Devotees injured
-
తిరుమల కొండపై రోడ్డు ప్రమాదం
తిరుమల: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళుతున్న ఓ బొలెరో వాహనం అదుపు తప్పి రెండో ఘాట్‌రోడ్డులోని 10 వ మలుపు వద్ద వద్ద పిట్టగోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో 10మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. బాధితులు నెల్లూరు జిల్లావాసులుగా గుర్తించారు. -
కారు బోల్తా : ఎనిమిది మందికి గాయాలు
అనంతపురం : అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పేటకుంట సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అయ్యప్ప స్వామి భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ... క్షతగాత్రులను పెనుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. భక్తులు కారులో హైదరాబాద్ నుంచి శబరిమలై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులది రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. -
మహా పోటీ
-
ఖైరతాబాద్‌లో తొక్కిసలాట : భక్తులకు గాయాలు
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి లడ్డూ ప్రసాదం పంపిణీ సందర్భంగా శుక్రవారం భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. 11 రోజుల పాటు ఖైరతాబాద్ మహాగణపతి చేతిలో విశేష పూజలందుకున్న మహాలడ్డూ ప్రసాదాన్ని ఈ నెల 30న పంపిణీ చేయాల్సి ఉంది. కానీ పోలీస్ బందోబస్తుకు వీలు కాకపోవడంతో ఆక్టోబర్ 2వ తేదీ పంపిణీ చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ప్రసాదం కోసం భక్తులు శుక్రవారం అధిక సంఖ్యలో ఖైరతాబాద్ తరలివచ్చారు. మింట్ కాంపౌండ్‌వైపు ఉన్న మహిళా క్యూ లైన్, రైల్వేగేటు వైపు ఉన్న పురుషుల క్యూలైన్ బారీగా జనంతో నిండిపోయారు. ఉదయం 7 గంటలకు లడ్డూ దాత, సురుచీఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు పూజలు చేశారు. ఆ తరువాత ఆనవాయితీ ప్రకారం మల్లిబాబుకు లడ్డూలో 50 శాతం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా స్థానిక నాయకులు అడ్డుకున్నారు. 50 శాతం ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పారు. దీంతో మల్లిబాబుకు స్థానిక నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని మల్లిబాబుకు 15 శాతం లడ్డూను ఇచ్చి పంపించేశారు. అనంతరం భక్తులకు ప్రసాద పంపిణీ ప్రారంభమైంది. ప్రసాదం కోసం ఒక్కసారిగా అందరూ ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. దీంతో స్థానిక బీజేపీ నాయకుడికి తలకు తీవ్రగాయమైంది. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డితో పాటు పలువురు పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రసాద పంపిణీని నిలిపివేశారు. ప్రసాద పంపిణీ పూర్తయిందని మెగాఫోన్‌లో ప్రకటించారు. భద్రత నడుమ మిగిలిన లడ్డూను వాహనంలో తరలించారు. -
తిరుమలలో తొక్కిసలాట
-
తిరుమలలో తొక్కిసలాట:భక్తులకు గాయాలు
తిరుమల: రేపు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తుల తోపులాట, తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. భక్తులను అదుపు చేయడం సిబ్బందివల్ల కావడంలేదు. భక్తుల రద్దీ దృష్టిలోపెట్టుకొని టీటీడీ వారు తగిన ఏర్పాట్లు చేయలేదు. దాంతో భక్తులు నానా అవస్తలు పడుతున్నారు. ఎవరు ఇష్టమొచ్చినట్లు వారు లైన్లలో చొరబడుతున్నారు. ముందు నుంచి లైన్లో ఉన్నవారిని పట్టించుకునేవారులేరు. తొక్కిసలాటలో పలువురు గాయపడటంతో టీటీడీ వారు లైన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జేఈఓ క్యాంపు కార్యాలయం ఎదుట భక్తులు భారీగా గుమిగూడారు.