
ఈ సంవత్సరం ఏం చేశారు?
2023కు వీడ్కోలు ఇవన్నీ ప్రశ్నలే.పునరావలోకనం చేసుకోవాలి.కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో మొదలెట్టాలి.జీవితం ఒక్కటే. సాధించాల్సినవి లక్ష.స్త్రీగా జన్మించినందుకు రోజులు ఎలా గడిచిపోయాయో అనుకోకూడదు.ఎంత బాగా గడిచాయో అనుకోవాలి.అందుకు తరచి చూసుకుని స్వీయ అంచనా వేసుకోవడమే మార్గం.‘ఏం చేస్తున్నావమ్మా?’ అని పిల్లలు అడిగి ‘అన్నం పెట్టు’ అంటారు. ‘ఏం చేస్తున్నావోయ్’ అని భర్త అడిగి, ‘నా వైట్‌షర్ట్ ఎక్కడా?’ అని ప్రశ్నిస్తాడు. అత్తగారు, మామగారు ‘ఏం చేస్తున్నావమ్మా’ అని కేకేసి ఇంకేదో చెప్తారు. వీళ్లంతా ఏ పనీ చెప్పకపోయినా ఇంట్లో గృహిణిగా ఉన్నందుకు తప్పక చేయాల్సిన పనులు ఉంటాయి.ఈ పనుల్లోనే జీవితం గడిచిపోవాలా? ఈ పనుల మధ్యలో స్త్రీలు తమకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకోలేరా? 2023 మరో రెండు మూడు రోజుల్లో వీడ్కోలు తీసుకుంటుంది. కొత్త సంవత్సరం వస్తుంది. గృహిణిగా/ ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకునే గృహిణిగా ఈ సంవత్సరమంతా ఎలా గడిచిందో బేరీజు వేసుకున్నారా? ఎన్ని పుస్తకాలు చదివారు? స్త్రీకి మెదడు ఉంటుంది... దానికి వ్యాయామం ముఖ్యం అన్నాడు రచయిత చలం. ఆ వ్యాయామం పుస్తకాలు చదివితే వస్తుంది. సాహిత్యానుభవం వల్ల మస్తిష్కం విశాలం అవుతుంది. జీవన అవగాహన పెరుగుతుంది. జీవితాన్ని ఆస్వాదించడమూ తెలుస్తుంది. స్త్రీలు పుస్తకం చదివితే ఇంటికి వెలుగు. ప్రతిఏటా ఎన్నో మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రదర్శనలు జరుగుతాయి. అమేజాన్ నుంచి తెప్పించుకోవచ్చు. ఆడియో యాప్స్ కూడా ఉన్నాయి. పుస్తకాలు చదవకుండానే 2023ను మీరు వృథా చేసి ఉంటే మీరు మీ బౌద్ధిక వ్యాయామాన్ని వృథా చేసినట్టు. లేదా కొన్ని పుస్తకాలైనా చదివి ఉంటే వాటిని లిస్ట్ చేసి మీ స్నేహితులకు పంపి ఇన్‌స్పయిర్ చేయండి. ఈ సంవత్సరం మరిన్ని చదవాలని లక్ష్యం పెట్టుకోండి. మంచి సినిమాలు చూశారా? సినిమాలంటే కాలక్షేపపు సినిమాలు కాదు. హాలీవుడ్లో, హిందీలో, భారతీయ భాషల్లో అర్థవంతమైన సినిమాలు వస్తున్నాయి. స్త్రీ దృష్టికోణం నుంచి ఎన్నో కథలు చెప్తున్నారు. ఓటిటిలలో కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. వీటిలో కొన్నయినా మీరు ఎంచుకుని చూశారా? పోనీ... పాత క్లాసిక్స్... మీరు ఎప్పటినుంచో చూడాలనుకున్నవి... ఎవరూ మధ్యలో డిస్ట్రబ్ చేయని విధంగా చూశారా? సంతోషించారా? ఎంతమంది మిత్రులను పొందారు? ఇవాళ మనిషికి పెద్ద ఓదార్పు స్నేహమే. వైవాహిక జీవితంలో పడ్డాక పాత స్నేహాలు కొనసాగితే అదృష్టమే. స్కూల్, కాలేజీ నాటి స్నేహితులు మాట్లాడుతూ ఉంటే ఆ స్నేహాన్ని ఈ సంవత్సరం ఎంతమేరకు నిలబెట్టుకున్నారు. లేదా ఇంటి ఇరుగు పోరుగున, పని చేసే చోట ఎన్ని మంచి స్నేహాలు చేయగలిగారు. ఇవాళ రేపు మనుషుల పట్ల నెగెటివిటి పెరిగింది. కాని లోపాలు ఎంచటం తక్కువ... స్నేహాన్ని కొనసాగించడం తక్కువ కొనసాగించారా? బాగా చికాకుగా, డల్‌గా ఉన్నప్పుడు మీరు కాల్ చేసి మాట్లాడే స్నేహితుల సంఖ్య ఈ సంవత్సరం పెరిగిందా? తగ్గిందా? ఎన్ని అనుబంధాలను కాపాడుకోగలిగారు? బంధువులను దూరం చేసుకోవడం, బంధువులకు దూరం కావడం ఈ కాలపు గడుసుదనంగా మారింది. బంధువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే పోకడ ఇప్పుడు సర్వసామాన్యం అయ్యింది. కాని బంధుత్వాలు లేకనే జీవనం సాగగలదా? ఎన్ని లోపాలు ఉన్నా మంచికీ చెడ్డకీ ఆధారపడాల్సింది బంధువులే కదా? ఈ బాంధవ్యాలను, అనుబంధాలను డ్యామేజీ చేశారా? లేదా బలపరుచుకున్నారా? ఏదైనా నష్టం జరిగి ఉంటే 2024లో ఆ నష్టాన్ని నివారించే ప్రయత్నం ఎందుకు జరగకూడదు? ఎన్ని కొత్తప్రాంతాలు తిరిగారు? సంవత్సరమంతా ఇంటి నాలుగ్గోడలు, ఆఫీసుప్రాంగణంలోనే గడిచిపోయిందా? ఏ కొత్తప్రాంతాన్ని చూడలేదా? కొత్తనేలను తాకి కొత్తగాలిని పీలిస్తేనే సంతోషం. సంవత్సరంలో కనీసం 2 కొత్తప్రాంతాలు చూడగలగాలి. 2023లో చూడకపోతే 2024లో కదలండి కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం: కుటుంబం జీవన సర్వస్వం. ఒకే కుటుంబమే అయినా కుటుంబ సభ్యుల మధ్య స్పర్థలు, అభ్యంతరాలు, నిర్లక్ష్యం, నిర్బాధ్యత వస్తాయి ఒక్కోసారి. కడుపున పుట్టిన వాళ్ల మధ్య ప్రేమను కల్పించారా? తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల మధ్య అడ్డుగోడలు లేకుండా ఉన్నారా? మీ మనసులో ఉన్నదంతా వారికి చెప్పగలరా? వారి మనసులో ఉన్నది చెప్పే వీలు ఇచ్చారా? 2024లో ఈ ప్రశ్నలకు జవాబు వెతకండి. ఎంత పోదుపు చేశారు? పిల్లల కోసమే ప్రతి పైసా ఖర్చు పెట్టడం ఇన్నాళ్లు చేశారా? 2023లో కూడా అదే చేశారా? తల్లిగా మీ ఆర్థిక భద్రత ఎంత? మీ పేరున స్థిరచరాస్తులు, రొక్కం ఏ మేరకు ఉంది. మీ కోసం మీరుఎంత పోదుపు చేసుకున్నారు? ఒకరిపై ఆధారపడలేని స్థితిలో ఉండాలనుకోవడం లేదా? కొత్త సంవత్సరం వస్తున్నది మీ స్వయంసమృద్ధికే. ఆరోగ్యం పై ఎంత శ్రద్ధ పెట్టారు? ఆరోగ్యం సంగతి తర్వాత చూసుకుందాం అని ఇంకా ఎన్నేళ్లు అనుకుంటారు. ఈ సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్‌లు చేయించుకోండి. మంచి ఆహారానికి బడ్జెట్ కేటాయించుకోండి. జిమ్‌లో చేరండి. వాకింగ్ చేయండి. యోగా క్లాసులకెళ్లండి. మీ ఆరోగ్యం కోసం మీరు కొంత ఖర్చు పెట్టుకోవడాన్ని హక్కుగా పొందండి. 2024లో కచ్చితంగా మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం నడుం బిగించండి.కాలం వచ్చేది మన కోసం. మనం ఇతరుల కోసం ఎంత జీవించినా మన కోసం కూడా జీవించాలి. కొత్త సంవత్సరంలో మీ కోసం కూడా మీరు జీవించండి. -
వెంకటేశ్ టు అల్లు అర్జున్.. ఈ ఏడాది ఒక్క సినిమా లేదు
ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ కొందరు స్టార్స్‌ని మిస్సయింది. వెంకటేశ్, నాగార్జున, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. ఈ హీరోలు నటించిన చిత్రాలు 2023లో రిలీజ్ కాలేదు. ఈ స్టార్స్ వెండితెరపై కనిపించకపోవడం వారి అభిమానులను కాస్త నిరుత్సాహ పరిచే విషయం. మరి.. 2024లో ఈ స్టార్స్ ఏ చిత్రాలతో వెండితెరపై కనబడతారో తెలుసుకుందాం. ‘సైంధవ్’ రావాలి కానీ... ‘సైంధవ్’ రిలీజ్ ప్లాన్ మారడంతో ఈ ఏడాది తెలుగు తెరపై వెంకటేశ్ కనిపించే అవకాశం లేదు. వెంకటేశ్ కెరీర్లో రూపొందుతున్న 75వ సినిమా ‘సైంధవ్’. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. నిజానికి ఈ చిత్రాన్ని డిసెంబరు 22న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే తేదీకి ప్రభాస్ ‘సలార్: సీజ్ ఫైర్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధం కావడంతో ‘సైంధవ్’ రిలీజ్ జనవరి 13కు వాయిదా పడింది. ఇలా ఊహించని విధంగా వెంకటేశ్ ఈ ఏడాది తెలుగు తెరకు దూరంగా కావాల్సిన పరిస్థితి. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్ట్ సారా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ ఏడాది మార్చి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ మీడియాలో, సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంతో హిందీ తెరపై వెంకీ కనిపించడం ఈ స్టార్ ఫ్యాన్స్‌ను కాస్త ఆనందపరిచే విషయం. నా సామి రంగ.. వచ్చే ఏడాదే గత రెండేళ్లలో మూడు సినిమాలతో (2021లో ‘వైల్డ్ డాగ్’, 2022లో ‘బంగార్రాజు’, ‘ది ఘోస్ట్’) సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసిన నాగార్జున ఈ ఏడాది మాత్రం గ్యాప్ ఇచ్చారు. నాగార్జున తాజా చిత్రం ‘నా సామి రంగ’ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. సో.. ఈ ఏడాది అక్కినేని ఫ్యాన్స్‌కు నాగార్జున సిల్వర్ స్క్రీన్‌పై కనిపించరు. వచ్చే ఏడాది ఆరంభంలో నాగ్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ‘నా సామి రంగ’ రూపంలో ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. వేసవి నుంచి సంక్రాంతికి.. ‘సర్కారువారి పాట’తో గత ఏడాది సూపర్ హిట్ అందుకున్నారు మహేశ్‌బాబు. అన్నీ సజావుగా సాగినట్లయితే ఈ ఏడాది కూడా వెండితెరపై మహేశ్‌బాబు సందడి ఉండేది. మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ను ఈ ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరి 12కి వాయిదా వేశారు. ఇలా మహేశ్ ఈ ఏడాది థియేటర్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 2024 నుంచి నో గ్యాప్ 2018లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించింది ‘ఆర్ఆర్ఆర్’ (2022) సినిమాలోనే. ఆ సినిమా కమిట్మెంట్ కారణంగా 2019, 2020, 2021లో ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఇక 2023 నుంచి అయినా ఎన్టీఆర్ సినిమాలు వరుసగా విడుదలవుతాయనుకున్న ఆయన ఫ్యాన్స్ మరికొంత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా యాక్షన్ ఫిల్మ్ ‘దేవర’ తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సో.. ఈ ఏడాది ఎన్టీఆర్ స్క్రీన్‌పై కనపడరు. ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. ఇక ఎన్టీఆర్ ఓ లీడ్ రోల్లో నటించనున్న ‘వార్ 2’ (ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో), ‘దేవర’ రెండు భాగాలు, ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ.. ఇలా వరుస సినిమాలతో ఈ స్టార్ 2024 నుంచి గ్యాప్ లేకుండా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉంది. లేట్‌గా డ్యూటీ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తు న్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసినా వీలుపడలేదు. వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి శంకర్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇందులో కియారా అద్వానీ నాయిక. మరోవైపు ఈ ఏడాదే విడుదలైన సల్మాన్ ఖాన్ హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’లోని ఓ పాటలో రామ్‌చరణ్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఇది చరణ్ ఫ్యాన్స్‌కు కాస్త ఊరట కలిగించింది. రెండేళ్ల తర్వాతే పుష్ప రూల్ ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఎంతటి ఘనవిజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిందే. 2021లో విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా తెచ్చిపెట్టింది. దీంతో ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’ పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా మలి భాగం 2023లో విడుదల కాలేదు. క్యాస్టింగ్, కథ విషయాల్లో ఈ సినిమా స్పాన్ మరింత పెరగడం, చిత్రీకరణ వాయిదా పడుతుండటంతో 2024 ఆగస్టు 15న ‘పుష్ప: ది రూల్’ను రిలీజ్ చేస్తామని యూనిట్ ప్రకటించింది. సో.. ఈ ఏడాది కూడా అల్లు అర్జున్ థియేటర్స్‌లో కనిపించరు. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రధారులు.ఇలా మరికొందరు స్టార్స్‌ని 2023 సిల్వర్ స్క్రీన్ మిస్సయ్యింది. -
ఈ ఏడాది 80 శాతం వృద్ధి: పోకో
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్ తయారీలో ఉన్న పోకో ఇండియా ఈ ఏడాది 75–80 శాతం వృద్ధిని ఆశిస్తోంది. ప్రధానంగా మీడియం, ఎకానమీ విభాగంలో కంపెనీ హ్యాండ్‌సెట్స్‌కు డిమాండ్ ఇందుకు కారణమని పోకో ఇండియా హెడ్ హిమాన్షు టాండన్ సోమవారం తెలిపారు. ‘మార్కెట్ పరిశోధన సంస్థ కెనాలిస్ ప్రకారం.. భారత్‌లో మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 10–15 శాతం క్షీణించింది. ఆన్లైన్ అమ్మకాలు 20 శాతం పడిపోయాయి. అయితే షావొమీ సబ్–బ్రాండ్ పోకో మార్చి 2023 త్రైమాసికంలో 68 శాతం వృద్ధితో అమ్మకాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్లైన్ బ్రాండ్‌గా ఉద్భవించింది. రూ.10,000 లోపు ధరల శ్రేణిలో సి–సిరీస్‌లో మూడు మోడళ్లను, రూ.20,000–25,0000 ధరల విభాగంలో ఎక్స్5 ప్రో మోడళ్లను విడుదల చేయడం 2023 తొలి త్రైమాసికంలో కంపెనీ వృద్ధికి ఆజ్యం పోశాయి. రెండవ త్రైమాసికం విక్రయాలు జనవరి–మార్చి కంటే ఎక్కువగా ఉన్నాయి. (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా) కస్టమర్లలో 60 శాతం పాతవారే. కొన్ని పెద్ద బ్రాండ్లు ఆన్లైన్ విభాగంలో పలు ధరల శ్రేణులను ఖాళీ చేశాయని భావిస్తున్నాను. ఆ వాటాను పొందేందుకు ఇది మాకు సరైన సమయం. రూ.10,000లోపు సెగ్మెంట్‌పై దృష్టి పెడతాం. రూ.10 వేల శ్రేణిలో 5జీ మోడళ్లను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని వివరించారు. -
ఏడాదిలో 20 వేలకు పైగా స్కూళ్లు మూసివేత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో 2020–21లో 20 వేలకు పైగా స్కూళ్లు మూతపడ్డాయని కేంద్ర విద్యా శాఖ తాజా నివేదిక వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే టీచర్ల సంఖ్య 1.95% తగ్గిందని తెలిపింది. దేశంలో 44.85% స్కూళ్లకు మాత్రమే కంప్యూటర్ సదుపాయం ఉందని, 34% పాఠశాలల్లో మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉందని పాఠశాల విద్యపై యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+) నివేదించింది. ► 2020–21లో 15.09 లక్షల స్కూళ్లు ఉంటే 2021–22లో 14.89లక్షలకి తగ్గిపోయాయి. ► 2020–21లో 97 లక్షలున్న టీచర్ల సంఖ్య 2021–22 నాటికి 95 లక్షలకి తగ్గిపోయింది. ► దివ్యాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేక టాయిలెట్లు 27%స్కూళ్లలోనే ఉన్నాయి. ► 2020–21లో 25.38 కోట్ల మంది ఉండే విద్యార్థుల సంఖ్య 2021–22 వచ్చేసరికి 25.57 కోట్లకి పెరిగింది. ► ప్రి ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల చేరిక11.5 లక్షలు తగ్గింది. కరోనా ప్రభావంతో చిన్న పిల్లల్ని స్కూళ్లలో చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో వారి సంఖ్య తగ్గింది. -
‘నీట్’లో ఒకటే సెట్!
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ ఒకే సెట్ ప్రశ్నపత్రం రూపొందించనుంది. సుప్రీంకోర్టుకు సీబీఎస్ఈ ఈ విషయం తెలిపింది. ఇప్పటివరకు హిందీ, ఇంగ్లిష్ సహా 10 భాషల్లో పరీక్ష రాసేందుకు విద్యార్థులకు అనుమతి ఉండేదని కోర్టుకు చెప్పింది. వేర్వేరు భాషల్లో ప్రశ్నపత్రం రూపొందిస్తే వాటిని దిద్దడం కష్టమని, పైగా ప్రశ్నలు వేర్వేరుగా ఉన్నప్పుడు విద్యార్థుల సామర్థ్యాన్ని ఎలా అంచనా వేయగలుగుతారని ఉన్నత న్యాయస్థానం గతంలో పేర్కొంది. అన్ని పేపర్లలో కఠినత్వం ఒకే స్థాయిలో ఉంటుందని, అలాంటప్పుడు వేర్వేరు సెట్ల ప్రశ్న పత్రం రూపొందించడంలో తప్పు లేదన్న సీబీఎస్ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. అయితే కోర్టు సలహాలు విన్న సీబీఎస్ఈ.. ఈ ఏడాది నుంచి ఒకే సెట్ ప్రశ్నపత్రం రూపొందించి వాటిని ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేస్తామని వెల్లడించింది. ఒకే సెట్ ప్రశ్నపత్రం రూపొందించేలా సీబీఎస్ఈని ఆదేశించాలంటూ ‘సంకల్ప్ చారిటబుల్ ట్రస్టు’ పిటిషన్ దాఖలు చేసింది. -
మూసేయండి
ఆకివీడు : ప్రాథమిక పాఠశాలల్ని మూసివేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. హేతుబద్ధీకరణ పేరిట మూడేళ్లుగా బడులను మూసివేస్తున్న ప్రభుత్వం ఈ ఏడాదీ అదే పనిలో నిమగ్నమైంది. జిల్లాలో 70కి పైగా ప్రాథమిక పాఠశాలల్ని మూసివేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు విద్యాశాఖ వర్గాల సమాచారం. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సర్దుబాటు పేరిట బడుల మూతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 19 మందికంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 30 మందికంటే తక్కువ విద్యార్థులు ఉంటే.. వాటిస్థాయి తగ్గించి ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తారు. జెడ్పీ హైసూ్కళ్లలో 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే.. వాటిని ప్రాథమికోన్నత పాఠశాలలుగా మారుస్తారు. 6, 7, 8 తరగతులున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 40లోపు విద్యార్థులు ఉంటే.. వాటిని కూడా ప్రాథమిక పాఠశాల స్థాయికి తగ్గిస్తారు. జిల్లాలో 2,250 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. వాటిలో 70కి పైగా బడులను మూసివేస్తారని తెలుస్తోంది. ఇవి కాకుండా 50 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల స్థాయిని కుదించే అవకాశం ఉన్నట్టు అంచనా. ఉపాధ్యాయుల కేటాయింపు ఇలా.. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం 2016 డిసెంబర్ 31 నాటికి పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల్ని కేటాయిస్తారు. 20 మంది విద్యార్థులుండే ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటారు. 21 నుంచి 60 లోపు పిల్లలుంటే ఇద్దర్లు, 60 మంది దాటితే ముగ్గురు ఉపాధ్యాయుల్ని కేటాయిస్తారు. 80 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు ఉపాధ్యాయుల్ని నియమించి దానిని మోడల్ పాఠశాలగా గుర్తిస్తారు. 80 నుంచి 131 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో ఐదుగురు ఉపాధ్యాయులతోపాటు ఒక ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తారు. ఈ మేరకు జీవో–29 జారీ కాగా.. దానికి అనుబంధంగా ఆర్సీ నంబర్ 4102తో మార్గదర్శకాలు సైతం వెలువడ్డాయి. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారీగా హేతుబద్ధీకరణ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలతో కూడిన నివేదికలను ఈనెల 30న విద్యాశాఖకు సమర్పించాల్సి ఉంటుంది. సదరు నివేదికల తుది పరిశీలన అనంతరం ఆయా పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల, విద్యార్థుల వివరాలను జూన్ 1న అధికారికంగా ప్రకటిస్తారు. బలోపేతం చేయాలి ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమ బోధనను అందుబాటులోకి తెచ్చాక విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ స్థాయి నుంచి తరగతులు ఉండాలి. పాఠశాలలు మూసివేయడమనేది అవివేక చర్య. విద్య ఉమ్మడి వ్యవస్థగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకూడదు. దీనిని వ్యతిరేకిస్తున్నాం. – కె.రామలింగరాజు, ఎస్టీయూ అధ్యక్షుడు, ఆకివీడు మండలం పాఠశాలల్ని కుదించడం దారుణం విద్యార్థుల శాతం తక్కువగా ఉందనే నెపంతో ప్రభుత్వ పాఠశాలల్ని కుదించడం దారుణం. అక్షరాస్యతలో మన రాష్ట్రం దేశంలో 27వ స్థానంలో ఉంది. ఈ చర్యల వల్ల మరింత దిగజారుతుంది. నిరుపేదలకు విద్యను దూరం చేస్తున్నారు. ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. పాఠశాలల కుదింపు, ఎత్తివేత వంటి చర్యల్ని వెంటనే మానుకోవాలి. – పిల్లి జయకర్, అధ్యక్షుడు, యూటీఎఫ్ జిల్లా శాఖ -
ఎపి,తెలంగాణ మార్కెట్లో సైసీ సాంబర్ పోడులు
-
2017లో 20 లక్షల ఉద్యోగాలు!
-
2017లో 20 లక్షల ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: దేశంలోని నిరుద్యోగులకు నిజంగా ఇది శుభవార్తే. డీమానిటైజేషన్ కారణంగా టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలకు లభిస్తున్న ప్రోత్సాహం లాంటి ఇతర కారణాలల మూలంగా టెలికాం రంగంలో నిపుణుల అవసరం బాగా పెరగనుందని , దీంతో ఈ ఏడాది సుమారు 20 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్ సర్వీసెస్ రిపోర్ట్ ప్రకారం డేటా వ్యాప్తి, కొత్త సర్వీసు ప్రొవైడర్ల ప్రవేశంకారణంగా రెండు మిలియన్ల ఉద్యోగాలు ఈ ఏడాది పెరిగనున్నాయి. ఇందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలని నివేదిక భావించింది. డీమానిటైజేషన్ , మొబైల్ ధరలు తగ్గడం, నెట్ వర్క్ విస్తరణకు ఆయా కంపెనీల పెట్టుబడులు,ఇంటర్నెట్ వినియోగం , డిజిటల్ లావాదేవీలు పెరగడం, ప్రభుత్వ సంస్కరణలు ఇందుకు కలిసి రానున్నాయని పేర్కొంది. టెలికాం రంగ నైపుణ్య కౌన్సిల్ (టీఎస్ఎస్సీ)తో కలిసి ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచాలని, తద్వారా భారీ స్థాయిలో ఉపాధి కల్పన జరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఈ విభాగంలో 2020-21 నాటికి 9.20 లక్షల ఉద్యోగాలు (ఇన్ఫ్రాస్ట్రక్చర్) లభిస్తాయని తెలిపింది. 2021 నాటికిటెలికాం రంగంలో మొత్తం 87 లక్షల మందికి పైగా ఉపాధి దొరుకుంతుందని అంచనా వేసింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ (ఐఓటీ), మొబిలిటీ సొల్యూషన్స్, టెలికాం మౌలిక సదుపాయాలు, నెట్వర్క్ నిర్మాణాలు, విక్రయాలు తదితర విభాగాలకు నిపుణులు అవసరమని టీమ్‌లీజ్ సర్వీసెస్ సీనియర్ ఉపాధ్యక్షులు నీతి శర్మ అన్నారు. మొబైల్ తయారీ సంస్థలకు 17.60 లక్షల (1.76 మిలియన్) మంది, టెలికాం ఆపరేటర్లకు 3.70 లక్షల (0.37 మిలియన్)మంది ఉద్యోగుల అవసరమున్నట్లు తన నివేదికలో పేర్కొంది. నెట్వర్క్ ఇంజినీర్లు, సైబర్ భద్రతా నిపుణులు, సేవల నిపుణులు, యాప్ డెవలపర్లు, సిస్టమ్ ఇంజినీర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, మొబైల్ తయారీ నిపుణులు, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ , ఐ-డీఏఎస్ ఇంజనీర్లు ఉన్నాయి, బ్యాక్ ఆఫీస్ & ఎడ్మినిస్ట్రేషన్ లాంటి కీలక ప్రొఫైల్స్ లో 2017 నాటికి డిమాండ్ బాగా ఉంటుందని తెలిపింది. -
ఏసీబీ దూకుడు
ఏలూరు అర్బన్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస దాడులు, ఆకస్మిక తనిఖీలతో అవినీతి ఉద్యోగులు, లంచగొండి అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెడుతున్నవారి గుండెల్లో ఏసీబీ అధికారులు నిద్రపోతున్నారు. పక్కా ప్రణాళికతో, పటిష్టమైన వ్యూహంతో అవినీతి అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. బాధితుల సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతూ మెరుపుదాడులు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు ఎనిమిది ట్రాప్ (బాధితుల ఫిర్యాదు మేరకు వలపన్ని పట్టుకున్న కేసు)లు, ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసు ఒకటి కలిపి మొత్తంగా తొమ్మిది కేసులు నమోదు చేయడంతో పాటు ఏడు ఆకస్మిక తనిఖీలు చేశారు. గతేడాది ఏసీబీ అధికారులు 12 కేసులు నమోదు చేయగా వాటిలో ఎనిమిది ట్రాప్‌లు ఉన్నాయి. ఒకటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, ఏడు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయి. ట్రాప్‌లు ఇలా.. lమార్చి 9న చింతలపూడి సబ్‌రిజిస్ట్రార్ రేపల్లి వెంకట గోపాలకృష్ణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. lమార్చి 24న స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ కోళ్ల వెంకట సత్య ఉదయ్‌భాస్కర్ ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు. lమే 3న లింగపాలెం తహసీల్దార్ కార్యాలయంలో డెప్యూటీ తహసీల్దార్ సూరిశెట్టి శివశంకర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. lమే 19న ఐఎస్ రాఘవాపురంలో వీఆర్వోగా పనిచేస్తున్న పుల్లా నాగయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. lజూలై 27న పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన దాడుల్లో మున్సిపల్ మేనేజర్ ఎ.తారకనాథ్తో పాటు సీ–1 క్లర్క్ పీవీ గోపాలకృష్ణ పట్టుబడ్డారు. lఆగస్టు 8న పెనుగొండ పంచాయతీ కార్యాలయంలో జరిగిన దాడుల్లో పంచాయతీ కార్యదర్శి పి.వసంతరావును లంచం తీసుకుం టుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇదే కేసులో రిటైర్డ్ పంచాయతీ సెక్రటరీ జి.సత్యనారాయణ, రికార్డు అసిస్టెంట్ ఎల్. రామారావుపై కూడా కేసులు నమోదు చేశారు. నవంబర్ 30న నరసాపురం తహసీల్దార్ కార్యాలయంలో జరిపిన దాడుల్లో ఆర్ఐ జి.పెద్దిరాజును లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 16న ఏలూరు వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జరిపిన దాడుల్లో రూ.40 వేలు లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఎండీ మస్తాన్, సహకరించిన సీనియర్ అసిస్టెంట్ ఫణికుమార్‌ను అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఏప్రిల్ 24న ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగంలో డీఈఈ వంగపండు వెంకట సత్యనారాయణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారం నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆకస్మిక తనిఖీల్లో భారీగా సొమ్ము lజనవరి 23న తాడిపూడి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ముప్పిడి సమజ కార్యాలయంలో లెక్కల్లో చూపని రూ.4 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 2న ఏపీ–తెలంగాణ సరిహద్దు జీలుగుమిల్లి కమర్షియల్ టాక్స్ చెక్‌పోస్టుపై దాడి చేసిన ఏసీబీ అధికారులు రూ.75,970 సీజ్ చేశారు. lమే 23న సివిల్ సప్లయిస్ ఇన్వెస్టర్ గోడౌన్స్ పై దాడిచేసిన అధికారులు రూ.1.36 లక్షల అనధికార సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. lజూన్ 6న జంగారెడ్డిగూడెం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడి చేసి సబ్‌రిజిస్ట్రార్ దిగుమర్తి జయరాజు వద్ద ఉన్న రూ. 1,76,460 నగదు సీజ్ చేశారు. lజూలై 21న ఏలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్వహించిన తనిఖీల్లో రూ. 3,66,415 అనధికార సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలూ భాగస్వాములు కావాలి అవినీతిని నిర్మూలన కేవలం అవినీతి నిరోధకశాఖకే పరిమితం కాదు. అవినీతిని నిర్మూలించడంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలి. లంచం పుచ్చుకోవడంతో పాటు లంచం ఇవ్వడం కూడా నేరమే అని ప్రతివారూ తెలుసుకోవాలి. ప్రజలు కూడా లంచాలు ఇవ్వడం మానుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తన వి««దlులు నిర్వహించేందుకు గాను ప్రతినెలా వేలు, లక్షల్లో జీతాలు ఇస్తోంది. ప్రభుత్వోగులు ప్రజలను లంచాలు డిమాండ్ చేయడం శిక్షార్హమైన నేరం. ఏ అధికారి లేదా ఉద్యోగి లంచం కోసం వేధిస్తున్న సమయంలో బాధితులు లేదా అవినీతి విషయం తెలిసిన వారు కూడా నేరుగా ఏలూరు శాంతినగర్ గ్జేవియర్ స్కూల్ రోడ్డులో ఉన్న అవినీతి నిరోధకశాఖ కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. లేదా 94404 46157, 94404 46158, 94404 46159 నంబర్లకు ఫో¯ŒSలో సమాచారం అందించవచ్చు. అలా చేసిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతాం. – వి.గోపాలకృష్ణ, ఏసీబీ డీఎస్పీ, ఏలూరు రేంజ్ -
నర్సింగ్ సీట్లు ఈ ఏడాది లేనట్టే !
సిబ్బంది కొరతే ప్రధాన కారణం కళాశాల నిర్వహణపై ఐఎన్‌సీ అసంతృప్తి సీట్ల కోసం ఢిల్లీ చుట్టూ అధికారుల ప్రదక్షిణలు ఎంజీఎం : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పరిధిలోని బీఎస్సీ నర్సింగ్ కళాశాల నిర్వహణపై ఇండియ¯ŒS నర్సింగ్ కౌన్సిలింగ్(ఐఎన్సీన్) అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ ఏడాది సీట్ల భర్తీకి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై నర్సింగ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రార్ ఐదు రోజుల క్రితం కళాశాల ప్రిన్సిపాల్‌కు నోటీసులు జారీ చేయడంతో సీట్ల ను కాపాడుకునేందుకు రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి ఢిల్లీలోని ఐఎన్‌సీ బృందం వద్దకు పయనమయ్యారు. ఇం డియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ సభ్యులు ప్రతి సంవత్సరం కళాశాలను తనిఖీ చేసి విద్యార్థులకు సరిపడా అధ్యాపక బృందంతో పాటు హాస్టల్ వసతి, లైబ్రరీ వంటి సౌకర్యాలను పరిశీలిస్తారు. వారు సంతృప్తి చెందితేనే అడ్మిషన్లకు అనుమతి ఇస్తారు. 2012లో కళాశాల స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అధ్యాపకులను నియమించలేదు. అంతేకాక ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో ఉన్న హాస్టళ్లలో విద్యార్థులకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో పాటు అక్కడి నుంచి విద్యార్థులకు కళాశాలకు నడిచి రావాల్సిన దుస్థితి నెలకొంది. అంతే కాకుండా నర్సింగ్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు మెస్ సౌకర్యం సరిగ్గా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2012 నుంచి ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌ల విద్యార్థులు అడ్మిషన్లు పొందగా, ఐదుగురు అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. కళాశాలలో 200 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఐఎన్‌సీ నిబంధనల ప్రకారం పది మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉండాలి. కానీ ఇక్కడ ఐదుగురు మాత్రమే ఉండడంతో ఐఎన్‌సీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి, సీట్ల అనుమతికి నిరాకరించారని అధ్యాపకులు చెపుతున్నారు. ఫ్యాకల్టీ నియామకం గురించి అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదని నర్సింగ్ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి అధికారులు బీఎస్సీ నర్సింగ్ కళాశాలపై దృష్టి పెట్టి సీట్లను కాపాడడడంతో పాటు వెంటనే అధ్యాపకులను నియమించాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
అన్నదాతలకు తీపి కబురు
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలకు ప్రస్తుతం పరిస్థితి సానుకూలంగా ఉందని, ఈ ఏడాది మంచి వానలు కురుస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రెండు సంవత్సరాల తరువాత, ఈ ఏడాది మంచి వానలు కురిసే అవకాశం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు తీపి కబురందించింది. నైరుతి రుతుపవనాల కారణంగా రెండేళ్ల వర్షాభావ పరిస్థితి నుంచి ఈ ఏడాది బయటపడే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ జూన్ ప్రారంభంలో ఖరీఫ్ సీజన్లో పంట విస్తీర్ణం, ఉత్పత్తి పెంచడానికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి శోభన కె పట్నాయక్ రాష్ట్రాలకు సూచించారు. 2016-17 ఖరీఫ్ ఉద్యమంలో భాగంగా జరిగిన జాతీయ సదస్సులో పట్నాయక్ ప్రసంగించారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వ్యవసాయంపై ఏప్రిల్ 11 మరియు 12 న్యూఢిల్లీలో ఖరీఫ్ క్యాంపెయిన్ 2016 పేరుతో జాతీయ సదస్సు జరగనుంది. వర్షా భావ పరిస్థితుల కారణంగా గత రెండేళ్లకాలంగా దేశంలోని ఆహారధాన్యాల ఉత్పత్తి క్షీణిస్తూ వచ్చింది. 2014-15 పంట సంవత్సరం (జూలై-జూన్) ఆహార ధాన్యాల ఉత్పత్తి 252.02 మిలియన్ టన్నులు కాగా, మునుపటి సంవత్సరంలో రికార్డు 265.04 మిలియన్ టన్నుల నుంచి క్షీణించింది. 2015-16 పంట సంవత్సరానికి ఇది 253.16 మిలియన టన్నులకు కొద్దిగా పెరుగుతుందని అంచనా. వరుసగా రెండు సం.రాలుగా చెడు వర్షాకాలం దేశంలో రైతుల దుస్థితి నీటి కొరత దారితీసాయనీ, రైతులు,పంట వనరులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయని పట్నాయక్ పేర్కొన్నారు. అటు గత రెండు సంవత్సరాల నాటి వర్షాభావ పరిస్థితులు, ఈ ఏడాది పునరావృతం అవకాశం లేదని గత ఫిబ్రవరి ఆర్థిక సర్వే తేల్చి చెప్పిందన్నారు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉండాలని పట్నాయక్ రాష్ట్రాలకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సమస్యనైనా పరిష్కరించేందుకు వీలుగా ఆకస్మిక ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు రుతుపవనాల ఆగమనంపై వాతావరణ శాఖ అంచనాలు ఈ నెలాఖరుకు రానున్నాయి. -
ఈసారి ఉపాధ్యాయుల బదిలీలు డౌటే!
హైదరాబాద్: రెండేళ్లుగా ఉపాధ్యాయ బదిలీల కోసం నిరీక్షిస్తున్న టీచర్లకు ఈసారీ నిరాశ తప్పేలా లేదు. విద్యార్థుల్లేని స్కూళ్లలోని టీచర్లను విద్యార్థులు ఉన్నచోటికి పంపిం చేందుకు టీచర్ల హేతుబద్ధీకరణ మాత్రమే చేపట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఇటీవల ఇంటర్ ఫలితాల విడుదల సందర్భంగా టీచర్ల బదిలీ లుంటాయా? లేదా? అని విలేకరులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని అడిగిన ప్రశ్నలపై సమాధానాన్ని దాటవేశారు. మరోవైపు పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు మాత్రమే కసరత్తు ప్రారంభించిం ది. ఇందులో భాగంగా మేలోనే ఈ ప్రక్రియను చేపట్టి పూర్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రతిపాదనలు పంపించింది. అయితే బదిలీలకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు పంపించనట్లు తెలిసింది. -
ఈ ఏడాది వీరిది!
ఇది ఎప్పుడూ ఉండేదే అయినా, మళ్లీ మళ్లీ ఉత్సాహాన్నిచ్చేది కూడా! కొన్ని తలపోతల్ని తవ్వుకోవడం, వచ్చిన దారిని వెనుదిరిగి చూసుకోవడం! తెలుగువారి చరిత్రకు సంబంధించీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన మైలురాయి. మనం రెండు రాష్ట్రాలుగా ‘కలిసిపోయాం’! ఘటనాఘటనల్ని అటుంచితే, ఈ సంవత్సరాన్ని తమదిగా చేసుకున్న వ్యక్తులు వీళ్లు. కొన్నిసార్లు ప్రగతి వ్యక్తిగతమైనదే అయినా అది నేలంతటికీ వర్తిస్తుంది. అందుకే ఈ ‘2014లో విస్మరించలేని వ్యక్తుల’ జాబితా! అయితే, కైలాశ్ సత్యార్థి లాంటివాళ్లు ఈ ఏడాది నోబెల్ శాంతిబహుమతి గెలుచుకున్నప్పటికీ ఈ జాబితాలో చేర్చలేదు. కేవలం తెలుగువాళ్లకే పరిమితమయ్యాం. అలాగే వీళ్లను ప్రజెంట్ చేయడంలో ప్రాధాన్యాల క్రమం పాటించలేదు. ఇంకో ముఖ్యవిషయం ఏమిటంటే, ఇది పరమప్రమాణం కాదు, సాధికారికం కూడా కాదు. ఈ జాబితాలోని లోటుపాట్లని మానవ పరిమితిగా పరిగణించండి. సత్య నాదెళ్ల సాఫ్ట్వేర్ దిగ్గజం అమెరికా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మూడు దశాబ్దాల పైగా చరిత్రలో ముచ్చటగా మూడో సీఈవోగా పగ్గాలు చేపట్టి సంచలనం సృష్టించాడు సత్య నాదెళ్ల. అనంతపురం జిల్లా బుక్కాపురం నుంచి మొదలైన సత్యనారాయణ నాదెళ్ల ప్రస్థానం... హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీదుగా మైక్రోసాఫ్ట్ దాకా సాగింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివిన సత్య 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరి, అంచెలంచెలుగా సీఈవో స్థాయికి ఎదిగాడు. ఏడాదికి రూ. 520 కోట్ల ప్యాకేజీ అందుకుంటున్న నాదెళ్ల... ప్రపంచవ్యాప్తంగా 50 మంది అత్యుత్తమ సీఈవోలతో ఫార్చూన్ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో 38వ స్థానం దక్కించుకున్నాడు. ‘క్లౌడ్’ లాంటి కొంగొత్త విభాగాల్లో మైక్రోసాఫ్ట్‌కి పూర్వ వైభవం తెచ్చిపెట్టే దిశగా వ్యూహాలు రచిస్తున్నాడు. సానియా మీర్జా టెన్నిస్ అంబాసిడర్ ఒకానొకదశలో టెన్నిస్‌కు వీడ్కోలు చెబుదామని భావించిన సానియా మీర్జా ఈ యేడు నేలకు కొట్టిన రబ్బరు బంతిలా ఎగిసింది. కెరీర్లోనే అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సానియా... సీజన్లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో టైటిల్ సాధించింది. అంతేకాకుండా కారా బ్లాక్ (జింబాబ్వే)తో మూడు టైటిల్స్ నెగ్గడంతోపాటు, మరో నాలుగు టోర్నీల్లోనూ రన్నరప్‌గా నిలిచింది. సీజన్ ముగింపు టోర్నీ అయిన ప్రతిష్టాత్మక ‘డబ్ల్యూటీఏ ఫైనల్స్’లో విజేతగా నిలువడం ద్వారా గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ‘బ్రాండ్ అంబాసిడర్’గా నియామకం తర్వాత సానియా ఆట ఉన్నత శిఖరానికి చేరుకుందంటే అతిశయోక్తి కాదు. ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించడం, అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టుకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించడం, ఐక్యరాజ్యసమితి (యూఎన్) దక్షిణాసియా గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియామకం... ఇలా ఈ ఏడాది సానియాకు పూర్వ వైభవాన్ని రప్పించింది. కొలకలూరి ఇనాక్ సముచిత గౌరవం ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహితీ రంగానికి చేసిన సేవలకుగానూ భారతప్రభుత్వం ఈ ఏడాది ‘పద్మశ్రీ’తో సత్కరించింది. గుంటూరు జిల్లా వేజండ్లలో జన్మించిన ఇనాక్ సాహిత్యంలో, దళిత స్పృహ, స్త్రీవాద చైతన్యం, విప్లవభావాలు అన్నీ ఉంటాయి. అయినా ఆయన ఏ సంస్థలోనూ సభ్యుడు కాడు. ఆయన నేలలో వేరూనిన చెట్టు! గ్రామీణ జీవితంలోని సాంఘిక వివక్షతలను వివిధ ప్రక్రియల్లో ప్రశ్నించారు. ఇనాక్ కథలు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇనాక్ కథలను అన్ని భారతీయ భాషల్లోకి అనువదించిన సాహిత్య అకాడెమీ ఆయన రచనలను ‘ఆధునిక సాహిత్యంలో క్లాసిక్స్’గా అభివర్ణించింది. ఇనాక్ తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. కె.చంద్రశేఖరరావు ‘ప్రత్యేక’ సాధకుడు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజకీయంగా కూడా సత్తా చాటారు. జూన్ 2న ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ప్రత్యేక తెలంగాణ లక్ష్యంతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, ఉద్యమానికి నేతృత్వం వహిస్తూ ఆ లక్ష్య సాధనలో విజయవంతం కావడం, తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం ద్వారా కేసీఆర్ డబుల్ సక్సెస్ సాధించారని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ప్రత్యేక తెలంగాణ సాధన అంశాలు ఈసారి సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేశాయి. అయితే తెలంగాణ వచ్చింది మా వల్లనే, ప్రత్యేక తెలంగాణ మా అధినేత్రి చలువే... అంటూ ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్‌కు కాలం కలిసిరాలేదు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల పొత్తు కూడా తెలంగాణలో వర్కవుట్ కాలేదు. కేసీఆర్ నేతృత్వంలోని గులాబీదళమే సంపూర్ణ ఆధిక్యత సాధించింది. పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి ఫోర్బ్స్ ఎంట్రీ ఫార్మా దిగ్గజం, అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మరోసారి ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఫోర్బ్స్ ఇండియా ఆయన సంపదను 1.8 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. కంపెనీ షేరు ధర ఏకంగా మూడు రెట్లు పెరగడం ఇందుకు కారణం. తయారీ ప్రక్రియల్లో లోపాల మూలంగా 2011లో విధించిన ఆంక్షలను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ తాజాగా ఎత్తివేయడం ఇందుకు దోహదపడింది. అమెరికాలోనూ, యూరప్‌లోనూ కంపెనీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కె.నిత్యానంద రెడ్డితో కలిసి రామ్‌ప్రసాద్ 1986లో అరబిందో ఫార్మాను ప్రారంభించాడు. కంపెనీ ప్రస్తుతం హృద్రోగం, మధుమేహం, హెచ్ఐవీ మొదలైన వాటి చికిత్సలో ఉపయోగించే ఔషధాలను 125 పైగా దేశాల్లో విక్రయిస్తోంది. ఇటీవలే అమెరికాకు చెందిన న్యూట్రాస్యూటికల్ సంస్థ నాట్రోల్‌ను కొనుగోలు చేసింది. రామ్‌గోపాల్‌వర్మ నిరంతర వ్యాఖ్యా స్రవంతి ఫ్లోకామ్ టెక్నాలజీతో కేవలం పాతిక వేల రూపాయలతో సినిమా తీయొచ్చని ‘ఐస్‌క్రీమ్’తో నిరూపించాడు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. సినిమా నిర్మాణంలో మూస విధానాలు ఉండకూడదని నిర్మొహమాటంగా వెల్లడించాడు. వైజాగ్‌లో కాదు... కరీంనగర్లో సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేస్తానని నిర్భయంగా ప్రకటించాడు. కేసీఆర్, పవన్‌కల్యాణ్‌పై పాజిటివ్‌గానూ, నెగిటివ్‌గానే కాదు, చివరకు దేవుళ్ల మీద కూడా తనవైన వ్యాఖ్యానాలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు. మహమ్మదాలీ బేగ్ థియేటర్ ఐకన్ నాటక రంగ సేవలకుగాను భారతప్రభుత్వం మహమ్మదాలీ బేగ్‌ను ఈ ఏడాది ‘పద్మశ్రీ’తో గౌరవించింది. ఆయన తండ్రి ఖాదర్ అలీ బేగ్ నాటకాన్ని ముంబైలో చూసిన పృథ్వీరాజ్ కపూర్ ‘నీ చేతుల్లో నాటకరంగం భవిష్యత్తు పదిలంగా ఉంటుంది’ అన్నారు. దురదృష్ట వశాత్తూ ఖాదర్ అలీ బేగ్ 46 ఏళ్ల వయసులోనే మరణించాడు. తండ్రి అందించిన నాటకరంగపు కాగడాను కుమారుడు చేబూనాడు! తండ్రి పేరు మీద ఖాదర్ అలీ బేగ్ థియేటర్ ఫౌండేషన్ స్థాపించి, ‘నాటకరంగ పునరుజ్జీవన వారసత్వాన్ని కొనసాగిస్తున్న అరుదైన నమూనా’గా ఫ్రాన్స్ దేశపు సమున్నత గౌరవం పొందాడు. నాటకరంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి కెనడా ప్రభుత్వం అందజేసే అవార్డునూ టొరొంటోలో అందుకున్నాడు. ఈ సందర్భంగా స్వీయ దర్శకత్వంలో జీవితభాగస్వామి నూర్బేగ్తో కలసి నటించిన ‘కులీదిలోంకీ షాహ్జాదా’ను ప్రదర్శించాడు. నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి ‘విభజనానంతర’ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండిన తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకొంది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విభజన తర్వాత నూతన రూపు రేఖలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. వ్యూహాత్మకంగా ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీతో జతకట్టడం, పవన్ కల్యాణ్ కలిసి రావడం తెలుగుదేశం పార్టీకి అనుకూలాంశాలుగా నిలిచాయి. రైతుల రుణమాఫీ హామీ కూడా చంద్రబాబు సారథ్యంలోని టీడీపీని గద్దెనెక్కించడంలో కీలకపాత్ర పోషించింది. 175 సీట్లలో 102 సీట్లు ఆ పార్టీ గెలుచుకోగలిగింది. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీకి అదనంగా లభించింది ఐదు లక్షల పైచిలుకు ఓట్లు మాత్రమే అయినప్పటికీ దశాబ్దంగా అధికారంలో లేని పార్టీని విజయపుగట్టుకు చేర్చడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారు. డాక్టర్ కె.శ్రీనాథ్ రెడ్డి ప్రజారోగ్యం... ఆయనకు భాగ్యం! దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వైద్య సంస్థ ‘ఎయిమ్స్’లో కార్డియాలజీ విభాగపు అధిపతి లాంటి అసామాన్యమైన హోదాను కూడా వదులుకున్నారు శ్రీనాథ్‌రెడ్డి. ప్రజలకు అవసరమైన ప్రాథమిక ఆరోగ్య వసతులూ అందని అసౌకర్యాలను గుర్తించి, ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ప్రజారోగ్యం కోసం అవసరమైన నిపుణుల తయారీ, వాళ్లకు అవసరమైన శిక్షణ, అందుకోసం కావాల్సిన 80 సంస్థలను నెలకొల్పడం వంటి బృహత్తర కార్యక్రమాలను చేపట్టారు. వాటికిగానూ భారత ప్రభుత్వం నుంచి ‘పద్మభూషణ్’ గౌరవం పొందిన ఈ వైద్యమణిని బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ ‘రాయల్ ఆనర్’తో సత్కరించారు. హైదరాబాద్‌లో బాల్యాన్ని గడిపిన శ్రీనాథ్‌రెడ్డికి తండ్రి బోధించిన స్వామి వివేకానంద సూక్తులే స్ఫూర్తి! నాగార్జున ‘మా’లో ఎవరు కోటీశ్వరుడు? అమితాబ్ బచ్చన్‌కి చెల్లుబాటయినట్టుగా అందరికీ కాదు. వెండితెరపై సూపర్‌స్టార్‌గా రాణిస్తూ, బుల్లితెర మీదికి జంప్ చేయడమంటే ఓ మెట్టు దిగినట్టే! అమితాబ్ మాత్రం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో పదిమెట్లు పైకి ఎక్కి చూపించాడు. నాగార్జున కూడా సేమ్ టూ సేమ్. మరికొన్ని సినిమాలు చేస్తే, వంద సినిమాలు పూర్తి చేసుకొనే దశలో ఉన్న నాగ్ ‘మా’ టీవీ కోసం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో చేయడమంటే ఒక రకంగా రిస్కే. కానీ 2014లో నాగ్ అవలీలగా బుల్లితెరను ఆక్రమించాడు. ఇన్నేళ్లూ వెండితెరపై మన్మథుడిలా ప్రకాశించిన నాగ్, బుల్లితెరపై కొత్త గెటప్‌తో సరికొత్త ఇమేజ్ తెచ్చుకున్నాడు. సాకేత్ మైనేని భవిష్యత్‌కు భరోసా వైజాగ్‌కు చెందిన 27 ఏళ్ల సాకేత్‌కు ఈ ఏడాది ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. భారత డేవిస్ కప్ జట్టులో స్థానం, ఏటీపీ చాలెంజర్ టోర్నీలో మూడు డబుల్స్ టైటిల్స్, రెండు ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్స్, ఆరు ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్స్, ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి స్వర్ణ పతకం, సనమ్ సింగ్‌తో కలిసి పురుషుల డబుల్స్‌లో రజతం, చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో పుణే మరాఠాస్ జట్టు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర... ఇలా సాకేత్ భారత టెన్నిస్ భవిష్యత్‌కు భరోసా కల్పించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 90 కేజీల బరువున్న ఈ ఆజానుబాహుడు పదునైన సర్వీస్‌లకు పెట్టింది పేరు. ఆటలోనే కాదు చదువులోనూ సాకేత్ మేటి. ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక అమెరికాలోని అలబామా యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ స్కాలర్షిప్ రావడంతో అక్కడకు వెళ్లాడు. చదువు పూర్తయ్యాక 2011లో భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే ఇండియన్ ఫ్యూచర్స్ టోర్నీలో సింగిల్స్‌తోపాటు డబుల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచి వెలుగులోకి వచ్చాడు. నలిమెల భాస్కర్ బహుభాషా అనువాదకుడు కరీంనగర్ వాసి నలిమెల భాస్కర్ ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అవార్డు పొందారు. ప్రముఖ మలయాళ రచయిత పునతిల్ కున్అబ్దుల్లా నవల ‘స్మారక శిలగళ్’ను నలిమెల తెలుగులోకి ‘స్మారక శిలలు’గా అనువదించారు. ఈ పుస్తకమే అవార్డుకు ఎంపికైంది. గ్రంథాలయాలే తరగతి గదులుగా భాస్కర్ భారతీయ భాషల్లో పట్టు సంపాదించారు. తాను తెలుగులో స్వయంగా ‘మంద’ కథను రాసి మరో 13 భారతీయ భాషా కథలను మూలభాష నుంచి అనువాదం చేసి భారతీయ కథలుగా పాఠకులకు అందించారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు బోధనా వృత్తిలో ఉండి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తెలంగాణ మాండలీకంపై ఇతోధిక కృషి చేస్తున్న నలిమెల భాస్కర్ నేషనల్ బుక్‌ట్రస్ట్ సలహామండలి సభ్యుడు. మత్స సంతోషి పేదరికాన్ని లిఫ్ట్ చేసింది నేపథ్యం ఎలాంటిదైనా పట్టుదలతో కృషి చేస్తే విజయం వరిస్తుందని విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం కొండవెలగడ గ్రామానికి చెందిన 20 ఏళ్ల మహిళా వెయిట్‌లిఫ్టర్ మత్స సంతోషి నిరూపించింది. అరకొర సౌకర్యాల నడుమ సాధన చేసిన సంతోషి ఈ ఏడాది స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. ఆమెకు కోచ్ చల్లా రాము మార్గదర్శకుడిగా నిలిచాడు. ఆమె గెలిచింది పేదరికాన్ని కూడా. ఎందుకంటే జూట్ మిల్లులో కార్మికుడైన సంతోషి తండ్రి తన సంపాదనలో ఎక్కువ భాగం తన కూతురు సాధనకే వినియోగించాడు. భారత్ తరఫున పలుమార్లు జూనియర్, యూత్ విభాగాల్లో ఆసియా, కామన్వెల్త్ పోటీల్లో పాల్గొన్న సంతోషి పలు పతకాలు సాధించింది. అందరి అంచనాలను నిజం చేస్తూ కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం నెగ్గి భవిష్యత్‌పై మరిన్ని ఆశలు పెంచింది. శ్రీధర్ కోట ఎగరడానికి కొత్త రెక్కలు రైట్ బ్రదర్స్ విమానాన్ని ఆవిష్కరించి వందేళ్లు గడచిపోతున్నా, దాని మౌలిక డిజైన్‌లో వచ్చిన మార్పులు దాదాపు శూన్యం. అదే ఆకారం, అవే పొడవైన రెక్కలు! అవసరాన్నిబట్టి ఆకారాన్ని మార్చుకునే రెక్కల ఫ్లాప్స్ (రెక్కల వెనుక భాగంలో పైకి, కిందకూ కదులుతూ ఉండే నిర్మాణాలు) రూపొందించారు శ్రీధర్ కోట! వీటిని అమర్చుకుంటే, ఇంధన ఖర్చు 12 శాతం వరకూ, టేకాఫ్, ల్యాండింగ్ల సమయాల్లోని శబ్దం 40 శాతం వరకూ తగ్గుతాయి. ‘అడాప్టివ్ కంప్లయింట్ ట్రెయిలింగ్ ఎడ్జ్’ పేరుతో శ్రీధర్ అభివృద్ధి చేసిన టెక్నాలజీని అమెరికా వాయుసేన ఇటీవలే విజయవంతంగా పరీక్షించింది. మన బేగంపేట విమానాశ్రయం నుంచి పైకి ఎగిరే విమానాల్ని చూస్తూ... 1980లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన శ్రీధర్ ఆ తరువాత అమెరికాలో స్థిరపడ్డారు. అందె శ్రీ ‘రాష్ట్ర’ గీత రచయిత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివిధ సంస్థలు, రాజకీయ పక్షాలు ఉద్యమించిన సందర్భంలో అంద్శై గీతం ‘జయజయహే తెలంగాణ’ సంకల్పశక్తిని ఇనుమడింపజేసింది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ గీతం రాష్ట్రగీతంగా అధికార హోదా పొందింది. గీత కర్త అంద్శైవరంగల్ జిల్లా రేబర్తిలో జన్మించారు. ‘గడ్డిపూల బొడ్డుతాడు తెంపుకుని నేలపై పడ్డాన’ంటారు. సుమతీ శతకం, వేమన శతకాల్లా తెలంగాణ ప్రజలు పాడుకునే ‘వరకవుల’ పద్యాలు ఆయనను ప్రకృతి కవిని చేశాయి. అందె ఎల్లయ్య అనే పూర్వనామాన్ని శృంగేరీ పీఠానికి చెందిన శంకర్ మహరాజ్ అంద్శై మార్చారు. ఆలమందలు కాస్తూ అపురూప వాక్కులమ్మను ఉపాసించిన అంద్శై జక్కిరెడ్డి మల్లారెడ్డి, మహ్మద్ మునీర్ సేట్ వంటి సహృదయులు ఆదరించారు. తెలంగాణ రాష్ట్రగీతం గురించి చెబుతూ- మొలకెత్తగానే విత్తనం చనిపోతుంది, కొన్నేళ్లుగా ప్రజల నాల్కలపై నునుపు తేలిన ఆ పాట నాది కాదు వారిదే అంటారు. తనను కొడుకుగా పెంచి పెద్దచేసిన బిరుదురాజు రామకృష్ణ ‘ఇది తెలంగాణకు మాత్రమే కాదు, తెలుగు నేలకు జాతీయ గీతం’ అని అభినందించారు. అలేఖ్య పుంజల కూచిపూడి గౌరవం పేరుకు తగ్గ శాస్త్రీయ నృత్యకారిణి పద్మశ్రీ అలేఖ్యా పుంజల. ఈ సంవత్సరం కోణార్క్ ఉత్సవంలో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించే అపూర్వ గౌరవాన్ని పొందారు. (గురు గంగాధర్ ప్రధాన్ 1986లో కోణార్క్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ప్రపంచశ్రేణి నృత్యకారులు, గాత్ర-వాద్య సంగీతకారులు ఒరిస్సాలోని కోణార్క నాట్యమండపంలో పాల్గొనడం జీవన సాఫల్యంగా భావిస్తారు.) భరతనాట్యం-కూచిపూడి రెండు శాస్త్రీయ నృత్యాల్లోనూ నిపుణురాలైన అలేఖ్య తాను కూచిపూడి పక్షపాతిని అంటారు. అభినయానికి, భావవ్యక్తీకరణకు కూచిపూడిలో అదనపు ఆస్కారం ఉంటుందంటారు. పురావస్తుశాస్త్రం ఆధారంగా శిల్పాలలో నృత్యకళ అంశంపై పరిశోధన చేసిన అలేఖ్య తెలుగు విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలు, నాట్యవిభాగం అధిపతి. సంగీత-నాటక అకాడెమీ పురస్కార గ్రహీత. కాంటెపరరీ జర్మన్ డ్యాన్సర్- ఇండియన్ క్లాసికల్ డ్యాన్సర్’ల అభినయపూర్వక ప్రదర్శన ‘యు అండ్ మి’ని హైద్రాబాద్, జర్మనీలలో ప్రదర్శించారు. వినోద్ చౌదరి రాపర్ల ఇన్స్టలేషన్ ఆర్ట్ పరిచయ కర్త ఒక అపురూపమైన చిత్రకళా ప్రదర్శనను చూడబోతున్నాం అనుకున్న కళాభిమానులు ఆ గదిలోకి వెళ్లి బిక్కమొగం వేశారు. కళ ఏమీ కనపడదే! కాని, ఆ గది వింతగా ఉంది. చిందరవందరగా ఉంది. గోనె సంచులు. దుమ్మెత్తి పోసుకునే దినపత్రికల క్లిప్పింగులు. ప్లాస్టిక్ కుర్చీలు. ఒక పాతకాలపు కుర్చీ. పైన నెమలి ఈకలు. సిల్క్ వస్త్రం. ఏమిటది? ‘ద గోల్డెన్ చైర్’ పేరుతో గుంటూరుకు చెందిన వినోద్ చౌదరి ఏర్పాటు చేసిన ఇన్స్టలేషన్ ఆర్ట్! ఒకానొక అంశాన్ని బలంగా చెప్పేందుకు త్రీడైమన్షన్స్ స్థలంలో అనేక వస్తువుల అమరికతో ఏర్పాటు చేసే వస్తు సముదాయమే ఈ కళ! మహాభారతం చరిత్ర కాదనీ, వర్తమానం కూడాననీ, భవిష్యత్తు బాగుండాలంటే కుర్చీపై కూర్చునేవారిని ఎంపిక చేసుకోవడంలో జాగరూకత పాటించాలనీ గోల్డెన్ చైర్ చెబుతుంది. తన లైఫ్ క్యాన్వాస్‌లో పెళ్లికి చోటులేదనీ, కళతోనే సహజీవనమనీ అంటాడు. చైన్నైలో సినిమాలకు ఆర్ట్ వర్క్ చేశాడు. ఇటీవలే తన చిత్రాలను ప్రదర్శిస్తోన్న అమెరికాలోని న్యూజెర్సీ మ్యూజియంను సంద ర్శించి వచ్చాడు. సంపూర్ణేశ్‌బాబు ఆల్మోస్ట్ స్టార్ ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల ప్రచారంతో వెండితెరపై ఉవ్వెత్తున ఎగిసిన కెరటం సంపూర్ణేశ్‌బాబు. తెలుగు చిత్ర సీమలో పేరుకు పోయిన పలు విధానాలను, రొడ్డకొట్టుడు కథాంశాలను, మూస పాత్రలను పరిహసిస్తున్న రీతిలో దర్శకుడు స్టీవెన్ శంకర్ చేసిన ‘హృదయ కాలేయం’ సినిమాతో సంపూర్ణేశ్‌బాబు రాత్రికి రాత్రి దాదాపు ‘స్టార్’గా అవతరించాడు. చిత్రమైన మాటతీరు, నిర్లక్ష్యపు శారీరక భాషతో సంపూర్ణేశ్ బాక్సాఫీస్‌కి పనికొచ్చే మూలకంగా మారాడు. సంపూర్ణేశ్తో నటుడు మంచు విష్ణు ‘పోకిరి రిటర్న్స్’ నిర్మిస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. మంజులతా కళానిధి అన్నదాత సుఖీభవ! ఛారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, అంటారు. అలా ఇంటిదగ్గర మొదలయ్యే దాతృత్వానికి కాస్తంత సోషల్ మీడియా గాలి కూడా తగిలిందంటే ఎనలేని గుర్తింపు వస్తుంది. ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సైట్ల ద్వారా సెలబ్రిటీల మధ్య ‘ఐస్ బకెట్’ ఛాలెంజ్ విజయవంతమైన విరాళ కార్యక్రమంగా నిలిస్తే, దాని స్ఫూర్తితో ‘రైస్ బకెట్ ఛాలెంజ్’ ప్రారంభించారు హైదరాబాద్‌కు చెందిన మంజులతా కళానిధి. ఒక బకెట్ పరిమాణంలోని బియ్యాన్ని అన్నార్థులకు అందజేస్తున్న ఫొటోను తన ఫేస్బుక్ పేజ్‌లో పోస్ట్ చేసి, అందరూ అలాంటి దాన కార్యక్రమాన్ని చేపట్టాలని సవాలు విసిరారు ఆమె. వేల మంది మంజులత ఐడియాను అభినందిస్తూ లైక్ కొట్టగా, అనేక మంది బకెట్టుడు బియ్యాన్ని ఇవ్వడమో, ఆ పరిమాణపు బియ్యాన్ని వండివడ్డించడమో చేశారు. ఎంవైఎస్ ప్రసాద్ మన శాస్త్రవేత్త చంద్రయాన్, మామ్, తాజాగా జీఎస్ఎల్వీ మార్క్-3... భారత అంతరిక్ష ప్రయోగాల వరుస విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఎంవైఎస్ ప్రసాద్! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో దాదాపు 37 ఏళ్ల అనుభవాన్ని గడించిన ప్రసాద్ ఎలక్ట్రానిక్స్ రంగంలో కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఇంజినీరింగ్ పట్టా (1974) అందుకున్నారు. ఆ తరువాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్స్ అంశంపై స్నాతకోత్తర విద్యనభ్యసించారు. భారత దేశం తొలిసారి విజయవంతంగా ప్రయోగించిన లాంచ్ వెహికల్ ఎస్ఎల్వీ 3 అభివృద్ధిలోనూ ప్రసాద్ పాలుపంచుకున్నారు. 2013 నుంచి శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం డెరైక్టర్‌గా పదవీబాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి త్వరలో విడుదల వరుస విజయాల పరుసవేది అనిపించుకున్న రాజమౌళి ‘ఈగ’ సినిమా 2012 జూలై 6న విడుదలైంది. అప్పటి నుంచీ ఆయన ‘బాహుబలి’ అనే అతి పెద్ద కలను నెరవేర్చుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. ప్రచారార్భాటాలకు దూరంగా నిర్మాణం జరుగుతున్నా కూడా, ఈ సినిమాకు సంబంధించిన రకరకాల గాసిప్‌లతో ఈ దర్శకుడు ఏడాదంతా మీడియాలో మార్మోగుతూనే ఉన్నాడు. బడ్జెట్, గెటప్స్, కాస్టింగ్, గ్రాఫిక్స్... ఇలా 24 శాఖల పరంగానూ ‘బాహుబలి’ వార్తల్లో నిలవడానికి ఆయన ఇమేజే కారణం! రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి సాహిత్యానికి రాచమర్యాద తెలుగు సాహిత్య లోకంలో నిబద్ధతగల విమర్శకుడిగా గుర్తింపు ఉన్న ప్రముఖ రచయిత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ‘మన నవలలు-మనకథానికలు’ పేరుతో చంద్రశేఖర్ రెడ్డి రచించిన విమర్శనా గ్రంథానికి అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా సాహిత్యానికి విశేష సేవలు అందించిన 24 మంది ప్రముఖులకు ప్రతియేటా సాహిత్య అకాడమీ అవార్డులను ఇస్తుంది. చిత్తూరు జిల్లా తిరుపతి మండలం కుంట్రపాకం గ్రామానికి చెందిన రాచపాలెం శ్రీ కృష్ణదేవరాయ, శ్రీ వెంకటేశ్వర, యోగి వేమన విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసి పదవీవిరమణ పొందారు. ప్రస్తుతం ఆయన సీపీ బ్రౌన్ భాషాపరిశోధన కేంద్రానికి ప్రధాన బాధ్యతల్లో ఉన్నారు. మాలావత్ పూర్ణ సద్దనపల్లి ఆనంద్‌కుమార్ శిఖరమంత విజయం! ఎవరెస్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తై శిఖరం. మరి దాన్ని అధిరోహిస్తే ఆ శిఖరమంతటి పేరు ప్రఖ్యాతులు సొంతమవుతాయి. అలాంటి ఖ్యాతిని అతి చిన్న వయసులోనే సంపాదించుకొన్నారు మాలావత్ పూర్ణ (13), సద్దనపల్లి ఆనంద్‌కుమార్(18). పూర్ణ అయితే ఎవరెస్ట్‌ను అధిరోహించిన అత్యంత పిన్నవయస్కురాలిగా కూడా రికార్డు సృష్టించింది. సాంఘిక సంక్షేమ విద్యాలయాల్లో అభ్యసిస్తున్న ఈ సాహస వీరులకు తెలుగుజాతి నీరాజనాలు పట్టింది. 29,035 అడుగుల ఎత్తున జాతీయ పతాకాన్ని ప్రతిష్టించిన వీళ్లను చూసి భారతజాతి మొత్తం గర్వించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ, ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్... ట్రైనర్ శేఖర్ మార్గదర్శకత్వంలో ఈ అరుదైన ఘనత సాధించారు. క్రమశిక్షణ, నిబద్ధత, ఆత్మవిశ్వాసం లాంటి పదాలు మాత్రమే పూర్ణ, ఆనంద్‌ల సాహసాన్ని అర్థంచేసుకోవడానికి సరిపోవేమో! కిడాంబి శ్రీకాంత్ చైనా గడ్డపై తెలుగు బిడ్డ గర్జన మెదడువాపు జ్వరంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి... నెమ్మదిగా కోలుకొని... నమ్మశక్యంకాని విజయంతో ‘తెలుగు రాకెట్’ పదునెంతో చూపించాడు కిడాంబి శ్రీకాంత్. 21 ఏళ్ల ఈ యువతార ఏమాత్రం అంచనాలు లేకుండా చైనా గడ్డపై చమక్కుమనిపించాడు. ‘బ్యాడ్మింటన్ సచిన్’లా పేరొందిన చైనా సూపర్‌స్టార్ లిన్ డాన్‌ను అతని సొంతగడ్డపైనే ఓడించి, బ్యాడ్మింటన్ ప్రపంచాన్నే నివ్వెరపరిచాడు. 2007లో మొదలైన చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గడం ద్వారా ఈ హైదరాబాద్ యువకుడు దాన్ని నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. (సాక్షి స్పోర్ట్స్, బిజినెస్, ఎడ్యుకేషన్, సైన్స్, సినిమా, పొలిటికల్, హెల్త్, కల్చరల్ డెస్కుల సహకారంతో)