సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లమో కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్ సెకండియర్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈసెట్–2022లో 92.42% మంది ఉత్తీర్ణత సాధించారు. బుధ వారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సెట్ ఫలి తాలను హేమచంద్రారెడ్డి, జేఎన్ టీయూ (కాకినాడ) వీసీ ప్రసాద రాజు మీడియాకు వివరించారు. ఈసెట్‌కు 38,801 మంది దర ఖాస్తు చేయగా 36,440 మంది పరీక్ష రాశారు. వీరిలో 33,657 మంది అర్హత సాధించారు. 14 విభాగాలకుగాను 11 విభాగాల అభ్య ర్థులకే పరీక్షలు నిర్వహించారు. మైనింగ్‌లో తెలంగాణ తొర్రూరుకు చెందిన నాయకుల ఉపేందర్ మొదటి ర్యాంకు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment