మోమిన్‌పేట, న్యూస్‌లైన్:
అతిసార మరోమారు పంజా విసిరింది. మోమిన్‌పేట మండల పరిధిలోని రెండు గ్రామాల్లో ఇద్దరిని బలితీసుకుంది. మొత్తం మండలంలోని తొమ్మిది గ్రామాల్లో పదుల సంఖ్యలో జనం అతిసార బారిన పడి చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల నుంచి వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. చంద్రాయన్‌పల్లి, కాసులబాదు, మోమిన్‌పేట, మొరంగపల్లి, వెల్‌చాల్, రాంనాథ్‌గుడుపల్లి, మల్‌రెడ్డిగూడెం, గోవిందాపూర్, ఏన్కతల గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రాంనాథ్‌గుడుపల్లిలో చాకలి సత్యమ్మ(55) శుక్రవారం రాత్రి వాంతులు, విరేచనాల బారిన పడగా శనివారం ఉదయం కుటుంబసభ్యులు ఆమెను శనివారం ఉదయం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించేలోపే సత్యమ్మ మృతి చెందింది. సత్యమ్మకు ఉన్న ఒక్క కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు
. తల్లి మరణవార్తవిని హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని విలపించాడు. అదేవిధంగా మండలంలోని ఏన్కతల గ్రామానికి చెందిన మ్యాతరి సురేష్(28)కు సైతం శుక్రవారం సాయంత్రం వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. వెంటనే కుటుంబీకులు మోమిన్‌పేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి చేర్చారు. వైద్యాధికారి సాయిబాబ రాత్రి 10గంటల వరకు వైద్యంచేసి సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. అయితే కుటుంబీకులు అక్కడికి తరలించేందుకు విముఖత చూపి తిరిగి ఇంటికే తీసుకెళ్లారు. అయితే అర్ధరాత్రి సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సంగారెడ్డికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయాడు. సురేష్‌కు భార్య సుమలత ఉన్నారు.
పంజా విసిరిన అతిసార
Published Sun, Sep 15 2013 12:27 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
Advertisement