తిరుమల తొక్కిసలాటలో గాయపడిన బాలిక
తిరుమల: రేపు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తుల తోపులాట, తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. భక్తులను అదుపు చేయడం సిబ్బందివల్ల కావడంలేదు.
భక్తుల రద్దీ దృష్టిలోపెట్టుకొని టీటీడీ వారు తగిన ఏర్పాట్లు చేయలేదు. దాంతో భక్తులు నానా అవస్తలు పడుతున్నారు. ఎవరు ఇష్టమొచ్చినట్లు వారు లైన్లలో చొరబడుతున్నారు. ముందు నుంచి లైన్లో ఉన్నవారిని పట్టించుకునేవారులేరు. తొక్కిసలాటలో పలువురు గాయపడటంతో టీటీడీ వారు లైన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జేఈఓ క్యాంపు కార్యాలయం ఎదుట భక్తులు భారీగా గుమిగూడారు.