హైదరాబాద్: రెండేళ్లుగా ఉపాధ్యాయ బదిలీల కోసం నిరీక్షిస్తున్న టీచర్లకు ఈసారీ నిరాశ తప్పేలా లేదు. విద్యార్థుల్లేని స్కూళ్లలోని టీచర్లను విద్యార్థులు ఉన్నచోటికి పంపిం చేందుకు టీచర్ల హేతుబద్ధీకరణ మాత్రమే చేపట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.
ఇటీవల ఇంటర్ ఫలితాల విడుదల సందర్భంగా టీచర్ల బదిలీ లుంటాయా? లేదా? అని విలేకరులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని అడిగిన ప్రశ్నలపై సమాధానాన్ని దాటవేశారు. మరోవైపు పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు మాత్రమే కసరత్తు ప్రారంభించిం ది. ఇందులో భాగంగా మేలోనే ఈ ప్రక్రియను చేపట్టి పూర్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రతిపాదనలు పంపించింది. అయితే బదిలీలకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు పంపించనట్లు తెలిసింది.
ఈసారి ఉపాధ్యాయుల బదిలీలు డౌటే!
Published Thu, Apr 30 2015 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM
Advertisement
Advertisement