Resentment
-
ట్విట్టర్‌పై ట్రంప్ గుస్సా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. తన చేసిన ట్వీట్లు రెండింటి కింద ‘నిజానిజాలు నిర్ధారించుకోవాల్సి ఉంది’ అనే ట్యాగ్‌ను ట్విట్టర్ తగిలించడం ట్రంప్‌కు కోపం తెప్పించింది. అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్లతో అవకతవకలు జరిగే చాన్సుందని ట్రంప్ మంగళవారం ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు దిగువభాగంలో నీలిరంగు ఆశ్చర్యార్థకం చిహ్నాన్ని ట్విట్టర్ తగిలించింది. అంటే అందులోని నిజానిజాలను నిర్ధారించుకోవాల్సి ఉందని అర్థం. దీంతో ట్రంప్‌కు కోపమొచ్చింది. ‘ట్విట్టర్ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోంది. మెయిల్ఇన్ బ్యాలెట్లపై నా ప్రకటన సరికాదని వాళ్లు చెబుతున్నారు. ఫేక్ న్యూస్ ప్రసారం చేసే సీఎన్ఎన్, అమెజాన్, వాషింగ్టన్ పోస్ట్‌ల ఆధారంగా నిజానిజాలను నిర్ధారించుకోమంటున్నారు’ అని ట్విట్టర్‌పై ట్రంప్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. -
ప్రశ్నించే హక్కును ప్రభుత్వం హరిస్తోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే హక్కును హరిస్తోందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద మాట్లాడుతూ... సభలో ప్రజా సమస్యలపై, శాసనసభ్యుల సస్పెన్షన్‌పై కనీసం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యుల హక్కుల్ని హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాల్లో రూ.5,500 వేతనం ఇస్తుంటే... ఇక్కడ మాత్రం రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నారన్నారు. -
మద్యంపై ‘అనంత’ యుద్ధం
జనావాసాల్లో దుకాణాల ఏర్పాటుపై పెల్లుబికిన ఆగ్రహం జిల్లా వ్యాప్తంగా కొనసాగిన ధర్నాలు, రాస్తారోకోలు అనంతపురం : గుడి, బడి తేడా లేకుండా జనావాసాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుపై అనంత ప్రజలు భగ్గుమన్నారు. సోమవారం అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థులు ఆందోళనలకు దిగారు. నల్లమాడలో కేంద్రంలోని ఆర్డీటీ ఏరియా కార్యాలయం ఎదురుగా మద్యం ఏర్పాటు చేయడంపై ఆర్డీటీ మహిళా సంఘాల సభ్యులు అభ్యంతరం తెలిపారు. సోమవారం నల్లమాడ, ఓడీ చెరువు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆర్డీటీ సంఘ సభ్యులు ర్యాలీ, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఓడీచెరువు మండల కేంద్రంలోని షాదీమహల్, టీటీసీ కళాశాలకు ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం షాపును వెంటనే ఎత్తివేయాలంటూ కళాశాల విద్యార్థులు, సీపీఐ నాయకులు సోమవారం కదిరి- హిందూపురం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాయదుర్గంలోని దాసప్ప రోడ్డులో మద్యం షాపు ఏర్పాటును నిరసిస్తూ కార్మికులు, చిరు వ్యాపారులు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఇక కదిరి మున్సిపల్ పరిధిలోని ఎర్రగుంటపల్లికి చెందిన మహిళలు సోమవారం తమ గ్రామంలో మద్యం దుకాణం వద్దంటూ జాతీయరహదారిపై ఆందోళన నిర్వహించారు. డిగ్రీ కళాశాలకు సమీపంలో జాతీయరహదారిపై అడ్డంగా బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. జనావాసాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల శాంతిభద్రల సమస్య ఉత్పన్నమవుతుందని, అందువల్ల వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మొత్తం మద్యం దుకాణాలు : 245 జనావాసాల్లోని మద్యం దుకాణాలు : 178 బెల్టు షాపులు : 2,780 -
భక్తులిచ్చే దక్షిణను కూడా లంచమంటారా?
చంద్రబాబుపై ఏపీ అర్చక సమాఖ్య ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: భక్తులు పూజారులకు సమర్పించుకునే దక్షిణను కూడా సీఎం చంద్రబాబు లంచంగా అభివర్ణించడంపై ఏపీ అర్చక సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీకాకుళంలో జరిగిన ఏపీఎన్జీవోల సభలో ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆత్రేయబాబు, కార్యదర్శి పెద్దింటి రాంబాబు, ప్రతినిధులు పద్మనాభశర్మ, సుధీర్ ఫణిగోపాల్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పూజారులకు, అర్చకులకు దక్షిణ సమర్పించడం సంప్రదాయంలో భాగమని.. దానిని లంచంగా, అవినీతిగా చిత్రీకరించడం తగదన్నారు. అధికారంలోకి వస్తే అర్చకులకు అనేక మేళ్లు చేస్తామని చెప్పిన చంద్రబాబు, నేడు ఇలా మాట్లాడడం శోచనీయమన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టి వల్లే ఈరోజు అర్చకులు ఆలయాల్లో సేవలు చేయగలుతున్నారని వివరించారు. -
అధికారిపై మండిపడ్డ రాములమ్మ
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: రాములమ్మకు కోపం వచ్చింది. అధికారుల తీరుపై ఆగ్రహంతో ఊగిపోయింది. ఎన్నికల అధికారివా? టీఆర్ఎస్ నాయకుడు హరీష్‌రావు మనిషివా? అంటూ మండిపడ్డారు. దీంతో పది నిమిషాలపాటు పోలింగ్ నిలిచిపోయింది. పోలీసులు జోక్యం చేసుకుఓవడంతో సమస్య సద్దుమణిగింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ మండల పరిధిలోని మద్దులవాయి పోలింగ్ కేంద్రంలో బుధవారం ఎన్నికలు కొనసాగుతుండగా గ్రామానికి చెందిన ఎల్లవొయిన గుండమ్మ అనే వృద్దురాలు ఓటు వేయడానికి వచ్చింది. ఆమెకు కళ్లు సరిగా కనపడకపోవడంతో చేతిగుర్తుకు ఓటు వేయాలని గుర్తు ఎక్కడ ఉందో చూపాలని గుండమ్మ పీఓ మదన్మోహన్రావును కోరింది. అయితే ఈవీఎంపై భాగంలో ఉన్న కారు గుర్తుకు ఓటు వేయాలని పీఓ చెప్పి ఓటు వేయించారు. తాను చేతిగుర్తుకి ఓటు వేయాలనుకున్నా మీరు ఆలా ఎందుకు వేయించారని అధికారితో వాపోయింది. అయితే ఈ విషయాన్ని పోలింగ్ కేంద్రం బయట ఉన్న కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఆమె తెలిపింది. దీంతో కార్యకర్తలంతా మూకుమ్మడిగా వెళ్లి పీఓతో వాగ్వాదానికి దిగారు. అక్కడ ఉన్న పోలీసులు నాయకులను, కార్యకర్తలను సముదాయించడంతో వారు వెళ్లిపోయారు. అనంతరం విషయం తెలుసుకున్న మెదక్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి విజయశాంతి తన అనుచరులతో పోలింగ్ కేంద్రంలోకి వచ్చి హరీష్రావుు మనిషివి నీవేనా అంటూ... కారు గుర్తుకు ఓటు ఎలా వేయామంటావని అధికారిని నిలదీశారు. పీఓ మదన్మోహన్రావు టేబుల్‌పై ఉన్న ఓటర్ల జాబితాను తీసి కిందపడేశారు. దీంతో మదన్మోహన్రావు మాట్లాడుతూ తాను ఎవరికి ఓటు వేయమని చెప్పలేదని, హరీష్‌రావుకు తనకు ఎలాంటి సంబం ధం లేదని బదులిచ్చారు. అయినా విజయశాంతి ఆగ్రహంతో ఊగిపోతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి నీ అంతు చూస్తానంటూ హెచ్చరించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై వేణుకుమార్ తన సిబ్బందితో హూటహూటిన పోలింగ్ కేంద్రానికి వచ్చి విజయశాంతిని అక్కడి నుండి పంపించారు. దీంతో సమస్య సద్దుమణిగింది.