డిప్లొమా విద్యార్థులకు చక్కటి అవకాశం..
డిప్లొమా విద్యార్థులకు చక్కటి అవకాశం..
Published Wed, Mar 12 2014 11:47 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
ఇంజనీరింగ్ డిప్లొమా విద్యార్థులకు చక్కని అవకాశం.. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)
జూనియర్ ఇంజనీర్స్ ఎగ్జామినేషన్.. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ
విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తారు.. పరీక్షకు ఇంకా రెండు
నెలలకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే..
కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌తో కెరీర్ ప్రారంభించే చక్కని అవకాశం దక్కుతుంది.. ఈ
నేపథ్యంలో సంబంధిత అంశాలపై విశ్లేషణ..
భర్తీ చేస్తున్న పోస్టులు:
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్: జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్)
బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్: జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)
మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్: జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్)
సెంట్రల్ వాటర్ కమిషన్, ఫరక్కా బ్యారేజీ: జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్)
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ రెండు దశలాధారంగా ఎంపిక ఉంటుంది. ఇందుకు 600 మార్కులు కేటాయించారు. ఇందులో రాత పరీక్షకు 500 మార్కులు, ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి.
రాత పరీక్ష: ఆబ్జెక్టివ్, కన్వేన్షనల్ అనే రెండు విధాల కలయికగా ఉంటుంది. ఈ క్రమంలో రెండు పేపర్లు ఉంటాయి. అవి.. పేపర్-1, పేపర్-2. వివరాలు..
పేపర్-1: ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. అవి.. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంజనీరింగ్. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 మార్కులు
జనరల్ అవేర్‌నెస్ 50 మార్కులు
జనరల్ ఇంజనీరింగ్ (సివిల్- 100 మార్కులు
స్ట్రక్చరల్/ఎలక్ట్రికల్/మెకానికల్)
సమయం: 2 గంటలు
పేపర్-2: పూర్తిగా సంబంధిత బ్రాంచ్‌పై ఉంటుంది. ఈ పేపర్‌ను కన్వెన్షన్ విధానంలో నిర్వహిస్తారు.
జనరల్ ఇంజనీరింగ్ (సివిల్- 300 మార్కులు
స్ట్రక్చరల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్)
సమయం: 2 గంటలు
పేపర్-1లో నిర్దేశించిన విధంగా అర్హత సాధించిన అభ్యర్థుల పేపర్-2ను మాత్రమే మూల్యాంకనం కోసం పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో(2012) 1,02,145 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైతే.. 5025 మంది అభ్యర్థులు మాత్రమే పార్ట్-2కు అర్హత సాధించారు. కటాఫ్‌లను(జనరల్) పరిశీలిస్తే: సివిల్-62.5,ఎలక్ట్రికల్/మెకానికల్-90.50.
జనరల్ ఇంటెలిజెన్స్+రీజనింగ్:
ఈ విభాగంలో వెర్బల్-నాన్ వెర్బల్ ప్రశ్నలు వస్తాయి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే తార్కిక విశ్లేషణ అవసరం. డెరైక్షన్స్, అనాలజీస్, కోడింగ్-డీకోడింగ్, వెన్‌డయాగ్రమ్స్ తదితరాలాధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అడిగే ప్రశ్నలు క్లిష్టంగా కాకుండా మధ్యస్తంగా ఉంటాయి. కాబట్టి ప్రశ్నను సరిగ్గా అవగాహన చేసుకుంటే సులభంగానే సమాధానాన్ని గుర్తించవచ్చు.
జనరల్ అవేర్‌నెస్:
జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమకాలీనంగా చోటు చేసుకుంటున్న అంశాలను నిశితంగా పరిశీలించాలి. అదే సమయంలో చరిత్ర, జనరల్ సైన్స్, ఆర్థిక రంగం, జాగ్రఫీ, శాస్త్ర పరిశోధనలు, స్టాండర్డ్ జీకే నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు.
రిఫరెన్‌స బుక్స్:
క్వికర్ మ్యాథ్స్- ఎం.థైరా
ఆబ్జెక్టివ్ మ్యాథ్స్-ఆర్‌ఎస్ అగర్వాల్
రీజనింగ్-ఆర్‌ఎస్ అగర్వాల్, కిరణ్ ప్రకాషణ్
జీకే-మనోరమ ఇయర్‌బుక్, అరిహంత్ పబ్లికేషన్స్, ప్రతియోగితా దర్పణ్
ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లలోని ప్రశ్నలు డిప్లొమా స్థాయిలో ఉంటాయి. కాన్సెప్ట్స్‌పై పట్టు ఉంటే ఈ ప్రశ్నలను సులభంగానే సాధించవచ్చు. కాబట్టి ఆయా అంశాల్లోని ఫార్ములాలు, సూత్రాలను ఔపోసన పట్టాలి. ప్రతి ప్రాబ్లమ్‌ను కాన్సెప్ట్, ఫార్ములాను ఆధారం చేసుకొని వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సిలబస్, గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ.. డిప్లొమా స్థాయి అకడమిక్ పుస్తకాలను చదవడం ఉపయోగకరంగా ఉంటుంది.
రెండో దశ:
పర్సనాలిటీ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అభ్యర్థి విద్యార్హతలు, సొంత రాష్ట్రం, ఆసక్తి, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
నోటిఫికేషన్ సమాచారం:
అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/డిగ్రీ. మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్, బోర్డర్ రోడ్ ఆర్గైనె జేషన్ విభాగానికి చెందిన పోస్టులకు కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి. జూనియర్ ఇంజనీర్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్) పోస్టుకు-సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్వేయర్స్ నిర్వహించే ఇంటర్మీడియెట్ ఎగ్జామ్ (బిల్డింగ్ అండ్ క్వాంటిటీవ్ సర్వేయింగ్ సబ్ డివిజనల్ పార్ట్-2) ఉత్తీర్ణత.
వయసు: జనవరి 1, 2014 నాటికి 27 ఏళ్లు (సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్,మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్: -క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్), 30 ఏళ్లు (మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్), 32 ఏళ్లు, (సెంట్రల్ వాటర్ కమిషన్-ఫరాక్క బ్యారేజీ), 30 ఏళ్లు (బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పార్ట్-1 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మార్చి 26, 2014.
పార్ట్-2 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మార్చి 28, 2014.
రాతపరీక్ష తేదీ: మే 25, 2014.
వివరాలకు: http://ssc.nic.in
Advertisement
Advertisement