ఏసీబీ దూకుడు | active ACB | Sakshi
Sakshi News home page

ఏసీబీ దూకుడు

Published Mon, Dec 26 2016 1:40 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

active ACB

ఏలూరు అర్బన్‌: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస దాడులు, ఆకస్మిక తనిఖీలతో అవినీతి ఉద్యోగులు, లంచగొండి అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెడుతున్నవారి గుండెల్లో ఏసీబీ అధికారులు నిద్రపోతున్నారు. పక్కా ప్రణాళికతో, పటిష్టమైన వ్యూహంతో అవినీతి అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. బాధితుల సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతూ మెరుపుదాడులు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు ఎనిమిది ట్రాప్‌ (బాధితుల ఫిర్యాదు మేరకు వలపన్ని పట్టుకున్న కేసు)లు, ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసు ఒకటి కలిపి మొత్తంగా తొమ్మిది కేసులు నమోదు చేయడంతో పాటు ఏడు ఆకస్మిక తనిఖీలు చేశారు. గతేడాది ఏసీబీ అధికారులు 12 కేసులు నమోదు చేయగా  వాటిలో ఎనిమిది ట్రాప్‌లు ఉన్నాయి. ఒకటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, ఏడు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయి. 
 
ట్రాప్‌లు ఇలా..
lమార్చి 9న చింతలపూడి సబ్‌రిజిస్ట్రార్‌ రేపల్లి వెంకట గోపాలకృష్ణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 
lమార్చి 24న స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్‌ఐ కోళ్ల  వెంకట సత్య ఉదయ్‌భాస్కర్‌ ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు.
lమే 3న లింగపాలెం తహసీల్దార్‌ కార్యాలయంలో డెప్యూటీ తహసీల్దార్‌ సూరిశెట్టి శివశంకర్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 
lమే 19న ఐఎస్‌ రాఘవాపురంలో వీఆర్వోగా పనిచేస్తున్న పుల్లా నాగయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
lజూలై 27న పాలకొల్లు మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన దాడుల్లో మున్సిపల్‌ మేనేజర్‌  ఎ.తారకనాథ్‌తో పాటు సీ–1 క్లర్క్‌  పీవీ గోపాలకృష్ణ పట్టుబడ్డారు. 
lఆగస్టు 8న పెనుగొండ పంచాయతీ కార్యాలయంలో జరిగిన దాడుల్లో పంచాయతీ కార్యదర్శి పి.వసంతరావును లంచం తీసుకుం టుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.  ఇదే కేసులో రిటైర్డ్‌ పంచాయతీ సెక్రటరీ జి.సత్యనారాయణ, రికార్డు అసిస్టెంట్‌ ఎల్‌. రామారావుపై కూడా కేసులు నమోదు చేశారు. 
నవంబర్‌ 30న నరసాపురం తహసీల్దార్‌ కార్యాలయంలో జరిపిన దాడుల్లో ఆర్‌ఐ జి.పెద్దిరాజును లంచం తీసుకుంటుండగా  ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈనెల 16న ఏలూరు వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జరిపిన దాడుల్లో రూ.40 వేలు లంచం తీసుకుంటున్న అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌ ఎండీ మస్తాన్, సహకరించిన సీనియర్‌ అసిస్టెంట్‌ ఫణికుమార్‌ను అరెస్ట్‌ చేశారు. 
ఆదాయానికి మించి ఆస్తుల కేసు
ఏప్రిల్‌ 24న ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో డీఈఈ వంగపండు వెంకట సత్యనారాయణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారం నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 
ఆకస్మిక తనిఖీల్లో భారీగా సొమ్ము
lజనవరి 23న తాడిపూడి ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ ముప్పిడి సమజ కార్యాలయంలో లెక్కల్లో చూపని రూ.4 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఫిబ్రవరి 2న ఏపీ–తెలంగాణ సరిహద్దు జీలుగుమిల్లి కమర్షియల్‌ టాక్స్‌ చెక్‌పోస్టుపై దాడి చేసిన ఏసీబీ అధికారులు  రూ.75,970 సీజ్‌ చేశారు.
lమే 23న సివిల్‌ సప్లయిస్‌ ఇన్వెస్టర్‌ గోడౌన్స్‌ పై దాడిచేసిన అధికారులు రూ.1.36 లక్షల అనధికార సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. 
lజూన్‌ 6న జంగారెడ్డిగూడెం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దాడి చేసి సబ్‌రిజిస్ట్రార్‌ దిగుమర్తి జయరాజు వద్ద ఉన్న రూ. 1,76,460 నగదు సీజ్‌ చేశారు. 
lజూలై 21న ఏలూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నిర్వహించిన తనిఖీల్లో  రూ. 3,66,415 అనధికార సొత్తు స్వాధీనం చేసుకున్నారు. 
 
ప్రజలూ భాగస్వాములు కావాలి
అవినీతిని నిర్మూలన కేవలం అవినీతి నిరోధకశాఖకే పరిమితం కాదు. అవినీతిని నిర్మూలించడంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలి. లంచం పుచ్చుకోవడంతో పాటు లంచం ఇవ్వడం కూడా నేరమే అని ప్రతివారూ తెలుసుకోవాలి. ప్రజలు కూడా లంచాలు ఇవ్వడం మానుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తన వి««దlులు నిర్వహించేందుకు గాను ప్రతినెలా వేలు, లక్షల్లో జీతాలు ఇస్తోంది. ప్రభుత్వోగులు ప్రజలను లంచాలు డిమాండ్‌ చేయడం శిక్షార్హమైన నేరం. ఏ అధికారి లేదా ఉద్యోగి లంచం కోసం వేధిస్తున్న సమయంలో బాధితులు లేదా అవినీతి విషయం తెలిసిన వారు కూడా నేరుగా ఏలూరు శాంతినగర్‌ గ్జేవియర్‌ స్కూల్‌ రోడ్డులో ఉన్న అవినీతి నిరోధకశాఖ కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. లేదా 94404 46157, 94404 46158, 94404 46159 నంబర్లకు ఫో¯ŒSలో సమాచారం అందించవచ్చు. అలా చేసిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతాం. – వి.గోపాలకృష్ణ, ఏసీబీ డీఎస్పీ, ఏలూరు రేంజ్‌ 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement