వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. తన చేసిన ట్వీట్లు రెండింటి కింద ‘నిజానిజాలు నిర్ధారించుకోవాల్సి ఉంది’ అనే ట్యాగ్‌ను ట్విట్టర్ తగిలించడం ట్రంప్‌కు కోపం తెప్పించింది. అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్లతో అవకతవకలు జరిగే చాన్సుందని ట్రంప్ మంగళవారం ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు దిగువభాగంలో నీలిరంగు ఆశ్చర్యార్థకం చిహ్నాన్ని ట్విట్టర్ తగిలించింది. అంటే అందులోని నిజానిజాలను నిర్ధారించుకోవాల్సి ఉందని అర్థం. దీంతో ట్రంప్‌కు కోపమొచ్చింది. ‘ట్విట్టర్ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోంది. మెయిల్‌ఇన్ బ్యాలెట్లపై నా ప్రకటన సరికాదని వాళ్లు చెబుతున్నారు. ఫేక్ న్యూస్ ప్రసారం చేసే సీఎన్‌ఎన్, అమెజాన్, వాషింగ్టన్ పోస్ట్‌ల ఆధారంగా నిజానిజాలను నిర్ధారించుకోమంటున్నారు’ అని ట్విట్టర్‌పై ట్రంప్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment