![Donald Trump to sign executive order on social media amid Twitter - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/29/trum.jpg.webp?itok=Ywok4H4m)
వాషింగ్టన్: సామాజిక మాధ్యమం ట్విట్టర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోపం తగ్గలేదు. తన ట్వీట్లలో నిజానిజాలు నిర్ధారించుకోవాలని ట్విట్టర్.. ఆ ట్వీట్లకు ట్యాగ్ తగలించడంతో ట్రంప్‌కు కోపంరావడం తెల్సిందే. ‘వాటిని (ట్విట్టర్) నియంత్రిస్తాం. లేదంటే మూసేస్తాం’ అని తాజాగా ట్వీట్‌చేశారు. ‘వాళ్లు మా గొంతు నొక్కేస్తున్నారు. భారీ చర్య కోసం ఎదురు చూడండి’ అని మరో ట్వీట్‌చేశారు. కాగా, సామాజిక మాధ్యమాలకు సంబంధించి అధ్యక్షుడు ఒక ఎగ్జిక్యుటివ్ ఆర్డర్‌పై సంతకం పెట్టనున్నారని వైట్‌హౌస్ పత్రికా కార్యదర్శి కైల్ మెకీనాని చెప్పారు. ఏ రకమైన ఆదేశాలు జారీ చేస్తారన్న అంశంసై స్పష్టత లేదు. గురువారంకల్లా ట్రంప్ సంతకం పెడతారని తెలుస్తోంది. మూసివేత అవకాశాలను పరిశీలించాల్సిందిగా సమాచార ప్రసార విభాగాలను ఆదేశించే అవకాశముందని నిపుణులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment