విశాఖ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేయండిలా | Dates For Complaint On Visakha Land Scam | Sakshi
Sakshi News home page

విశాఖ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేయండిలా

Published Sat, Oct 26 2019 8:47 PM | Last Updated on Sat, Oct 26 2019 8:59 PM

Dates For Complaint On Visakha Land Scam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణంపై నవంబరు ఒకటి నుంచి ఏడవ తేది వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పబ్లిక్ నోటీసు విడుదల చేసింది. అదేవిధంగా నవంబరు 8న ప్రజా ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. నేరుగా వచ్చి ఫిర్యాదు చేయలేని వారు.. ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎంతటి వారైనా అవసరాన్ని బట్టి విచారణ చేపడతామని ఇదివరకే సిట్ చీఫ్ విజయ్‌ కుమార్ చెప్పారు. సిరిపురం చిల్డ్రెన్ ఎరీనాలొ ఉదయం 10 గంటల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించి విచారణ చేపడతామన్నారు. విచారణ సందర్భంగా సిట్ బృందానికి ఏలేరు గెస్ట్‌ హౌజ్‌లో బస ఏర్పాట్లు చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement