భారీగా బోగస్ కార్డులు!
Published Mon, Dec 9 2013 3:46 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్:జిల్లాలో బోగస్‌కార్డుల వ్యవహారం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బోగస్ చిరునామాలు, పేర్లతో పలువురు రేషన్ డీలర్లు దరఖాస్తులు చేయడంతో ఈ కార్డులు పుట్టుకొచ్చాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. రచ్చబండ కార్యక్రమంలో వేలాది కార్డులను మంజూరు చేసినప్పటికీ వాటిని తీసుకెళ్లడానికి చాలామంది ముందుకు రాకపోవడం పట్ల సందేహా లు వెల్లువెత్తుతున్నాయి. రచ్చబండ- 2లో దరఖాస్తు చేసిన వారిలో విజయనగరం పట్టణంలో 4,826 మందికి రేషన్ కార్డులు మంజూరయ్యాయి. 3,367 మంది కార్డులు అందుకున్నారు.
ఇటీవల కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పా టు చేసి పంపిణీ చేయగా 129మంది మాత్రమే వచ్చి కార్డులను తీసుకున్నారు. ఒక్క విజయనగరం పట్టణంలోనే 1,336 మంది కార్డులు తీసు కోవడానికి ముందుకు రాలేదు. అయితే వీటిలో కొన్ని బోగస్ కార్డులు కాగా, మరికొన్ని కార్డులు వచ్చినట్టు కొందరికి తెలియకపోవడం వల్ల తీసుకోనివి ఉన్నాయి. కొంతమంది లబ్ధిదారులు పౌర సరఫరాల కార్యాలయానికి అడిగినప్పటికీ ప్రస్తుతం ఇవ్వలేమని ఉన్నతాధికారులను సంప్రదించి చెబుతామని సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. పంపిణీ చేయగా మిగిలిన వాటిలో బోగస్ కార్డులు అధికంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇదే పరిస్థితి దాదాపు జిల్లావ్యాప్తంగా ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బోగస్ కార్డుల జారీలో ఎవరి ప్రమేయం ఉందన్న అనుమానాలు అధికారులను వెంటాడుతున్నాయి. పంపిణీ కాకుండా మిగిలిన కార్డులను తక్షణమే స్వాధీనం చేసుకుని వాటి పై తక్షణమే దర్యాప్తు జరపాలని జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడానికి కొంతమంది డీలర్లే ఈ పని చేశారా? అన్న అనుమానా లు లేకపోలేదు. ఇది ఇలా ఉండగా రచ్చబండ-3లో 8వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కూడా బోగస్ దరఖాస్తు లు అధికంగా ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
కొన్ని మండలాల్లో రచ్చబండ కార్డుల పంపిణీ పూర్తికాలే దు. రచ్చబండలో తాత్కాలిక కూపన్లు అందజేసిన ప్రతి ఒక్కరికీ డిసెంబర్ కోటా ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మిగిలిన కార్డులు తక్షణమే అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్డులు వచ్చినట్లు గ్రామాల్లో డిపోలకు సమాచా రం అందినప్పటికీ లబ్ధిదారులకు మాత్రం కార్డులు అందజేయ డం లేదు. దీంతో వారు అధికారుల చుట్టూ ప్రద క్షిణలు చేస్తున్నా రు. గ్రామస్థాయిలో కొంతమంది అధికార పార్టీనేతల ఒత్తిడితో కార్డులు పంపిణీ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఉన్నవారికే రేషన్ కార్డులు
రచ్చబండ-2లో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి కి సంబంధించి జిల్లాకు 57,861 కార్డులు మంజూరయ్యాయి. వీటిని రచ్చబండ-3లో అధికారులు పంపిణీ చేయడానికి చర్య లు తీసుకున్నారు. అయితే రేషన్ బియ్యాన్ని బుక్కేందుకు కొం తమంది ఉన్నవారి పేరిటే రేషన్ కార్డులకు దరఖాస్తులు చేశారు. మరికొంత మందికి సంబంధించి గ్రామాలు, పట్టణాల్లో నివా సం లేనివారికి సైతం కార్డులు పుట్టించేశారు. దీంతో అధికారు లు ప్రాథమికంగానే అవకతవకలను గుర్తించి 5,200 కార్డుల పంపిణీని నిలిపివేశారు. మిగిలిన కార్డుల్లో కూడా మరిన్ని బోగస్ కార్డులు తేలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
లబ్ధిదారులు రాకపోతే వెనక్కు పంపుతాం
కార్డుల్లో ఉన్నవారు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. కార్డుల పంపిణీపై డీలర్లకు సమాచారం ఇచ్చాం. తగిన ఆధారాలతో వచ్చిన వారికి మాత్రమే రేషన్ కార్డులు అందజేస్తాం. పంపిణీ కాగా మిగిలినవి వెనక్కి పంపిస్తాం.
-ఆర్.శ్రీలత (ఇన్‌చార్జ్ డీఎస్వో)
Advertisement
Advertisement