సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాలూరు మండలం ఎగువ గంజాయిభద్రలో రూ.8.43 కోట్లతో వేసిన పీఎంజీఎస్ రోడ్డు పనుల్లో అక్రమాలు జరిగాయని విజిలెన్స్,ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించింది. వారిచ్చిన నివేదికను ఆధారంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ సి.వి.ఎస్.రమణమూర్తి ఆదేశించారు. ఎగువ గంజాయి భద్ర పీఎంజీఎస్‌వై రోడ్డు పనుల్లో రూ.85,01,448మేర దుర్వినియోగమైనట్టు ఆ మధ్య చేపట్టిన విచారణలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
తేల్చారు. అలాగే, రూ.17లక్షల 18వేల 500మేర బ్యాంక్ గ్యారంటీకి కాలం చెల్లడంతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని గుర్తించారు. ఇందులో తొమ్మిది మంది ఇంజినీరింగ్ అధికారుల ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించారు. ఒక్కొక్కరిపై తీసుకోవల్సిన చర్యల్ని వివరించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్ ఆదేశించారు. ఆ రోడ్డు పనుల్లో ప్రమేయం ఉన్న పీఆర్‌ఐయూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.శంకరరావుపై తీవ్రంగా చర్యలు తీసుకోవాలని, ఏడు అంశాలలో అవకతవకలకు కారణమైన అప్పటి ఇన్‌చార్జి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె..శ్రీనివాస్‌కుమార్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.వి.ఎన్.వెంకటరావు, జూనియర్ అసిస్టెంట్ కె.రాజ్‌కుమార్, సూపరింటెండెంట్ పి.వి.రమణమూర్తి, అప్పటి సూపరింటెండెంట్ ఇంజినీర్లు పి.ప్రభాకరరెడ్డి, బి.వి.ఎస్.చిరంజీవి, నాటి డిప్యూటీఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు బి.జగదీష్‌బాబు,కె.శ్రీనువాసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలో సూచించారు. ఆమేరకు చర్యలు తీసుకోవడంతో పాటు రూ.85,01,448 బాధ్యుల్ని నుంచి రికవరీ చేయనున్నారు.
9 మంది ఇంజినీర్లపై చర్యలకు ఆదేశాలు
Published Tue, Jun 9 2015 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM
Advertisement
Advertisement