ఘనంగా ‘మనగుడి’
Published Thu, Aug 22 2013 3:39 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : దేవాదాయ ధర్మదాయశాఖ, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రీతి పాత్రమైన శ్రావణ పౌర్ణమిరోజున భక్తులు ఆల యాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని మార్వాడి ధర్మశాలలో భక్తిశ్రద్ధలతో శ్రీ వేంకటేశ్వరస్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వేంకటేశ్వర సహస్త్రనామార్చన లు, గోవిందనామస్మరణ గావించారు. జిల్లా ప్ర ధాన న్యాయమూర్తి గోపాలకృష్ణ,
అడిషనల్ జడ్జిసునిత, ఫ్యామిలీ కోర్టు జడ్జి జైరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ సంప్రదాయాలు పాటిస్తూ మానవ విలువలు కాపాడాలన్నారు. ఆధ్యాత్మిక భావాలు పెంపొం దించుకొని తోటివారికి చేయూతనివ్వాలని కోరారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ నాయకులు వారిని ఘనంగా సన్మానించి, వేంకటేశ్వర స్వామి చిత్రపటాలను అందించారు. శ్రీవారి కంకణాలు కట్టుకున్నారు. ఎస్‌బీహెచ్ ఏజీఎం రవింధ్రనాథ్ ఠాగూర్, టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజారాం, కొండయ్యచౌదరి,బండారి దేవన్న పాల్గొన్నారు.
మంగమఠంలో..
పట్టణంలోని మంగమఠంలోని శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చన జరిపారు. అంతకు ముందు మార్వాడి ధర్మశాలనుంచి సత్యనారాయణ స్వామి, రమాదేవీల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చా రు. వీటిని శాస్త్రీమందిర్, అశోక్‌రోడ్, గోపాలకృష్ణ మఠం మీదుగా మంగమఠానికి తీసుకొచ్చారు. ఓ దాత స్వామివారికి వెండి కిరీటం బహూకరించారు. కంకణధారణ చేపట్టారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు దేవీదాస్, వె ంకట్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, సాగర్‌గౌడ్, రమేశ్, మ హేశ్, పవన్‌గుజరాతీ, ఈవో రవి పాల్గొన్నారు.
గోపాలకృష్ణ మఠంలో..
పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో మనగుడిలో భాగంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మఠాధిపతి యోగానంద సరస్వతీ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపాలకృష్ణ, అడిషనల్ జడ్జీ సునిత, ఫ్యామీలీకోర్టు జడ్జీ జైరాజు ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ శ్రీవారి పాదాలనుంచి తెచ్చిన కంకణాలు, అంక్షింతలు, పసుపుకుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. రాఖీలు కట్టారు. అభిషేకాలు అర్చనలు చేశారు. మఠం ఆవరణలోని రేణుకామాత ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచారపరిషత్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజారాం, బండారి దేవన్న, కొండయ్య చౌదరి పాల్గొన్నారు.
ఆయా ఆలయాల్లో..
శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని క్రాంతినగర్, శాంతినగర్, టీచర్స్ కాలనీల్లోని సాయిబాబా ఆలయంలో,తిర్పెల్లి, హౌసింగ్ బోర్డు రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.మార్కెట్లోనూ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని దుకాణాలు రాఖీలు కొనుగోలుతో కిటకిటలాడాయి.
Advertisement
Advertisement