సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ లక్షణాలున్న వారికి, పాజిటివ్ బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోంది. రాష్ట్రంలో మార్చి 1 నాటికి 2 వైరాలజీ ల్యాబొరేటరీలు మాత్రమే ఉండగా, ఇప్పుడా సంఖ్యను 7కు పెంచారు. మన రాష్ట్రంలో 400 వెంటిలేటర్లు ఉండగా, కరోనా విపత్తు వచ్చాక మరో 100 వెంటిలేటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వెంటిలేటర్ల సంఖ్యను పెంచడానికి ఇప్పుడు మరో ముందడుగు వేసింది. అతి తక్కువ ధరకే వెంటిలేటర్‌లను కొనుగోలు చేసి వైద్యమందించేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీ ఎయిమ్స్ డిజైన్ చేసిన వెంటిలేటర్‌లను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయోగాత్మకంగా వైద్యులు పరిశీలిస్తున్నారు.
► ఎయిమ్స్ రూపొందించిన వెంటిలేటర్ ధర రూ. 1.90 లక్షలు
► సాధారణంగా వెంటిలేటర్ ధర రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకూ ఉంటుంది
► తాము రూపొందించిన వెంటిలేటర్ ఉత్పత్తి బాధ్యతలు ఓ కంపెనీకి ఎయిమ్స్ అప్పగించింది
► విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పేషెంటుకు ఈ వెంటిలేటర్‌ను అమర్చి పరిశీలించారు
► పనితీరు మెరుగ్గా ఉందని వైద్యులు భావిస్తే కనీసం 200 వెంటిలేటర్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వ ప్రణాళిక. దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రూ.1.90 లక్షలకే వెంటిలేటర్
Published Sun, Apr 5 2020 3:55 AM | Last Updated on Sun, Apr 5 2020 3:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment