లింగంపేట,న్యూస్‌లైన్ : మండల కేంద్రంలో నకిలీనోట్లను గుర్తించే, నోట్ల లెక్కింపు యంత్రాల విక్రయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మండల కేంద్రంలో తరచూ రూ ఐదువందల నకిలీనోట్లు చలామణీ కావడం, పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కే సులు పెట్టి జైలుకు పంపడం రివాజుగా మారింది. ఈ నేపథ్యంలో పలువురు వ్యాపారులు, బ్యాంకర్లు, ఫైనాన్స్ వ్యాపారులు, మద్యంషాపు, పెట్రోల్‌బంక్‌ల నిర్వాహకులు నకిలీ నోట్లను గుర్తించే యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. పదమూడేళ్లుగా లింగంపేటలో రూ ఐదువం దల నకిలీనోట్ల చలామణి కొనసాగుతోం ది. గత నెలలో కూడా మండల కేంద్రంలో రూ ఐదువందల నకిలీ నోట్లను చలామణి చేస్తూ ఆకుల సత్యం అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు.
అతడి నుంచి పోలీ సులు రూ లక్ష విలువైన నకిలీ ఐదువందల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ నోటంటేనే మండల ప్రజలు జంకుతున్నారు. ఈ క్రమంలో పలువురు వ్యాపారులు, ఫైనాన్స్ యజమానులు, కిరాణ వర్తకులు, ఎరువులు, విత్తనాల దుకాణాల యజమానులు నకిలీనోట్లను గుర్తించే మిషన్లను కొంటున్నారు. మండల కేంద్రంలో ఇప్పటి వరకు సుమారు 50 మిషన్లను కొనుగోలు చేశారు. ఒక్కో యం త్రానికి రూ 8 వేలనుంచి రూ 10 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. నకిలీ నోట్ల బారిన పడకూడదంటే మిషిన్ కొనాల్సిందే అంటున్నారు.