సాక్షి, విశాఖపట్నం, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందన్నారు. దీని ప్రభావం ఏ ప్రాంతాలపై ఉంటుందన్నది చెప్పలేమన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగావుందని, రాగల 24 గంటల్లో పెద్దగా మార్పులుండవని వెల్లడించారు.