AP ECET
-
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
అనంతపురం: ఇంజినీరింగ్, బీ–ఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్లు పొందడానికి నిర్వహించిన ఏపీ ఈసెట్–2024 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి గురువారం విడుదల చేశారు. ఏపీ ఈసెట్ నిర్వహించిన జేఎన్టీయూ(అనంతపురం)లో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. 8 దఫాలుగా ఏపీ ఈసెట్‌ను విజయవంతంగా నిర్వహించిన జేఎన్టీయూ(ఏ) ఈసెట్ నిర్వహణ కమిటీని ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి అభినందించారు.ఏపీ ఈసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 37,767 మంది దరఖాస్తు చేసుకోగా.. 36,369 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 32,881 మంది(90.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిలు 27,787 మంది దరఖాస్తు చేసుకోగా 26,693 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 23,849(91.68 శాతం) మంది అర్హత సాధించారు. అమ్మాయిలు 9,980 మంది దరఖాస్తు చేసుకోగా, 9,676 మంది హాజరయ్యారు. వీరిలో 9,032(93.34 శాతం) మంది ఉత్తీర్ణలుయ్యారు. ఈసెట్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1,071 మంది పరీక్ష రాయగా 1,002 (93.56 శాతం) మంది అర్హత సాధించారు. ఉదయం సెషన్లో మొత్తం 145 ప్రశ్నలకు గాను 272 అభ్యంతరాలు రాగా.. నాలుగు ఆమోదం పొందాయి.మధ్యాహ్నం సెషన్లో మొత్తం 171 ప్రశ్నలకు గాను 444 అభ్యంతరాలు రాగా 19 ఆమోదం పొందాయి. ఈ ప్రశ్నలకు జవాబు రాసిన వారికి మార్కులు లభించాయి. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఏపీ సెట్స్ స్పెషల్ ఆఫీసర్ ఎం.సుధీర్‌రెడ్డి, ఏపీ ఈసెట్ చైర్మన్ జీవీఆర్ శ్రీనివాసరావు, కన్వీనర్ పీఆర్ భానుమూర్తి, జేఎన్టీయూ(ఏ) రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, పాలకమండలి సభ్యులు బి.దుర్గాప్రసాద్, డాక్టర్ ఎం.రామశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.వలంటీర్ శిల్ప స్టేట్ ఫస్ట్రణస్థలం: సీఎం జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థలో చేరి ప్రజలకు సేవ చేస్తున్న ఓ యువతి ఏపీ ఈసెట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో వలంటీర్‌గా సేవలందిస్తున్న మైలపల్లి శిల్ప రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. శిల్ప ప్రస్తుతం శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో డీ–ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది.ఇంజనీరింగ్ చదవాలనే ఆశయంతో ఆమె ఈసెట్ రాయగా.. బయో టెక్నాలజీ విభాగంలో ఫస్ట్ ర్యాంకు వచ్చిందని ఆమె తెలిపింది. ఆమె తండ్రి పేరు పోలీసు.. టైలర్‌గా పనిచేస్తుండగా.. తల్లి లక్ష్మి గృహిణి. కుమార్తెకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. గ్రామస్తులు శిల్పను అభినందించారు. శిల్ప మాట్లాడుతూ.. బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసి అత్యుత్తమంగా రాణించాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. -
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్
ఏపీ ఈసెట్ ఫలితాలు కోసం రిజల్ట్ కోసం క్లిక్ చేయండి -
నేడు ఏపీ ఈసెట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పాలిటెక్నిక్, బీఎస్సీ(గణితం) ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈసెట్–23 పరీక్షను మంగళవారం ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 38,255 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 28,640 మంది బాలురు, 9,615 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షను ఆన్లైన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్లో అగ్రికల్చరల్, సిరామిక్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, సీఎస్ఈ, కెమికల్, బీఎస్సీ(గణితం) ఈఈఈ విభాగాలకు, మధ్యాహ్నం సెషన్లో ఈసీఈ, ఈఐఈ, మెకానికల్ మెటలర్జికల్, మైనింగ్ ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాల పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 23న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, జూలై మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఈసెట్–2023 చైర్మన్, జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు సోమవారం తెలిపారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు 8500404562 హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. -
92.42 శాతం ఉత్తీర్ణత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లమో కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్ సెకండియర్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈసెట్–2022లో 92.42 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బుధవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సెట్ ఫలితాలను హేమచంద్రారెడ్డి, జేఎన్టీయూ (కాకినాడ) వైస్ చాన్సలర్ ప్రసాదరాజు మీడియాకు వెల్లడించారు. ఈసెట్‌కు 38,801 మంది దరఖాస్తు చేయగా 36,440 మంది పరీక్ష రాశారు. వీరిలో 33,657 మంది అర్హత మార్కులు సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో 26,062 మంది బాలురు కాగా 7,595 మంది బాలికలున్నారు. 14 విభాగాలకు గాను 11 విభాగాల అభ్యర్థులకే పరీక్షలు నిర్వహించారు. సిరామిక్ టెక్నాలజీలో 22 మంది, బీఎస్సీ మ్యాథ్స్‌లో 18 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా బయోటెక్నాలజీలో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఈ మూడు విభాగాల వారికి పరీక్ష నిర్వహించలేదు. బీఎస్సీ మ్యాథ్స్, సిరామిక్ టెక్నాలజీ అభ్యర్థులకు వారి అర్హత కోర్సుల్లో సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు. ప్రాథమిక ‘కీ’పై 1,100 అభ్యంతరాలు రాగా వాటిలో ఏడు ప్రశ్నలకు సంబంధించి వచ్చినవి మాత్రమే సరైన అభ్యంతరాలుగా పరిగణించారు. వీటిలోనూ 4 ప్రశ్నల్లో 2 జవాబులు సరైనవిగా నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఆయా ప్రశ్నలకు ఆ రెండు సమాధానాలు గుర్తించిన వారికి మార్కులు కలిపారు. మరో 3 ప్రశ్నలకు సంబంధించి తప్పిదం దొర్లడంతో.. సమాధానమిచ్చిన వారికి పూర్తి మార్కులు జత చేశారు. ఈసెట్‌లో 14 వేల వరకు సీట్లు ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ వివరించారు. బీఎస్సీ మ్యాథ్స్ అభ్యర్థుల ర్యాంకులను వారి డిగ్రీ ఫలితాల అనంతరం ప్రకటిస్తామని చెప్పారు. సమావేశంలో మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు, ప్రొఫెసర్ లక్ష్మమ్మ, కన్వీనర్ ప్రొఫెసర్ కృష్ణమోహన్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్‌కుమార్, సెట్స్ ప్రత్యేక అధికారి డాక్టర్ సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ఈసెట్-2022 ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లమో కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్ సెకండియర్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈసెట్–2022లో 92.42% మంది ఉత్తీర్ణత సాధించారు. బుధ వారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సెట్ ఫలి తాలను హేమచంద్రారెడ్డి, జేఎన్ టీయూ (కాకినాడ) వీసీ ప్రసాద రాజు మీడియాకు వివరించారు. ఈసెట్‌కు 38,801 మంది దర ఖాస్తు చేయగా 36,440 మంది పరీక్ష రాశారు. వీరిలో 33,657 మంది అర్హత సాధించారు. 14 విభాగాలకుగాను 11 విభాగాల అభ్య ర్థులకే పరీక్షలు నిర్వహించారు. మైనింగ్‌లో తెలంగాణ తొర్రూరుకు చెందిన నాయకుల ఉపేందర్ మొదటి ర్యాంకు సాధించారు. (ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, టాప్ 10 ర్యాంకులు వీరికే
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదలచేసిన ఏపీ ఐసెట్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాలపల్లి రామకృష్ణ మొదటి ర్యాంకు సాధించాడు. 154 మార్కులతో టాప్‌లో నిలిచాడు. తరువాత అనంతపురం జిల్లా వ్యక్తి బండి లోకేష్ 153 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. నిలిచాడు. తేనేల వెంకటేష్(విజయనగరం)- మూడో ర్యాంకు, అల్లి లిఖిత్(చిత్తూరు)-నాలుగో ర్యాంకు, షైక్ సమీయుల్లా(చిత్తూరు)-ఐదో ర్యాంకు సాధించారు. చదవండి: ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల ►ఆరో ర్యాంకు- చెన్నం సాయి మణికంఠ కుమార్, గుంటూరు ►ఏడో ర్యాంకు- ఎంజేటి వైష్ణవి, చిత్తూరు ►ఎనిమిదో ర్యాంకు- సందు సోమశేఖర్, ప్రకాశం ►తొమ్మిదో ర్యాంకు- బేతి సాయి ఫణి సురేంద్ర, విశాఖపట్టణం, ►పదో ర్యాంకు- కరణం చందన, చిత్తూరు కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్-2021 ఫలితాలు విడుదలయిన విషయం తెలిసిందే. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. ఐసెట్ ఫలితాల్లో 38వేల మంది హాజరవగా 34,789 మంది అంటే 91.27 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఫలితాల కోసం https://sche.ap.gov.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఐసెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష నిర్వహించిన రెండు వారాల్లోపే రికార్డు స్థాయిలో ఫలితాలను ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన సీఎస్ సమీర్ శర్మ -
ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల
-
ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఐసెట్–2021, ఏపీ ఈసెట్ 2021 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉదయం 11కి ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్ ఫలితాల్లో 34,789(91.27శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసెట్ ఫలితాల్లో 29,904 (92.53శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఐసెట్, 19న ఈసెట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు అడ్మిట్ కార్డు నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి https://education.sakshi.com/ లో ఫలితాలు చూడవచ్చు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. రికార్డు స్దాయిలో ఏపీ ఇంజనీరింగ్ సెట్, ఐసెట్ ఫలితాలను ప్రకటిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఐసెట్‌కు 42 వేల ధరఖాస్తు చేసుకున్నారని, 38 వేలమంది హాజరవ్వగా, 34789 మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. దాదాపు 91 శాతం మంది అర్హత సాధించారని, పరీక్షా ఫలితాలని రేపటి నుంచి విద్యార్దులకి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. అదే విధంగా ఏంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాలకి నిర్వహించిన ఐ సెట్ అడ్మిషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సెప్టెంబర్ 19న ఏపీ ఇంజనీరింగ్ సెట్ నిర్వహిస్తే పది రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ సెట్ నిర్వహించిన ఆంద్రా యూనివర్సిటీకి అభినందనలు తెలియజేశారు. త్వరలోనే ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కాగా త్వరలోనే లాసెట్ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని పీజీ ప్రవేశాలకి అన్ని యూనివర్సిటీలకి కూడా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏపీఈసెట్ ఫలితాలు ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఏపీఈసెట్–2021 (ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జేఎన్టీయూ(ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈసెట్ ఫలితాల వెల్లడి కార్యక్రమానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి హాజరు అయ్యారు. ఏపీఈసెట్‌కు మొత్తం 32,318 మంది విద్యార్థులు హాజరు కాగా, మొత్తం 13 బ్రాంచులకు గాను పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించారు. ఏపీ ఐసెట్-2021 ఫలితాల కోసం క్లిక్ చేయండి ఏపీ ఈసెట్-2021 ఫలితాల కోసం క్లిక్ చేయండి