మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో సంపూర్ణ చర్చ జరగాలని, కాంగ్రెస్, టీడీపీ నాయకులు అడ్డుకోవడం సరైంది కాదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. మిర్యాలగూడలో సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు ప్రాంతాల్లో రెండు రకాల ఉద్యమాలు చేస్తున్నాయని, వారి నైజం బయట పడుతుందనే ఉద్దేశంతోనే చర్చను ఆయా పార్టీల నాయకులు అడ్డుకుంటున్నారని అన్నారు. రాష్ట్రపతి పంపిన ముసాయిదా బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ పాలనను నెంబర్ వన్‌గా పేర్కొన్న సంస్థ పనికిమాలినదని అన్నారు.
దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఆ పార్టీ సామన్యులకు న్యాయం చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఎం శాసనసభా పక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కర్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి, నాయకులు గట్టికొప్పుల రాంరెడ్డి, డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సచార్ కమిటీ నివేదికను అమలు చేయాలి
మిర్యాలగూడ టౌన్ : సచార్ కమిటీ నివేదికను అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డ్డి కోరారు. ఆదివా రం స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన డివిజన్ ఆవాజ్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో పెరుగుతున్న మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ఈనెల 7న మతతత్వానికి వ్యతిరేకంగా నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభను అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. ఆవాజ్ కమిటీ పట్టణ అధ్యక్షుడు ఎంఎం ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంఏ ఘని, మహ్మద్ బిన్ సయీద్, ఎస్‌కే బాబు, ఎండీ వహీద్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ బిల్లుపై చర్చ జరగాలి
Published Mon, Jan 6 2014 2:23 AM | Last Updated on Thu, Jul 11 2019 9:08 PM
Advertisement
Advertisement