wine shopes
-
వైన్ షాప్ వద్దంటూ పబ్లిక్ నిరసన
-
ఫుల్లు ‘ఫుల్లు’గా హైదరాబాద్‌లో పర్మిట్ రూమ్‌లు
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం నగరంలోని ఓ వైన్‌షాపు పర్మిట్‌రూమ్ వద్ద మద్యం తాగేందుకు వచ్చిన పాతబస్తీకి చెందిన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. పర్మిట్‌రూమ్‌లో స్నాక్స్ విక్రయించే వ్యాపారులే అతన్ని కొట్టి చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ పోలీసులు అతడు గుండెపోటుతో చనిపోయినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వివాదం సంగతి ఎలా ఉన్నా మద్యం దుకాణాలు నిర్వహించే పర్మిట్ రూమ్‌లు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారుతున్నాయనేందుకు ఈ సంఘటన నిదర్శనం. లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా సడలించిన అనంతరం గ్రేటర్లో బార్లతో పాటే పర్మిట్ రూమ్‌లు తిరిగి తెరుచుకున్నాయి. ప్రస్తుతం మందుబాబులతో కిక్కిరిసిపోతున్నాయి. ఏ ఒక్క పర్మిట్ రూమ్‌లోనూ కనీస నిబంధనలు పాటించడం లేదు. నిబంధనలు ఎక్కడ? ⇔ ఎక్సైజ్‌శాఖ నిబంధనల మేరకు పర్మిట్ రూమ్‌లో మద్యంతాగేందుకు మాత్రమే ఏర్పాట్లు ఉండాలి. ⇔ కూర్చొనేందుకు కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు ఉండాలి. ఇంతవరకు మాత్రమే అనుమతినిచ్చారు. ⇔ అలాగే పర్మిట్ రూమ్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. నిరంతరం నిఘా కొనసాగించాలి. ప్రతి వ్యక్తిపైన పర్యవేక్షణ ఉండాలి. ⇔ కానీ అన్ని పర్మిట్రూమ్లలోనూ అక్రమ వ్యాపారాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మంచినీళ్లు, సోడా, వెజ్, నాన్‌వెజ్ స్నాక్స్, వివిధ రకాల చిరుతిళ్ల అమ్మకాలతో ఒక్కో పర్మిట్ రూమ్‌లో కనీసం 15 రకాల వ్యాపారాలకు కేంద్రంగా మారాయి. ⇔ వైన్ షాపు నిర్వాహకులే ఈ అక్రమ వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నారు. మద్యం అమ్మకాలతో పాటు, చిరుతిళ్ల అమ్మకాలు రూ.లక్షల్లో సాగుతున్నాయి. ఏదీ భౌతిక దూరం... ⇔ గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 480 వైన్ షాఫులు ఉన్నాయి. 280 వరకు బార్లు ఉన్నాయి. కొత్తగా మరో 55 బార్లకు ఇటీవల ప్రభుత్వం అనుమతినిచ్చింది. ⇔ ప్రతి రోజు సుమారు రూ.10 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుండగా, వీకెండ్స్‌లో రూ.20 కోట్ల వరకు విక్రయాలు ఉంటాయి. ⇔ లాక్డౌన్ నిబంధనల సడలింపుతో మద్యం అమ్మకాలు కట్టలు తెంచుకున్నాయి. పర్మిట్ రూమ్‌లు కిటకిటలాడుతున్నాయి. ⇔ భౌతిక దూరం ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. మాస్క్‌లు తొలగిపోయాయి. ⇔ ఆహార పదార్థాలు, చిరుతిళ్ల అమ్మకాల్లో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. ⇔ నిత్యం మందుబాబులతో కిక్కిరిసి ఉండే పర్మిట్ రూమ్‌లు రెండో దశ కోవిడ్ వ్యాప్తికి దోహదం చేసే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడుగడుగునా నిర్లక్ష్యం... ⇔ ఎక్సైజ్ అధికారులు మద్యం విక్రయాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పర్మిట్ రూమ్‌లను ఏ మాత్రం నియంత్రించడం లేదు. వంద చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఉండవలసిన గదులు కొన్ని చోట్ల విశాలమైన బార్లను తలపిస్తున్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లేదు. నేరాలకు, నేరగాళ్లకు అడ్డాలుగా మారుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు. చదవండి: రూ.48 లక్షల ‘చమురు’ వదిలింది! కేటీఆర్ సీఎం కానున్నారు.. ప్రకటనల కోసం డబ్బులివ్వండి -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డీజీపీ
సాక్షి, విజయవాడ: నిబంధనలు ఉల్లంఘించే మద్యం కొనుగోలుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యం కొనుగోలు దారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. నిర్ణీత సమయంలోనే షాపుల వద్ద క్రమపద్దతిలో విక్రయాలు జరపాలని, మద్యం కొనుగోలుకు వచ్చే వారు ఖచ్చితంగా దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని సూచించారు. అంతేగాక ముఖానికి మాస్క్ కూడా ఖచ్చితంగా ధరించాలన్నారు. మద్యం దుకాణల వద్ద గుంపులు గుంపులుగా గుమికుడరాదన్నారు. ఇక నిబంధనలు అతిక్రమించిన షాపులను తక్షణమే మూసివేస్తామని ఆయన హెచ్చరించారు. మద్యం సేవించి గొడవలకు దిగడం, ప్రశాంతమైన వాతావరణానికి భంగం కల్పించటం వంటివి చేస్తే జాతీయ విపత్తు చట్టం కింద కఠిన చర్యల తీసుకుంటామన్నారు. వివాదాలు సృష్టించే వారిపై అనునిత్యం ప్రత్యేక నిఘా ఉంచుతామని డీజీపీ పేర్కొన్నారు. చదవండి: సమన్వయంతో పోరాడుతున్నాం -
లక్కెవరిదో?
మద్యం పాలసీ విడుదల నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ లాటరీ ద్వారానే మద్యం దుకాణాల కేటాయింపు 28న లాటరీ నెల్లూరు(క్రైమ్): ఎక్సైజ్ సంవత్సరానికి (2014-15) సంబంధించి కొత్త మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి వెల్లడించింది. కొత్తసీసాలో పాత సారా అన్నట్టు నూతన మద్యం పాలసీ ఉంది. కొద్దిపాటి మార్పులు మినహాయిస్తే మిగతా పాలసీ అంతా పాతదే. బెల్ట్‌షాపులు అరికట్టేందుకు ఎలాంటి ప్రణాళిక విడుదల చేయకపోవడంతో ఇకపై ఊరూరా ఆరు క్వార్టర్లు మూడు బీర్లు అన్న చందంగా మద్యం పొంగిపొర్లే అవకాశం ఉంది. కాకపోతే ప్రతి బాటిల్‌కు తప్పనిసరి కంప్యూటర్ బిల్లు ఇవ్వాలన్న నిబంధన అక్రమ వ్యాపారులకు మింగుడుపడటం లేదు. మద్యం బాటిల్‌పై హోలోగ్రామ్‌తో పాటు 2డీ బార్కోడ్ ముద్రణ లిక్కర్మాఫియా పాలిట పిడుగుపాటుగా మారింది. లెసైన్సీలకు ఏడాది కాలపరిమితి విధించింది. జూలై నుంచి పాలసీ అమలువుతున్న నేపథ్యంలో మద్యం వ్యాపారుల్లో కదలిక మొదలైంది. జిల్లాలో 348 మద్యం దుకాణాల కోసం సిండికేట్ వ్యాపారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 348 మద్యం దుకాణాలున్నాయి. గత ఎక్సైజ్ సంవత్సరంలో 318 దుకాణాలకు మాత్రమే దరఖాస్తులు అందాయి. మిగిలినవి ఖాళీగా ఉన్నాయి. జిల్లాకు ఐదు శ్లాబులు వర్తింపు కొత్త మద్యం పాలసీ ప్రకారం ఫిక్స్డ్ లెసైన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. 2013-14 ఎక్సైజ్ సంవత్సరంతో పోలిస్తే లెసైన్స్ ఫీజుల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. గత ఏడాది 10 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.34 లక్షలు లెసైన్స్ ఫీజు ఉండగా, ఈ ఏడాది రూ.36 లక్షలు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. పది వేలు లోపు జనాభాకు రూ.32.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేల జనాభా వరకు రూ. 36లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల జనాభా వరకు రూ.45 లక్షలు, 3 లక్షల నుంచి 5 లక్షల జనాభా వరకు రూ.50 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా వరకు రూ.64 లక్షలుగా లెసైన్స్ఫీజును నిర్ణయించారు. బెల్టుషాపుల మూసివేత ఒట్టిదేనా? బెల్టుషాపుల మూసివేతకు పకడ్బందీ ప్రణాళిక ప్రకటించకపోవడంతో పల్లెల్లో మద్యం పొంగిపొర్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత విధానం ప్రకారమే వైన్‌షాపులను లాటరీ ద్వారా కేటాయించాలని నిర్ణయించడంతో మహిళలు, మద్యపాన నిషేధ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి రూ.132.32 కోట్లు ఆదాయం జిల్లా వ్యాప్తంగా 348 మద్యం దుకాణాలను జనాభా ప్రాతిపదికన నిర్ణయించారు. వీటికి లెసైన్స్‌ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి సుమారు 132.32 కోట్లు ఆదాయం ఏటా సమకూరనుంది. వేలంలో పాల్గొనడానికి ప్రతి దరఖాస్తుదారుడు రూ.25 వేలు చెల్లించాల్సిందే. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.87 లక్షలు ఆదాయం రానుంది. దరఖాస్తుదారులు పార్టిసిపేషన్ ఫీజుతో పాటు 10శాతం దరావత్తు చెల్లించాలి. వేలం తర్వాత ఎవరికీ పార్టిసిపేషన్ ఫీజు మొత్తాన్ని వెనక్కి ఇవ్వరు. బార్ల లెసైన్స్ ఫీజు ఇలా... నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ జిల్లాల పరిధిలో 46 బార్లు ఉన్నాయి. వీటికి ఈ ఏడాది నూతన లెసైన్స్‌ఫీజు విధానం అమల్లోకి రానుంది. జనాభా నిష్పత్తి ప్రకారం లెసైన్స్ రెన్యూవల్ ఫీజును విధించారు. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.25 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.38 లక్షలు, 5 లక్షల నుంచి 25 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.48 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మద్యం దుకాణాలకు మంగళవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకొనేవారు ఈనెల 27వ తేదీ సాయంత్రం మూడుగంటల్లోపు పూర్తిచేసిన దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. 28వ తేదీ మధ్యాహ్నం రెండుగంటలకు స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో అధికారులు దుకాణాలకు లాటరీ తీయనున్నారు.