సాక్షి, విజయవాడ: నిబంధనలు ఉల్లంఘించే మద్యం కొనుగోలుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యం కొనుగోలు దారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. నిర్ణీత సమయంలోనే షాపుల వద్ద క్రమపద్దతిలో విక్రయాలు జరపాలని, మద్యం కొనుగోలుకు వచ్చే వారు ఖచ్చితంగా దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని సూచించారు. అంతేగాక ముఖానికి మాస్క్ కూడా ఖచ్చితంగా ధరించాలన్నారు. మద్యం దుకాణల వద్ద గుంపులు గుంపులుగా గుమికుడరాదన్నారు. ఇక నిబంధనలు అతిక్రమించిన షాపులను తక్షణమే మూసివేస్తామని ఆయన హెచ్చరించారు. మద్యం సేవించి గొడవలకు దిగడం, ప్రశాంతమైన వాతావరణానికి భంగం కల్పించటం వంటివి చేస్తే జాతీయ విపత్తు చట్టం కింద కఠిన చర్యల తీసుకుంటామన్నారు. వివాదాలు సృష్టించే వారిపై అనునిత్యం ప్రత్యేక నిఘా ఉంచుతామని డీజీపీ పేర్కొన్నారు.
చదవండి: సమన్వయంతో పోరాడుతున్నాం
Comments
Please login to add a commentAdd a comment