ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ధర్నా | dharna for sc corporation loans | Sakshi

ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ధర్నా

Apr 27 2015 4:41 PM | Updated on Jul 24 2018 2:17 PM

ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తులకు మాత్రమే కార్పొరేషన్ రుణాలు కేటాయిస్తున్నారని ఆగ్రహించిన దళితులు సోమవారం ఎండీవో కార్యాలయాన్ని ముట్టడించారు.

విజయవాడ : ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తులకు మాత్రమే కార్పొరేషన్ రుణాలు కేటాయిస్తున్నారని ఆగ్రహించిన దళితులు సోమవారం ఎండీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా చందర్లపాడు మండల కార్యాలయం ఎదుట సోమవారం చోటుచేసుకుంది.

మండలంలోని ఏటూరు గ్రామానికి చెందిన దళితులు గతంలో ఎస్సీ కార్పోరేషన్ రుణాల కోసం మొరపెట్టుకోగా.. ప్రస్తుతం మంజూరైన రుణాల్లో అధిక శాతం టీడీపీ అనుకూల వర్గాలకు చెందినవే ఉన్నాయి. దీన్ని నిరసిస్తూ అదే గ్రామానికి చెందిన దళితులు ఎండీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని ఎండీవోకు వినతిపత్రం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all
Advertisement