![Adipurush Promotions Kriti Sanon stunning look and Ayodhya tales inscribed shawl - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/14/Kriti%20Sanon%20Flaunted%20Ayodhya%20Tales-01.jpg.webp?itok=r0Jq74r8)
మోస్ట్ ఎవైటెడ్ , అప్ కమింగ్ మూవీ ఆదిపురుష్ ప్రమోషన్స్‌లో హీరోయిన్ కృతి సనన్ మరోసారి తన లేటెస్ట్ లుక్స్‌తో అందర్నీ కట్టిపడేస్తోంది. బ్యూటిఫుల్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా ఈ ప్రచార కార్యక్రమంలో కృతి సనన్ అయోధ్య కథలతో రూపొందించిన శాలువను ధరించడం విశేషంగా నిలిచింది.
కృతి సనన్ స్టైలిస్ట్, సుకృతి గ్రోవర్ ఇన్‌స్టా హ్యాండిల్‌లో దీనికి సంబంధించిన అద్బుత ఫోటోలను షేర్ చేసింది. ఆదిపురుష్ ప్రమోషనల్ ఈవెంట్స్‌లోని కృతి లేటెస్ట్ లుక్స్‌తో ఉన్న పిక్స్‌ను పోస్ట్ చేసింది. ముఖ్యంగా వెడల్పాటి గోల్డెన్ అంచు, లేత గోధుమరంగు అనార్కలిలో బ్యూటిఫుల్‌గా ఉంది. ప్రత్యేకంగా సుకృతి అండ్ ఆకృతి బ్రాండ్ ప్రత్యేకంగా రూపొందించిన అయోధ్య కథల శాలువా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
రెండేళ్లు శ్రమించి రామ కథలతో శాలువా
పురాణ గాథ రామాయణం ప్రేరణగా రూపొందించిన ఈ శాలువా తయారీకి రెండు సంవత్సరాలు పట్టిందట. అంతేకాదు దీన్ని ఇంత అందంగా తీర్చి దిద్దడానికి ఎన్ని వేల గంటలు పట్టిందో తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు. 6000 కంటే ఎక్కువ గంటలే దీనికోసం కృషి చేశారు. రామాయణంలోని పంచవటి, స్వయంవరం, అశోక వనం, రామ్ దర్బార్‌లోని నాలుగు సన్నివేశాలు ఇందులో కూర్చారు. పాషా, చోకర్స్, కడా లాంటి స్టేట్‌మెంట్ ఆభరణాలతో పాటు అందమైన హెయిర్ యాక్సెసరీతో అద్భుతమైన అనార్కలిలో దేవకన్యలా మెరిసిపోతోంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!)
కాగా ప్రభాస్, కృతి సనన్ జోడిగా రాబోతున్న చిత్రం ఆదిపురుష్. జూన్ 16, 2023న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో టీం బిజీగా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ 'రాఘవ' కేరెక్టర్‌లోనే, 'జానకి' పాత్రలో కృతి నటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment