promotional
-
'స్త్రీ 2' ప్రచార కార్యక్రమంలో శ్రద్ధా కపూర్ (ఫొటోలు)
-
విసిగిస్తున్న కాల్స్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ప్రమోషనల్ లేదా అవాంఛిత కాల్స్ సమస్య పరిష్కారానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఫిబ్రవరి 14న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో టెలికం శాఖ, ఆర్థిక సర్వీసుల విభాగం, గృహ .. పట్టణ వ్యవహారాల శాఖ, రిజర్వ్ బ్యాంక్, బీమా రంగ నియంత్రణ .. అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ), టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) సహా పరిశ్రమ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. మరోవైపు, అవాంఛిత కాల్స్ అనేవి యూజర్ల గోప్యతకు మాత్రమే కాకుండా వారి హక్కులకు కూడా భంగం కలిగిస్తాయని సమావేశంలో పాల్గొన్న వారు అభిప్రాయపడినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సేవల సంస్థలు.. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి ఇలాంటి కాల్స్ ఎక్కువగా ఉంటున్నాయని గుర్తించినట్లు తెలిపింది. అంతే కాకుండా కస్టమర్లను పోంజీ స్కీములు, క్రిప్టో పెట్టుబడుల వైపు ఆకర్షించేందుకు స్పామ్ కాలర్లు ఇప్పుడు వాట్సాప్ మొదలైన యాప్స్ ద్వారా ఇంటర్నెట్ కాల్స్ కూడా చేస్తున్నట్లు వివరించింది. రిజిస్టర్డ్ టెలీమార్కెటర్ల నుంచి స్పామ్ మెసేజీలు, అవాంఛిత కాల్స్ సమస్యను పరిష్కరించేందుకు టెలికం శాఖ, ట్రాయ్ ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. -
ఆదిపురుష్ ప్రమోషన్స్: స్పెషల్ శాలువాతో కృతి సనన్, దీని విశేషాలు తెలిస్తే
మోస్ట్ ఎవైటెడ్ , అప్ కమింగ్ మూవీ ఆదిపురుష్ ప్రమోషన్స్‌లో హీరోయిన్ కృతి సనన్ మరోసారి తన లేటెస్ట్ లుక్స్‌తో అందర్నీ కట్టిపడేస్తోంది. బ్యూటిఫుల్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా ఈ ప్రచార కార్యక్రమంలో కృతి సనన్ అయోధ్య కథలతో రూపొందించిన శాలువను ధరించడం విశేషంగా నిలిచింది. కృతి సనన్ స్టైలిస్ట్, సుకృతి గ్రోవర్ ఇన్‌స్టా హ్యాండిల్లో దీనికి సంబంధించిన అద్బుత ఫోటోలను షేర్ చేసింది. ఆదిపురుష్ ప్రమోషనల్ ఈవెంట్స్లోని కృతి లేటెస్ట్ లుక్స్‌తో ఉన్న పిక్స్‌ను పోస్ట్ చేసింది. ముఖ్యంగా వెడల్పాటి గోల్డెన్ అంచు, లేత గోధుమరంగు అనార్కలిలో బ్యూటిఫుల్‌గా ఉంది. ప్రత్యేకంగా సుకృతి అండ్ ఆకృతి బ్రాండ్ ప్రత్యేకంగా రూపొందించిన అయోధ్య కథల శాలువా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రెండేళ్లు శ్రమించి రామ కథలతో శాలువా పురాణ గాథ రామాయణం ప్రేరణగా రూపొందించిన ఈ శాలువా తయారీకి రెండు సంవత్సరాలు పట్టిందట. అంతేకాదు దీన్ని ఇంత అందంగా తీర్చి దిద్దడానికి ఎన్ని వేల గంటలు పట్టిందో తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు. 6000 కంటే ఎక్కువ గంటలే దీనికోసం కృషి చేశారు. రామాయణంలోని పంచవటి, స్వయంవరం, అశోక వనం, రామ్ దర్బార్లోని నాలుగు సన్నివేశాలు ఇందులో కూర్చారు. పాషా, చోకర్స్, కడా లాంటి స్టేట్మెంట్ ఆభరణాలతో పాటు అందమైన హెయిర్ యాక్సెసరీతో అద్భుతమైన అనార్కలిలో దేవకన్యలా మెరిసిపోతోంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) కాగా ప్రభాస్, కృతి సనన్ జోడిగా రాబోతున్న చిత్రం ఆదిపురుష్. జూన్ 16, 2023న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో టీం బిజీగా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ 'రాఘవ' కేరెక్టర్లోనే, 'జానకి' పాత్రలో కృతి నటించిన సంగతి తెలిసిందే. -
వాటికి వ్యతిరేకంగానే నా సినిమా: ఆర్.నారాయణమూర్తి
హాలియా : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను అంతమొందించే వరకు కార్మికులు, కర్షకులు ఐక్యతతో పోరాడాలని, రైతుల పోరాటానికి మద్దతుగా వారిని చైతన్య పరిచేందుకు రైతన్న సినిమాను తీసినట్లు సినీనటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. బుధవారం హాలియాలో నిర్వహించిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కున్రెడ్డి నాగిరెడ్డి, కొండేటి శ్రీను, అవుతా సైదయ్య, కుర్ర శంకర్‌నాయక్, దుబ్బా రామచంద్రయ్య, జువాజీ వెంకటేశ్వర్లు, పొదిల వెంకన్న, రవినాయక్, యూసూబ్, శ్రీను, యాదయ్య, యడవెల్లి శ్రీను, ఎస్కె జానీపాషా, రవి, రవీందర్ తదితరులు ఉన్నారు. (చదవండి: ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం) ‘రైతన్న’ను ఆదరించాలి: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే భగత్ సమాజహితం కోసం ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి నిర్మించిన రైతన్న సినిమాను ప్రతిఒక్కరూ ఆదరించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ కోరారు. బుధవారం హాలియాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్ నారాయణమూర్తి ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తిని సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన వ్యవసాయ విద్యుత్ సంస్కరణలను పునర్ సమీక్షించాలన్నారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కాపాడడంతో పాటు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతన్న సినిమాను చిత్రీకరించినట్లు తెలిపారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ వి«ధానాలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో అనుముల, తిరుమలగిరి మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గౌరవసలహాదారు వెంపటి శంకరయ్య, వైస్ చైర్మన్ సుధాకర్, కౌన్సిలర్ వెంకటయ్య, నాయకులు చాపల సైదులు, సురభి రాంబాబు, దోరేపల్లి వెంకటేశ్వర్లు, బందిలి సైదులు, రావుల లింగయ్య ఉన్నారు. చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం -
బల్దియాకు బహుమానం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కోసం బాండ్ల జారీ ద్వారా రూ.200 కోట్లు సేకరించినందుకు ప్రోత్సాహకంగా రూ.26 కోట్ల చెక్కును ప్రధాని మోదీ.. మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డికి అందజేశారు. లక్నోలో శనివారం 2 రోజుల ‘ట్రాన్స్ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేపింగ్’ సదస్సు ముగింపు సందర్భంగా అమృత్ పథకం కింద ఈ బహుమతిని, ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందజేశారు. మేయర్, కమిషనర్.. ప్రధానికి స్వచ్ఛ నమ స్కారం అంటూ గౌరవిస్తూ ప్రత్యేకత చూపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మం త్రులు రాజ్‌నాథ్ సింగ్, హరిదీప్‌సింగ్, గవర్నర్ రాంలాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘సింగం చెరువు’ లబ్ధిదారుతో ప్రధాని భేటీ హైదరాబాద్‌లోని సింగం చెరువు తండా డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీలో ఇల్లు పొందిన గిరిజన మహిళ జ్యోతితో ప్రధాని సమావేశమయ్యారు. కూలి చేసుకునే తమకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని నిర్మించి ఉచితంగా ఇచ్చిందని తెలిపింది. గుడిసెలో ఉన్నప్పుడు ఎండ, వానలకు ఇబ్బందులను ఎదుర్కొనేవారమని.. ఇప్పుడు తమ కుటుంబం సంతోషంగా ఉందని చెప్పింది. సూచన పాటించారు.. బహుమతి పొందారు స్థానిక సంస్థలు.. ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్లు స్వయం సమృద్ధికి బాండ్ల జారీ ద్వారా నిధు లు సమీకరించుకోవాలని, దీనికి తెలంగాణ ప్రభు త్వం చొరవ చూపాలని మెట్రోరైలు ప్రారంభోత్స వానికి నగరానికి వచ్చిన ప్రధాని.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సూచించారు. దీంతో మంత్రి బాండ్ల ద్వారా నిధులు సేకరించాలని జీహెచ్ఎంసీ ని ఆదేశించారు. నగరంలో చేపట్టనున్న ఎస్సార్డీపీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వెయ్యి కోట్లు సేకరించాలనే లక్ష్యంతో కృషి చేసి సఫలమయ్యారు. పుణే తర్వాత జీహెచ్ఎంసీ మాత్రమే బాండ్ల ద్వారా నిధులు సేకరించాయి. జీహెచ్ఎంసీలోని ఆర్థిక క్రమశిక్షణ, ఆస్తులు, వనరులు తదితరమైన వాటిని పరిగణనలోకి తీసుకున్న పలు సంస్థలు వెయ్యి కోట్లకు పైగా నిధులిచ్చేందుకు ముంబై స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో పోటీలు పడ్డాయి. తొలిదశలో ఎస్సార్డీపీ పనులకు రూ.200 కోట్లు సేకరించారు. సొంతంగా నిధులు సేకరించే స్థానిక సంస్థలకు ప్రోత్సాహకంగా బాండ్ల ద్వారా తీసుకున్న మొత్తానికి వడ్డీని కేంద్రమే అందజేయాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు సీఎస్ ఎస్కే జోషి కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించారు. సుముఖత వ్యక్తం చేసిన కేంద్రం జీహెచ్ఎంసీని ఇందుకు ఎంపిక చేసింది. ప్రజోపయోగానికి రూ. 26 కోట్లు... జీహెచ్ఎంసీ బాండ్ల రూపంలో నిధులను సేకరించినందున కేంద్రం ప్రోత్సాహకంగా అందజేసిన రూ.26 కోట్లను వినూత్న కార్యక్రమాలకు ఉపయోగించాలని కేటీఆర్ సూచించారు. దీంతో ప్రత్యేక ప్రజోపయోగ కార్యక్రమానికి ఈ నిధులు వినియోగించాలని, దీనికి ప్రజాభిప్రాయాన్నీ సేకరించనున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. -
కాలేజీలో సందడి చేసిన హీరో నాగ శౌర్య
-
అనామిక ప్రమోషనల్ సాంగ్ లో ప్రముఖ గాయిని సునీత
-
ఘనంగా ‘మనగుడి’
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : దేవాదాయ ధర్మదాయశాఖ, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రీతి పాత్రమైన శ్రావణ పౌర్ణమిరోజున భక్తులు ఆల యాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని మార్వాడి ధర్మశాలలో భక్తిశ్రద్ధలతో శ్రీ వేంకటేశ్వరస్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వేంకటేశ్వర సహస్త్రనామార్చన లు, గోవిందనామస్మరణ గావించారు. జిల్లా ప్ర ధాన న్యాయమూర్తి గోపాలకృష్ణ, అడిషనల్ జడ్జిసునిత, ఫ్యామిలీ కోర్టు జడ్జి జైరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ సంప్రదాయాలు పాటిస్తూ మానవ విలువలు కాపాడాలన్నారు. ఆధ్యాత్మిక భావాలు పెంపొం దించుకొని తోటివారికి చేయూతనివ్వాలని కోరారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ నాయకులు వారిని ఘనంగా సన్మానించి, వేంకటేశ్వర స్వామి చిత్రపటాలను అందించారు. శ్రీవారి కంకణాలు కట్టుకున్నారు. ఎస్బీహెచ్ ఏజీఎం రవింధ్రనాథ్ ఠాగూర్, టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజారాం, కొండయ్యచౌదరి,బండారి దేవన్న పాల్గొన్నారు. మంగమఠంలో.. పట్టణంలోని మంగమఠంలోని శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చన జరిపారు. అంతకు ముందు మార్వాడి ధర్మశాలనుంచి సత్యనారాయణ స్వామి, రమాదేవీల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చా రు. వీటిని శాస్త్రీమందిర్, అశోక్‌రోడ్, గోపాలకృష్ణ మఠం మీదుగా మంగమఠానికి తీసుకొచ్చారు. ఓ దాత స్వామివారికి వెండి కిరీటం బహూకరించారు. కంకణధారణ చేపట్టారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు దేవీదాస్, వె ంకట్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, సాగర్‌గౌడ్, రమేశ్, మ హేశ్, పవన్గుజరాతీ, ఈవో రవి పాల్గొన్నారు. గోపాలకృష్ణ మఠంలో.. పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో మనగుడిలో భాగంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మఠాధిపతి యోగానంద సరస్వతీ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపాలకృష్ణ, అడిషనల్ జడ్జీ సునిత, ఫ్యామీలీకోర్టు జడ్జీ జైరాజు ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ శ్రీవారి పాదాలనుంచి తెచ్చిన కంకణాలు, అంక్షింతలు, పసుపుకుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. రాఖీలు కట్టారు. అభిషేకాలు అర్చనలు చేశారు. మఠం ఆవరణలోని రేణుకామాత ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచారపరిషత్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజారాం, బండారి దేవన్న, కొండయ్య చౌదరి పాల్గొన్నారు. ఆయా ఆలయాల్లో.. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని క్రాంతినగర్, శాంతినగర్, టీచర్స్ కాలనీల్లోని సాయిబాబా ఆలయంలో,తిర్పెల్లి, హౌసింగ్ బోర్డు రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.మార్కెట్లోనూ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని దుకాణాలు రాఖీలు కొనుగోలుతో కిటకిటలాడాయి.