
సాక్షి, ప్రకాశం: రాపర్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. రిమ్స్‌లో చికిత్స పొందుతూ భాగ్యవతి(35) అనే మహిళ మృతి చెందారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మాచవరం గ్రామం సమీపంలో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. కుమ్మరిడొంక వద్ద మిర్చి కూలీలతో వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే 9 మంది దుర్మరణం పాలవ్వగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు.
రాపర్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని పొలాల్లో మిర్చి కోతలకు వెళ్లిన కూలీలు ట్రాక్టర్‌లో సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాధితులను శుక్రవారం మంత్రులు బాలినేని శ్రీనివాస్, సురేష్ పరామర్శించారు. ఇప్పటికే తక్షణం సాయంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
( చదవండి : ట్రాక్టర్ ప్రమాదం.. కరెంట్ షాక్ కూలీల దుర్మరణం)
Comments
Please login to add a commentAdd a comment