Diploma Students
-
ఏరోస్పేస్ శిక్షణకు 25 మంది డిప్లొమా విద్యార్థుల ఎంపిక
మురళీనగర్ (విశాఖ ఉత్తర): పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చేసిన ప్రతి విద్యార్థికి అత్యున్నత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో పారిశ్రామిక శిక్షణకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియను ఆయన ఆధ్వర్యంలో విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శుక్రవారం నిర్వహించారు. ఏరోస్పేస్ రంగంలో విశాఖ అభివృద్ధి చెందుతున్నందున ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంపిక చేశామన్నారు. గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సహకారంతో మెకానికల్ డిప్లొమా విద్యార్థులకు 6 నెలల పారిశ్రామిక శిక్షణకు గాను రెండో బ్యాచ్ ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో 134 మంది పాల్గొనగా రాత, మౌఖిక పరీక్ష ద్వారా 25 మందిని ఏరోస్పేస్లో శిక్షణకు ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరిలో 12 మంది బాలురు, 13 మంది బాలికలున్నట్లు చెప్పారు. వీరికి అచ్యుతాపురంలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రంలో శిక్షణనిస్తారని, శిక్షణ కాలంలో బోయింగ్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్‌కు నిధులు అందిస్తుందని తెలిపారు. లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సంస్థ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ తీసుకునే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.35,000 కోర్సు ఫీజుతోపాటు నెలకు రూ.3,000 ఉపకార వేతనం చెల్లిస్తుందన్నారు. -
ఏపీ ఈసెట్-2022 ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లమో కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్ సెకండియర్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈసెట్–2022లో 92.42% మంది ఉత్తీర్ణత సాధించారు. బుధ వారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సెట్ ఫలి తాలను హేమచంద్రారెడ్డి, జేఎన్ టీయూ (కాకినాడ) వీసీ ప్రసాద రాజు మీడియాకు వివరించారు. ఈసెట్‌కు 38,801 మంది దర ఖాస్తు చేయగా 36,440 మంది పరీక్ష రాశారు. వీరిలో 33,657 మంది అర్హత సాధించారు. 14 విభాగాలకుగాను 11 విభాగాల అభ్య ర్థులకే పరీక్షలు నిర్వహించారు. మైనింగ్‌లో తెలంగాణ తొర్రూరుకు చెందిన నాయకుల ఉపేందర్ మొదటి ర్యాంకు సాధించారు. (ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కారు’ చౌక
పెనమలూరు: డిప్లమో విద్యార్థులు మేధస్సును ఉపయోగించి తక్కువ వ్యవయంతో కారును రూపొందించారు. ఈ కారుకు‘ డాక్సన్ ’అనే పేరు కూడా పెట్టారు. గంగూరు ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లమో మెకానికల్ విభాగంలో తృతీయ సంవత్సరం చదువుతున్న టి.నాగార్జున, టి.ఉదయకిరణ్, డి.ఉమామహేష్, ఎస్.దుర్గాప్రసాద్ కలసి ఫోర్ వీల్ కారు రూపొందించారు. ఈ కారుకు సుజుకి బైక్ 125 సీసీ ఇంజన్ అమర్చారు. ఇది గంటకు 40 కిలోమీటర్ల వేగం, లీటరుకు 20 కిలోమీటర్ల దూరం, వాహనం బరువు 350 కిలోలు, పాసింజర్ల బరువు 250 కిలోలు మోయగలదు. ఈ వాహనం తయారు చేయటానికి రూ. 35 వేలు ఖర్చు అయింది. మధ్యతరగతి వారికి ఈ వాహనం ఉపయోగంగా ఉంటుంది. ఈ సందర్బంగా కాలేజీ ప్రిన్సి పాల్ డాక్టర్ కడియాల రవి,డిప్లమో విభాగాధిపతులు ఎం.ప్రవీణ్, ఆర్.సురేష్‌బాబు విద్యార్థులను అభినందించారు. -
‘జల్సా’ దొంగల అరెస్ట్
మడకం సూర్యప్రకాష్, అజ్మీరా మహేంద్ర నాయక్. మరో ఇద్దరు బాలురు (మైనర్లు) ఈ నలుగురూ.. డిప్లొమా విద్యార్థులు. ‘బిడ్డల్లారా.. బాగా చదువుకోండర్రా..’ అని, తల్లిదండ్రులు ఖమ్మం పంపించారు. కానీ, వీరు ఏం చేశారో తెలుసా...? జల్సాలకు అలవాటుపడ్డారు. దొంగతనాలకు తెగబడ్డారు. పోలీసులకు చిక్కారు. తమ తల్లిదండ్రులు తల దించుకునేలా చేశారు. ఖమ్మంక్రైం: ఖమ్మంలో డిప్లొమా చదువుతున్న నలుగురు విద్యార్థులు, జల్సాలకు అలవాటుపడ్డారు. డబ్బు కోసం దొంగతనాలకు తెగబడ్డారు. చివరికి, పోలీసులకు చిక్కారు. ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకట్రావ్ వెల్లడించిన వివరాలు... పాల్వంచ రూరల్ మండలం వీరునాయక్ తండాకు చెందిన మడకం సూర్యప్రకాష్, అజ్మీరా మహేంద్ర నాయక్, మరో ఇద్దరు మైనర్లు ఖమ్మంలో డిప్లొమా చదువుతున్నారు. వీరు జల్సాలకు అలవాటుపడ్డారు. డబ్బు కోసం ద్విచక్ర వాహనాలను చోరీ చేయసాగారు. ఖమ్మం టూటౌన్ పరిధిలో ఐదు, ఖమ్మం వన్ టౌన్ పరిధిలో రెండు, ఖమ్మం త్రీ టౌన్ పరిధిలో రెండు, ఖానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి చొప్పున ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. వీటిని తక్కువ రేటుకు అమ్మి, వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు. రద్దీ ప్రాంతాలే టార్గెట్ రద్దీగా ఉన్న ప్రాంతాలనే వీరు లక్ష్యంగా ఎంచుకున్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. పాల్వంచ నవభారత్ ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను కూడా చోరీ చేశారు. ఇలా దొరికారు అడిషనల్ డీసీపీ వెంకట్రావ్ ఆదేశాలతో టూటౌన్ సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ యల్లయ్య, సిబ్బంది కలిసి నిఘా పెట్టారు. ఖమ్మంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బుధవారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళుతున్న సూర్యప్రకాష్, మహేంద్ర నాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో వ్యవహారం బయటపడింది. వీరితోపాటు మరో ఇద్దరు మైనర్లను కూడా అరెస్ట్ చేశారు. వీరి నుంచి ద్విచక్ర వాహనాలను స్వాధీనపర్చుకున్నారు. వీటి విలువ రూ.4.70లక్షలు ఉంటుందని అంచనా. ఈ కేసులో పురోగతి సాధించిన సీఐ రాజిరెడ్డి, ఎస్ఐ యల్లయ్య, ఏఎస్ఐ సుబ్బారావు, హెడ్ కానిస్టేబుళ్లు రామచంద్ర నాయక్, బుచ్చయ్య నాయక్, కానిస్టేబుళ్లు రాజు నాయక్, సైదులు, భాస్కర్‌కు రివార్డులు అందించారు. సమావేశంలో సీఐలు వెంకన్నబాబు, నాగేంద్రచారి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్, డిప్లొమా విద్యార్థుల అప్రెంటిస్‌కు ఇంటర్వ్యూలు
ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహణ సాక్షి, హైదరాబాద్: బోర్డు ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ సదర న్ రీజియన్ కమిటీ సహకారంతో తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లకు ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూలను ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ డెరైక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. రామంతాపూర్‌లోని జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. 2013, 2014, 2015 సంవత్సరాల్లో ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని వెల్లడించారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటా వివరాలతో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్య ఇంటర్వ్యూలకు రావాలని సూచించారు. 27వ తేదీన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్ ్స, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. 28వ తేదీన ఈఈఈ, మెకానికల్, సివిల్, మెటలర్జీ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, కెమికల్, మైనింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు, అలాగే డిప్లొమా అభ్యర్థులకు (ఈఈఈ, మెకానికల్, సివిల్, మెటలర్జీ, ఆటోమొబైల్, కెమికల్, ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మైనింగ్, డీసీసీపీ ) ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలను dte.telangana. gov.in/screens/notifications.aspxవెబ్సైట్లో పొందవచ్చని వివరించారు. వెబ్సైట్లో ఎన్టీఎస్ఈ, ఎన్ఎంఎంఎస్ కీ ఈ నెల 8వ తేదీన నిర్వహించిన నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్టీఎస్ఈ), నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ వరకు తమ అభ్యంతరాలనుdirgovexams.tg@gmail.comమెయిల్ ఐడీకి పంపించవచ్చని పేర్కొన్నారు. -
డిప్లొమా విద్యార్థులకు చక్కటి అవకాశం..
ఇంజనీరింగ్ డిప్లొమా విద్యార్థులకు చక్కని అవకాశం.. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) జూనియర్ ఇంజనీర్స్ ఎగ్జామినేషన్.. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తారు.. పరీక్షకు ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే.. కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌తో కెరీర్ ప్రారంభించే చక్కని అవకాశం దక్కుతుంది.. ఈ నేపథ్యంలో సంబంధిత అంశాలపై విశ్లేషణ.. భర్తీ చేస్తున్న పోస్టులు: సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్: జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్) బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్: జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్: జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్) సెంట్రల్ వాటర్ కమిషన్, ఫరక్కా బ్యారేజీ: జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్) ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ రెండు దశలాధారంగా ఎంపిక ఉంటుంది. ఇందుకు 600 మార్కులు కేటాయించారు. ఇందులో రాత పరీక్షకు 500 మార్కులు, ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. రాత పరీక్ష: ఆబ్జెక్టివ్, కన్వేన్షనల్ అనే రెండు విధాల కలయికగా ఉంటుంది. ఈ క్రమంలో రెండు పేపర్లు ఉంటాయి. అవి.. పేపర్-1, పేపర్-2. వివరాలు.. పేపర్-1: ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. అవి.. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంజనీరింగ్. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 మార్కులు జనరల్ అవేర్నెస్ 50 మార్కులు జనరల్ ఇంజనీరింగ్ (సివిల్- 100 మార్కులు స్ట్రక్చరల్/ఎలక్ట్రికల్/మెకానికల్) సమయం: 2 గంటలు పేపర్-2: పూర్తిగా సంబంధిత బ్రాంచ్‌పై ఉంటుంది. ఈ పేపర్‌ను కన్వెన్షన్ విధానంలో నిర్వహిస్తారు. జనరల్ ఇంజనీరింగ్ (సివిల్- 300 మార్కులు స్ట్రక్చరల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్) సమయం: 2 గంటలు పేపర్-1లో నిర్దేశించిన విధంగా అర్హత సాధించిన అభ్యర్థుల పేపర్-2ను మాత్రమే మూల్యాంకనం కోసం పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో(2012) 1,02,145 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైతే.. 5025 మంది అభ్యర్థులు మాత్రమే పార్ట్-2కు అర్హత సాధించారు. కటాఫ్‌లను(జనరల్) పరిశీలిస్తే: సివిల్-62.5,ఎలక్ట్రికల్/మెకానికల్-90.50. జనరల్ ఇంటెలిజెన్స్+రీజనింగ్: ఈ విభాగంలో వెర్బల్-నాన్ వెర్బల్ ప్రశ్నలు వస్తాయి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే తార్కిక విశ్లేషణ అవసరం. డెరైక్షన్స్, అనాలజీస్, కోడింగ్-డీకోడింగ్, వెన్‌డయాగ్రమ్స్ తదితరాలాధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అడిగే ప్రశ్నలు క్లిష్టంగా కాకుండా మధ్యస్తంగా ఉంటాయి. కాబట్టి ప్రశ్నను సరిగ్గా అవగాహన చేసుకుంటే సులభంగానే సమాధానాన్ని గుర్తించవచ్చు. జనరల్ అవేర్నెస్: జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమకాలీనంగా చోటు చేసుకుంటున్న అంశాలను నిశితంగా పరిశీలించాలి. అదే సమయంలో చరిత్ర, జనరల్ సైన్స్, ఆర్థిక రంగం, జాగ్రఫీ, శాస్త్ర పరిశోధనలు, స్టాండర్డ్ జీకే నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. రిఫరెన్స బుక్స్: క్వికర్ మ్యాథ్స్- ఎం.థైరా ఆబ్జెక్టివ్ మ్యాథ్స్-ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్-ఆర్ఎస్ అగర్వాల్, కిరణ్ ప్రకాషణ్ జీకే-మనోరమ ఇయర్‌బుక్, అరిహంత్ పబ్లికేషన్స్, ప్రతియోగితా దర్పణ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లలోని ప్రశ్నలు డిప్లొమా స్థాయిలో ఉంటాయి. కాన్సెప్ట్స్‌పై పట్టు ఉంటే ఈ ప్రశ్నలను సులభంగానే సాధించవచ్చు. కాబట్టి ఆయా అంశాల్లోని ఫార్ములాలు, సూత్రాలను ఔపోసన పట్టాలి. ప్రతి ప్రాబ్లమ్‌ను కాన్సెప్ట్, ఫార్ములాను ఆధారం చేసుకొని వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సిలబస్, గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ.. డిప్లొమా స్థాయి అకడమిక్ పుస్తకాలను చదవడం ఉపయోగకరంగా ఉంటుంది. రెండో దశ: పర్సనాలిటీ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అభ్యర్థి విద్యార్హతలు, సొంత రాష్ట్రం, ఆసక్తి, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. నోటిఫికేషన్ సమాచారం: అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/డిగ్రీ. మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్, బోర్డర్ రోడ్ ఆర్గైనె జేషన్ విభాగానికి చెందిన పోస్టులకు కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి. జూనియర్ ఇంజనీర్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్) పోస్టుకు-సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్వేయర్స్ నిర్వహించే ఇంటర్మీడియెట్ ఎగ్జామ్ (బిల్డింగ్ అండ్ క్వాంటిటీవ్ సర్వేయింగ్ సబ్ డివిజనల్ పార్ట్-2) ఉత్తీర్ణత. వయసు: జనవరి 1, 2014 నాటికి 27 ఏళ్లు (సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్,మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్: -క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్), 30 ఏళ్లు (మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్), 32 ఏళ్లు, (సెంట్రల్ వాటర్ కమిషన్-ఫరాక్క బ్యారేజీ), 30 ఏళ్లు (బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్). దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పార్ట్-1 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మార్చి 26, 2014. పార్ట్-2 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మార్చి 28, 2014. రాతపరీక్ష తేదీ: మే 25, 2014. వివరాలకు: http://ssc.nic.in