కారు’ చౌక | Diploma Students Innovated New Car in Krishna | Sakshi
Sakshi News home page

కారు’ చౌక

Published Sat, Mar 2 2019 12:55 PM | Last Updated on Sat, Mar 2 2019 12:55 PM

Diploma Students Innovated New Car in Krishna - Sakshi

పెనమలూరు:  డిప్లమో విద్యార్థులు మేధస్సును ఉపయోగించి తక్కువ వ్యవయంతో కారును రూపొందించారు. ఈ కారుకు‘ డాక్‌సన్‌ ’అనే పేరు కూడా పెట్టారు. గంగూరు ధనేకుల ఇంజనీరింగ్‌ కాలేజీలో డిప్లమో మెకానికల్‌ విభాగంలో తృతీయ సంవత్సరం చదువుతున్న టి.నాగార్జున, టి.ఉదయకిరణ్, డి.ఉమామహేష్, ఎస్‌.దుర్గాప్రసాద్‌ కలసి ఫోర్‌ వీల్‌ కారు రూపొందించారు. ఈ కారుకు సుజుకి బైక్‌ 125 సీసీ ఇంజన్‌ అమర్చారు. ఇది గంటకు 40 కిలోమీటర్ల వేగం, లీటరుకు 20 కిలోమీటర్ల దూరం, వాహనం బరువు 350 కిలోలు, పాసింజర్‌ల బరువు 250 కిలోలు మోయగలదు. ఈ వాహనం తయారు చేయటానికి రూ. 35 వేలు ఖర్చు అయింది. మధ్యతరగతి వారికి ఈ వాహనం ఉపయోగంగా ఉంటుంది. ఈ సందర్బంగా కాలేజీ ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ కడియాల రవి,డిప్లమో విభాగాధిపతులు ఎం.ప్రవీణ్, ఆర్‌.సురేష్‌బాబు విద్యార్థులను అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement