2017లో 20 లక్షల ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: దేశంలోని నిరుద్యోగులకు నిజంగా ఇది శుభవార్తే. డీమానిటైజేషన్ కారణంగా టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలకు లభిస్తున్న ప్రోత్సాహం లాంటి ఇతర కారణాలల మూలంగా టెలికాం రంగంలో నిపుణుల అవసరం బాగా పెరగనుందని , దీంతో ఈ ఏడాది సుమారు 20 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది.
కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్ సర్వీసెస్ రిపోర్ట్ ప్రకారం డేటా వ్యాప్తి, కొత్త సర్వీసు ప్రొవైడర్ల ప్రవేశంకారణంగా రెండు మిలియన్ల ఉద్యోగాలు ఈ ఏడాది పెరిగనున్నాయి. ఇందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలని నివేదిక భావించింది. డీమానిటైజేషన్ , మొబైల్ ధరలు తగ్గడం, నెట్ వర్క్ విస్తరణకు ఆయా కంపెనీల పెట్టుబడులు,ఇంటర్నెట్ వినియోగం , డిజిటల్ లావాదేవీలు పెరగడం, ప్రభుత్వ సంస్కరణలు ఇందుకు కలిసి రానున్నాయని పేర్కొంది. టెలికాం రంగ నైపుణ్య కౌన్సిల్ (టీఎస్‌ఎస్‌సీ)తో కలిసి ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది.
5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచాలని, తద్వారా భారీ స్థాయిలో ఉపాధి కల్పన జరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఈ విభాగంలో 2020-21 నాటికి 9.20 లక్షల ఉద్యోగాలు (ఇన్ఫ్రాస్ట్రక్చర్) లభిస్తాయని తెలిపింది. 2021 నాటికిటెలికాం రంగంలో మొత్తం 87 లక్షల మందికి పైగా ఉపాధి దొరుకుంతుందని అంచనా వేసింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ (ఐఓటీ), మొబిలిటీ సొల్యూషన్స్, టెలికాం మౌలిక సదుపాయాలు, నెట్వర్క్ నిర్మాణాలు, విక్రయాలు తదితర విభాగాలకు నిపుణులు అవసరమని టీమ్‌లీజ్ సర్వీసెస్ సీనియర్ ఉపాధ్యక్షులు నీతి శర్మ అన్నారు.
మొబైల్ తయారీ సంస్థలకు 17.60 లక్షల (1.76 మిలియన్) మంది, టెలికాం ఆపరేటర్లకు 3.70 లక్షల (0.37 మిలియన్)మంది ఉద్యోగుల అవసరమున్నట్లు తన నివేదికలో పేర్కొంది. నెట్‌వర్క్ ఇంజినీర్లు, సైబర్ భద్రతా నిపుణులు, సేవల నిపుణులు, యాప్ డెవలపర్లు, సిస్టమ్ ఇంజినీర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, మొబైల్ తయారీ నిపుణులు, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ , ఐ-డీఏఎస్ ఇంజనీర్లు ఉన్నాయి, బ్యాక్ ఆఫీస్ & ఎడ్మినిస్ట్రేషన్ లాంటి కీలక ప్రొఫైల్స్ లో 2017 నాటికి డిమాండ్ బాగా ఉంటుందని తెలిపింది.