
సాక్షి, విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణంపై నవంబరు ఒకటి నుంచి ఏడవ తేది వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ విజయ్ కుమార్ అన్నారు. ఫిర్యాదులు స్వీకరించడానికి విశాఖ వీఎంఆర్డీఏ ఆడిటోరియంలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నేరుగా వచ్చి ఫిర్యాదు చేయలేని వారు ఆన్లైన్ మాధ్యమం ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎంతటి వారైనా అవసరాన్ని బట్టి విచారణ చేపడతామని అన్నారు. గత సిట్ నివేదిక తమకు అందిందని, అందులోని అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. విశాఖ భూ కుంభకోణంలో భూముల ట్యాంపరింగ్‌పై కూడా దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా విజయ్ కుమార్ తెలిపారు. మూడు నెలలలో విచారణ పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించిందని, గడువు సరిపోకపోతే పెంచాలని ప్రభుత్వాన్ని కోరతామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment