closer
-
ఏడాదిలో 20 వేలకు పైగా స్కూళ్లు మూసివేత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో 2020–21లో 20 వేలకు పైగా స్కూళ్లు మూతపడ్డాయని కేంద్ర విద్యా శాఖ తాజా నివేదిక వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే టీచర్ల సంఖ్య 1.95% తగ్గిందని తెలిపింది. దేశంలో 44.85% స్కూళ్లకు మాత్రమే కంప్యూటర్ సదుపాయం ఉందని, 34% పాఠశాలల్లో మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉందని పాఠశాల విద్యపై యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+) నివేదించింది. ► 2020–21లో 15.09 లక్షల స్కూళ్లు ఉంటే 2021–22లో 14.89లక్షలకి తగ్గిపోయాయి. ► 2020–21లో 97 లక్షలున్న టీచర్ల సంఖ్య 2021–22 నాటికి 95 లక్షలకి తగ్గిపోయింది. ► దివ్యాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేక టాయిలెట్లు 27%స్కూళ్లలోనే ఉన్నాయి. ► 2020–21లో 25.38 కోట్ల మంది ఉండే విద్యార్థుల సంఖ్య 2021–22 వచ్చేసరికి 25.57 కోట్లకి పెరిగింది. ► ప్రి ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల చేరిక11.5 లక్షలు తగ్గింది. కరోనా ప్రభావంతో చిన్న పిల్లల్ని స్కూళ్లలో చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో వారి సంఖ్య తగ్గింది. -
మూతబడిన మరో స్టార్టప్.. షాప్‌ఎక్స్
న్యూఢిల్లీ: వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేకపోవడంతో మరో స్టార్టప్ సంస్థ మూతబడింది. టెక్ దిగ్గజం నందన్ నీలేకని ఇన్వెస్ట్ చేసిన షాప్‌ఎక్స్ కార్యకలాపాలు నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నాయి. అత్యంత స్వల్ప మార్జిన్ల వల్ల వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి. ఈ ఏడాది ఇప్పటికే ఎడ్టెక్ స్టార్టప్‌లు క్రెజోడాట్ఫన్, సూపర్లెర్న్, ప్రోటాన్ తదితర స్టార్టప్‌లు మూతబడ్డాయి. కిరాణా స్టోర్స్, ఇతర చిన్న తరహా రిటైలర్లకు లాజిస్టిక్స్, కొనుగోళ్లపరమైన సహకారం అందించేందుకు 2014లో అమిత్ శర్మ, అపూర్వ జోయిస్ కలిసి షాప్‌ఎక్స్ ఏర్పాటు చేశారు. నందన్ నీలేకనితో పాటు ఫంగ్ స్ట్రాటెజిక్ హోల్డింగ్స్, రాజేశ్ రణావత్, కేవల్ నోరియా తదితర ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ 2020 నాటికి 60 మిలియన్ డాలర్లు సమీకరించింది. తీవ్రమైన పోటీతో తరచూ వ్యాపార వ్యూహాలను మార్చుకున్నప్పటికీ మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది. నిధుల కొరత కారణంగా తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైంది. -
ఫోర్డ్... రివర్స్‌గేర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న యూఎస్ కంపెనీ ఫోర్డ్ మోటార్ భారత్‌లోని తయారీ కేంద్రాలను మూసివేస్తోంది. అలాగే ఎకో స్పోర్ట్, ఫిగో, అసై్పర్ మోడళ్ల అమ్మకాలకు స్వస్తి పలకనుంది. ముస్టాంగ్ కూపే, మ్యాచ్–ఈ వంటి దిగుమతి చేసుకున్న వాహనాలను మాత్రమే ఇక్కడ విక్రయించనున్నట్టు గురువారం ప్రకటించింది. పునరి్నర్మాణ కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సరీ్వస్, విడి భాగాలు, వారంటీ కవరేజ్ కోసం పూర్తి కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలను కొనసాగిస్తామని కంపెనీ తెలిపింది. గుజరాత్ సనంద్‌లోని అసెంబ్లింగ్ సెంటర్‌ను ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ మధ్య, చెన్నైలోని వాహనాలు, ఇంజన్ల తయారీ కేంద్రాన్ని 2022 ఏప్రిల్–జూన్ కాలంలో మూసివేస్తామని కంపెనీ వెల్లడించింది. అమెరికా వాహన కంపెనీల్లో భారత్‌లో ప్లాంట్లను మూసివేసిన తొలి సంస్థ జనరల్ మోటార్స్ కాగా రెండోది ఫోర్డ్ కానుంది. విలువను సృష్టించడానికి.. ‘ఫోర్డ్ ప్లస్ ప్రణాళికలో భాగంగా స్థిర, లాభదాయక వ్యాపారాన్ని దీర్ఘకాలికంగా అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. సరైన స్థాయిలో వృద్ధికి, విలువను సృష్టించడానికి మూలధనాన్ని కేటాయిస్తాం’ అని ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ జిమ్ ఫార్లే ఈ సందర్భంగా తెలిపారు. ‘డీలర్లతో కలిసి పనిచేస్తూ విలువైన కస్టమర్ల కోసం శ్రద్ధ వహిస్తాం. భారత్ మాకు వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా భారీ, ముఖ్యమైన ఉద్యోగుల స్థావరంగా ఫోర్డ్ బిజినెస్ సొల్యూషన్స్ కొనసాగుతుంది’ అని వివరించారు. ఫోర్డ్ బిజినెస్ సొల్యూషన్స్‌లో 11,000 పైచిలుకు మంది పనిచేస్తున్నారు. సామర్థ్యంలో 21 శాతమే.. భారత్‌లో వాహనాల తయారీలో కంపెనీ పెట్టుబడులు కొనసాగించడానికి, అందుకు తగ్గ రాబడిని అందించే మార్గాన్ని చూపించాల్సిన అవసరం ఉందని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ అనురాగ్ మెహరోత్రా అన్నారు. ‘దురదృష్టవశాత్తు మేము మార్గాన్ని చూపించలేకపోయాం. ఇప్పుడు భారతదేశంలో వ్యాపారాన్ని పునరి్నరి్మంచడం తప్ప మరో మార్గం లేదు. కొత్త ఉత్పత్తుల పరిచయం, వ్యయాలను తగ్గించడానికి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై దృష్టి, మహీంద్రా వంటి సంస్థలతో భాగస్వామ్యం, కాంట్రాక్ట్ తయారీతో సహా చేపట్టిన ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత కంపెనీ పునర్నిర్మాణ చర్య తీసుకుంది. భారత ఆటోమొబైల్ రంగంలో అంచనాలకు తగ్గట్టుగా వృద్ధి లేదు. మా ప్లాంట్లు స్థాపిత సామర్థ్యంలో కేవలం 21 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. అందుకే మేము ఎగుమతులపై దృష్టి పెట్టాం. కానీ యూఎస్, యూరప్‌లో నిబంధనలను కఠినతరం చేయడంతో పరిమాణం పడిపోయింది. ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు సహేతుక ప్యాకేజీ ఇస్తాం. ప్లాంట్ల విషయంలో కొనుగోలుదార్లతో చర్చిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. దేశంలో భారీ పెట్టుబడులు.. రెండు ప్లాంట్లపై సంస్థ రూ.18,500 కోట్లు పెట్టుబడి చేసింది. ఏటా 6,10,000 ఇంజన్లు, 4,40,000 వాహనాల తయారీ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎకో స్పోర్ట్, ఫిగో, అస్పైర్ మోడళ్లు తయారవుతున్నాయి. 70 దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు. ఇక నుంచి వీటి తయారీతోపాటు విక్రయాలు సైతం భారత్‌లో నిలిచిపోనున్నాయి. గత 10 ఏళ్లలో కంపెనీ నిర్వహణ నష్టాలు రూ.14,800 కోట్లు పేరుకుపోయాయి. భారీ స్థాయిలో పెట్టుబడులు చేసినప్పటికీ అంచనాలకు తగ్గట్టుగా కార్లకు డిమాండ్ లేకపోవడం సమస్యను తీవ్రం చేసింది. కంపెనీ నిర్ణయం 4,000 మంది ఉద్యోగులతోపాటు 300 ఔట్లెట్లను నిర్వహిస్తున్న 150 డీలర్íÙప్స్ ప్రిన్సిపల్స్‌పైన పడనుంది. డీలర్లకు షాక్... రూ.2,000 కోట్ల పెట్టుబడులపై ప్రభావం ‘ఫోర్డ్ డీలర్లు రూ.2,000 కోట్లకుపైగా పెట్టుబడి చేశారు. కంపెనీ నిర్ణయం షాక్‌కు గురి చేసింది’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. 40,000 పైచిలుకు ఉద్యోగులు ఈ డీలర్ల వద్ద పనిచేస్తున్నట్టు వివరించింది. రూ.150 కోట్ల విలువైన 1,000 వాహనాలు వీరి వద్ద నిల్వ ఉన్నట్టు ఫెడరేషన్ ప్రెసిడెంట్ వింకేశ్ గులాటీ వెల్లడించారు. ‘డెమో వెహికిల్స్ సైతం డీలర్ల వద్ద ఉన్నాయి. అయిదు నెలల క్రితం వరకు కూడా డీలర్లను కంపెనీ నియమించుకుంది. ఇటువంటి డీలర్లు భారీగా నష్టపోతారు. ఫ్రాంచైజీ ప్రొటెక్షన్ యాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావాలి. పార్లమెంటరీ కమిటీ ఈ విషయాన్ని ప్రతిపాదించింది కూడా. 2017 నుంచి భారత మార్కెట్లో జనరల్ మోటార్స్, మ్యాన్ ట్రక్స్, హార్లే డేవిడ్సన్, యూఎం లోహియా.. తాజాగా ఫోర్డ్ ఇండియా బోర్డ్ తిప్పేసింది’ అని అన్నారు. -
మెజారిటీ ఇన్వెస్టర్ల ఆమోదం అవసరమే
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాలను మూసివేయాలంటే అందుకు మెజారిటీ యూనిట్ హోల్డర్ల (ఆయా పథకాల్లో పెట్టుబడిదారులు) ఆమోదం అవసరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ గతేడాది ఏప్రిల్‌లో ఆరు డెట్ పథకాలను మూసివేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. పథకాల మూసివేతకు కారణాలను తెలియజేస్తూ నోటీసును విడుదల చేసి.. మెజారిటీ యూనిట్ హోల్డర్ల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్ ట్రస్టీలు నిబంధనలను ఉల్లంఘిస్తుంటే జోక్యం చేసుకునే అధికారాలు సెబీకి ఉన్నాయని స్పష్టం చేసింది. ఇన్వెస్టర్ల సమ్మతి లేకుండా డెట్ పథకాలను మూసివేయడం కుదరదంటూ కర్ణాటక హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు లేదా ఏఎంసీలు నిబంధనలకు కట్టుబడి లేకపోతే జోక్యం చేసుకుని ఆదేశాలు ఇచ్చే అధికారం సెబీకి ఉందని తేల్చి చెప్పింది. ఈ ఆదేశాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇదే అంశంపై దాఖలైన పలు ఇతర వ్యాజ్యాలపై సుప్రీం విచారణ చేపట్టింది. దీంతో జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిబంధనలపై వివరణ ఇచ్చింది. యూనిట్ హోల్డర్ల అనుమతి అవసరం అంటూ సెబీ నిబంధనలు 18 (15)(సీ), 39(3)లను ధర్మాసనం ప్రస్తావించింది. నిబంధనల ఉల్లంఘన చోటుచేసుకున్నందున విచారణ, దర్యాప్తు చేసే అధికారం సెబీకి ఉంటుందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఇప్పటికే వాటాదారుల ఆమోదం పొందింది. ఆరు డెట్ పథకాల పరిధిలో రూ.25,000 కోట్ల నిధులకు గాను మెజారిటీ మొత్తాన్ని ఇన్వెస్టర్లకు చెల్లింపులు కూడా చేసింది. షిప్పింగ్ సబ్సిడీ స్కీముకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ: భారత్‌లో నమోదు చేయించుకునేలా షిప్పింగ్ కంపెనీలను ఆకర్షించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 72 గంటల్లోనే నమోదు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఉత్పత్తుల దిగుమతికి సంబంధించి అంతర్జాతీయ టెండర్లలో పాల్గొనే దేశీ షిప్పింగ్ కంపెనీలకు రూ. 1,624 కోట్ల సబ్సిడీ కల్పించే స్కీమునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అయిదేళ్ల పాటు ఇది వర్తిస్తుంది. -
అమ్మఒడి పథకంపై పిల్ మూసివేత
సాక్షి, అమరావతి: కనీస వివరాలు లేకుండా ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మఒడి పథకానికి రూ.24.24 కోట్ల నిధుల విడుదలకు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్‌కు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయవాది చింతా ఉమామహేశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గత వారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, ప్రాథమిక సమాచారం లేకుండా పిల్ దాఖలు చేయడమే కాక, వివరాలు కోరితే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశామని ఎలా చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. తగిన సమాచారం లేకుండా ఇలాంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో కోర్టు సమయాన్ని వృథా చేయడం తగదని పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, సీజే ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి సమాచారంతో తిరిగి పిల్ దాఖలు చేసుకోవచ్చంది. ‘ఈ–వాచ్’పై తదుపరి విచారణ 25కి వాయిదా పంచాయతీ ఎన్నికల నిర్వ హణకోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) సొంతంగా ఈ–వాచ్ పేరుతో యాప్‌ను రూపొందించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ–వాచ్ యాప్ విషయంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్(ఏపీటీఎస్ఎల్) లేవనెత్తిన సందేహాలు, అభ్యంతరాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చిందని, దీన్ని పరిశీలించేందుకు సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. దీంతో తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ–వాచ్ యాప్‌ను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులివ్వడంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ యాప్‌లైన ‘సీ–విజిల్’, ‘నిఘా’లను ఉపయోగించేలా ఆదేశాలివ్వాలంటూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు న్యాయవాది కట్టా సుధాకర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఇవే అభ్యర్థనలతో గుంటూరు జిల్లా తెనాలి, బుర్రిపాలెంలకు చెందిన ఎ.నాగేశ్వరరావు, ఎ.అజయ్‌కుమార్‌లు వేర్వేరుగా పిల్స్ వేశారు. మాపై కేసులు కొట్టేయండి హైకోర్టులో పౌర హక్కుల సంఘం, విరసం నేతల పిటిషన్లు సాక్షి, అమరావతి: తమపై విశాఖపట్నం జిల్లా, ముంచంగిపుట్టు, గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ పౌర హక్కుల సంఘం, కుల నిర్మూలన వ్యతిరేక పోరాట సమితి, విరసం సభ్యులతో పాటు మరికొంతమంది దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ పౌర హక్కుల సంఘం నేత చిలుకా చంద్రశేఖర్ మరికొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్, గంటా రామారావు, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి స్థాయి వాదనల నిమిత్తం విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు. సివిల్ జడ్జిల భర్తీ అర్హతపై దాఖలైన పిటిషన్ కొట్టివేత సాక్షి, న్యూఢిల్లీ: మూడేళ్లపాటు న్యాయవాద వృత్తి చేసిన వారే జూనియర్ సివిల్ జడ్జి పదవికి అర్హులంటూ ఆంధ్రప్రదేశ్‌లో జారీ అయిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ రేగలగడ్డ వెంకటేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ హృషీకేశ్రాయ్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. మూడేళ్ల న్యాయవాద వృత్తి చేసిన వారే సబార్డినేట్ కోర్టుల్లో న్యాయమూర్తుల పదవులకు అర్హులంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, పిటిషన్ ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌కు సూచించిన ధర్మాసనం పిటిషన్ కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. -
అమెరికాలో బ్రాండ్ల దివాలా..
న్యూయార్క్: అమెరికాలో శతాబ్దాలుగా కొనసాగుతున్న రిటైల్ దిగ్గజ సంస్థలు కరోనా వైరస్ దెబ్బతో మూతబడుతున్నాయి. రోజురోజుకూ ఈ లిస్టు గణనీయంగా పెరుగుతోంది. తాజాగా లార్డ్ అండ్ టేలర్, మెన్స్ వేర్‌హౌస్, జోస్ ఎ బ్యాంక్స్ తదితర సంస్థలు దివాలా చట్టం కింద రక్షణ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశాయి. లార్డ్ అండ్ టేలర్ 1824లో ప్రారంభమైంది. దీన్ని గతేడాదే ఫ్రాన్స్‌కి చెందిన దుస్తుల రెంటల్ సంస్థ లె టోట్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ రెండూ వేర్వేరుగా దివాలా పిటిషన్లు దాఖలు చేశాయి. కొనుగోలుదారు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు లార్డ్ అండ్ టేలర్ వెల్లడించింది. దాదాపు శతాబ్దంపైగా తమ చేతుల్లోనే ఉన్న 11 అంతస్తుల భవంతిని ఈ కంపెనీ గతేడాదే విక్రయించింది. ఇక, సూట్లకు డిమాండ్ పడిపోవడంతో మెన్స్ వేర్‌హౌస్, జోస్ ఎ బ్యాంక్స్ స్టోర్స్ వంటి బ్రాండ్ల మాతృసంస్థ టైలర్డ్ బ్రాండ్స్ కష్టాలు మరింత పెరిగి, దివాలాకు దారితీశాయి. మరోవైపు, దాదాపు అమెరికా అధ్యక్షులందరికీ దుస్తులు అందించిన 200 ఏళ్ల నాటి సంస్థ బ్రూక్స్ బ్రదర్స్ కూడా దివాలా పిటిషన్ వేసింది. మొత్తం మీద గతేడాది మొత్తంమీద దాఖలైన దివాలా పిటిషన్లతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో దాఖలైనవే ఎక్కువ కావడం గమనార్హం. కరోనా వైరస్ మహమ్మారి ప్రబలడం మొదలైనప్పట్నుంచి ఇప్పటిదాకా రెండు డజన్లపైగా స్టోర్స్ దివాలా తీశాయి. జె క్రూ, జేసీ పెన్నీ, నైమాన్ మార్కస్, స్టేజ్ స్టోర్స్, ఎసెనా రిటైల్ గ్రూప్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. -
ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్
వాషింగ్టన్: సామాజిక మాధ్యమం ట్విట్టర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోపం తగ్గలేదు. తన ట్వీట్లలో నిజానిజాలు నిర్ధారించుకోవాలని ట్విట్టర్.. ఆ ట్వీట్లకు ట్యాగ్ తగలించడంతో ట్రంప్‌కు కోపంరావడం తెల్సిందే. ‘వాటిని (ట్విట్టర్) నియంత్రిస్తాం. లేదంటే మూసేస్తాం’ అని తాజాగా ట్వీట్‌చేశారు. ‘వాళ్లు మా గొంతు నొక్కేస్తున్నారు. భారీ చర్య కోసం ఎదురు చూడండి’ అని మరో ట్వీట్‌చేశారు. కాగా, సామాజిక మాధ్యమాలకు సంబంధించి అధ్యక్షుడు ఒక ఎగ్జిక్యుటివ్ ఆర్డర్‌పై సంతకం పెట్టనున్నారని వైట్‌హౌస్ పత్రికా కార్యదర్శి కైల్ మెకీనాని చెప్పారు. ఏ రకమైన ఆదేశాలు జారీ చేస్తారన్న అంశంసై స్పష్టత లేదు. గురువారంకల్లా ట్రంప్ సంతకం పెడతారని తెలుస్తోంది. మూసివేత అవకాశాలను పరిశీలించాల్సిందిగా సమాచార ప్రసార విభాగాలను ఆదేశించే అవకాశముందని నిపుణులు చెప్పారు. -
కళా ప్రేమికులకు గూగుల్ కొత్త యాప్!
న్యూఢిల్లీః ఇంటర్నెట్ దిగ్గజం.. గూగుల్ సెర్ష్ ఇంజిన్ మరో కొత్త యాప్ ను ప్రారంభించింది. భారత్ లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలనుంచి సేకరించిన ప్రసిద్ధ రచనలు, కళాఖండాల గురించి తెలుసుకునేందుకు గూగుల్ కల్చరల్ ఇనిస్టిట్యూట్ కొత్త యాప్ ను కళా ప్రేమికులకు అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకోసం గూగుల్ కొత్తగా 'ఆర్ట్ అండ్ కల్చర్' యాప్ ను సృష్టించింది. యాప్ తో పాటు వెబ్ సైట్ ను కూడా ప్రారంభించింది. ప్రపంచంలోని అనేక కళలకు సంబంధించిన సమాచారాన్ని అందులో పొందుపరచి కళాభిమానులకు దగ్గరయ్యేందుకు.. సెర్చ్ ఇంజన్ వినూత్న ప్రయత్నం చేసింది. విశ్వవ్యాప్తంగా 70 దేశాల్లోని మ్యూజియాల్లోని అనేక కళాఖండాలు, సుప్రసిద్ధ రచనలను గురించి తెలుసుకునేందుకు సహాయపడేట్లుగా ఈ కొత్త యాప్ ను గూగుల్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన అనువర్తనం ద్వారా.. ఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించిన బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయ చరిత్ర వంటి ఏదైనా కళలు, సంస్కృతికి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు శోధించి తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రముఖ చిత్రకారులు, ఆధునిక భారతీయ చిత్రకళ వంటి అనేక విషయాలను కళా ప్రేమికులు గూగుల్ 'ఆర్ట్ అండ్ కల్చర్' యాప్ ద్వారా తెలుసుకోవచ్చని గూగుల్ కల్చరల్ ఇనిస్టిట్యూట్ ప్రొడక్ట్ మేనేజర్ డంకన్ ఓస్బోర్న్ ఓ ప్రకటనలో తెలిపారు. భారతదేశం లోని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ ను కూడా గూగుల్ కార్డ్ బోర్డ్ అందుబాటులోకి తెస్తోంది. ఈ హెడ్ సెట్ ద్వారా 1978 లో స్థాపించిన అతిపెద్ద భారత కళా, సాంస్కృతిక సంగ్రహాలయంలో వినియోగదారులు వాస్తవిక కళా, సాంస్కృతిక పర్యటన చేసే అవకాశం ఉంటుందని చెప్తోంది. అలాగే ఈ కొత్త గూగుల్ ఆర్ట్ అండ్ కల్చర్ ను యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా వినియోగించుకోవచ్చని వెల్లడించింది. -
కొత్త మలేరియా వ్యాక్సిన్ కనిపెట్టారు..
మెల్బోర్న్ః మలేరియా నివారణకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కొత్త వ్యాక్సిన్ ను కనిపెట్టారు. ఎర్ర రక్తకణాలను హరించి మలేరియాకు కారణమయ్యే క్రిములను ఎదుర్కొనేందుకు నూతన యాంటీ మలేరియా చికిత్సను అభివృద్ధి చేశారు. వాల్తేర్ అండ్ ఎలీజా హాల్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ప్రొఫెసర్ అలాన్ కౌమాన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో, ఎర్ర రక్తకణాల్లోకి కీ ప్రొటీన్లు పంపించడం ద్వారా మలేరియాకు కారణమయ్యే క్రిములు లోపలికి చొచ్చుకొని వెళ్ళలేవని తెలుసుకున్నారు. దోమకాటుద్వారా వ్యాప్తి చెందే మలేరియా వ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 30 కోట్ల నుంచి 50 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. మలేరియా సోకినవారిలో ప్రతియేటా 4.5 లక్షలమంది దాకా చనిపోతున్నారు. అంతేకాక చిన్నపిల్లల్లో పెరుగుదలను కూడ దెబ్బతీసే ఈ వ్యాధి... గర్భిణీలకు మరింత ప్రమాదకరం. అటువంటి వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స చేస్తే అనేకమంది ప్రాణాలు కాపాడవచ్చని అధ్యయనకారులు చెప్తున్నారు. అందుకే ప్రభుత్వాలు మలేరియా నివారణకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్లను అందించడమే కాక, పల్లెల్లో, పట్టణాల్లో పరిశుభ్రతపై కూడ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా 5 ఏళ్ళలోపు వయసున్న పిల్లలపై మలేరియా ప్రభావం అధికంగా ఉంటోందని, దోమల్లో గ్రహణ శక్తి పెరగటంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న యాంటీ మలేరియల్ మందులు ప్రభావం తగ్గుతోందని, అందుకే కొత్త పరిశోధనలద్వారా మలేరియా క్రిములను ఎదుర్కొనే మందులను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అధ్యయనకారులు చెప్తున్నారు. కౌమాన్ బృందం తాజాగా ఆర్ హెచ్ 5, ఆర్ ఐపీఆర్, సీవై పీఆర్ ఏ మొదలైన మూడు ప్రొటీన్లను కలిపి, ఆరోగ్యంగా ఉన్న మానవ రక్త కణాల్లోకి పంపించడంద్వారా మలేరియాకు కారణమయ్యే క్రిములను ఎదుర్కోవచ్చునని కనుగొన్నారు. ఇలా చేయడంవల్ల మలేరియా క్రిములు ఎర్ర రక్తకణాలను హరించలేకపోయాయని తమ పరిశోధనలద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రొటీన్లతో టీకాలు వంటివి అభివృద్ధి చేసి, వ్యాక్సిన్లుగా ఇవ్వొచ్చని కౌమాన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మలేరియాకు కొత్త వ్యాక్సిన్లను అభివృద్ధి పరిచే పరిశోధనలకు ప్రాధాన్యత పెరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక వ్యాక్సిన్లకు మలేరియా క్రిములు అలవాటు పడిపోయాయని, ఈ పరిస్థితుత్లో కొత్త చికిత్సల అవసరం ఎంతైనా ఉందన్నారు. సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్ జర్నల్ లో కౌమాన్ బృందం.. తమ తాజా పరిశోధనలను నివేదించారు. -
10 కోట్ల డాలర్లకు చేరువలో జొకోవిచ్, ఫెడరర్
టెన్నిస్ టాప్ స్టార్స్ రోజర్ ఫెడరర్, నొవాన్ జొకోవిచ్ 10 కోట్ల డాలర్ల (రూ.660 కోట్లు) ప్రైజ్‌మనీ క్లబ్లో చేరనున్నారు. 34 ఏళ్ల ఫెడరర్ వివిధ టోర్నీల ద్వారా ఇప్పటివరకూ 97.3 మిలియన్ డాలర్లు (రూ.643 కోట్లు) ప్రైజ్‌మనీ అందుకోగా... 28 ఏళ్ల జొకోవిచ్ 94 మిలియన్ డాలర్లు (రూ.621 కోట్లు) సాధించాడు. ఇప్పటివరకూ టెన్నిస్ చరిత్రలో ఎవరూ 10 కోట్ల డాలర్ల ప్రైజ్‌మనీని సంపాదించలేదు. 2016లో ఫెడరర్, జొకోవిచ్‌లలో ఒకరు ముందుగా ఈ మార్కును చేరుకుని చరిత్ర సృష్టించబోతున్నారు.