nandyala narasimha reddy
-
కేసీఆర్ అసహనం ఓటమికి సంకేతం: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో పార్టీ కేడర్‌పై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేయడం టీఆర్ఎస్ ఓట మికి సంకేతం అని సీపీఎం అభివర్ణించింది. టీఆర్ఎస్ పాలనలో చెప్పిం ది ఎక్కువ చేసింది తక్కువ, అప్పులు ఎక్కువ అభివృద్ధి తక్కువ అని ఆ పార్టీ నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వ్యక్తిగత దూషణలకే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. బుధవారం ఎంబీభవన్‌లో పార్టీ నాయకులు టి.జ్యోతి, డి.జి.నర్సింహారావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాజికన్యాయం– సమగ్రాభివృద్ధి సాధన దిశగా ప్రత్యామ్నాయ విధానాలతో పోటీచేస్తున్న సీపీఎం–బీఎల్ఎఫ్ అభ్యర్థులను బలపరచాలని ప్రజలను కోరారు. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే పరిస్థితులు ఉండటంతో, తెలంగాణ ప్రజలను ఏమార్చడానికి లోక్‌సభ ఎన్నికలకు ముందు పట్టు సాధించేందుకు ఆ పార్టీ ముఖ్యనేతలంతా ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారన్నారు. పాలకపార్టీకి ఈసీ వత్తాసు అధికార టీఆర్ఎస్కు ఈసీ వత్తాసు పలికేలా వ్యవహరిస్తోందని జ్యోతి ఆరోపించారు. కోట్లాది రూపాయలు పంపిణీ కోసం గ్రామాలకు చేరుతున్నా ఈసీ ఉదాసీనంగా ఉందన్నారు. ఇప్పటికై నా డబ్బు, మద్యం పంపిణీ అరికట్టేలా ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమపథకాల చుట్టే ప్రధానపార్టీల మేనిఫెస్టోలు తిరిగినా, మౌలికంగా మార్పు ఎలా తెస్తారు, పథకాల అమలుకు అవసరమైన డబ్బును ఎలా సమకూరుస్తారన్న విషయాన్ని వెల్లడించలేదన్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా సీపీఎం, బీఎల్ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
తెలంగాణ బిల్లుపై చర్చ జరగాలి
మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో సంపూర్ణ చర్చ జరగాలని, కాంగ్రెస్, టీడీపీ నాయకులు అడ్డుకోవడం సరైంది కాదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. మిర్యాలగూడలో సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు ప్రాంతాల్లో రెండు రకాల ఉద్యమాలు చేస్తున్నాయని, వారి నైజం బయట పడుతుందనే ఉద్దేశంతోనే చర్చను ఆయా పార్టీల నాయకులు అడ్డుకుంటున్నారని అన్నారు. రాష్ట్రపతి పంపిన ముసాయిదా బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ పాలనను నెంబర్ వన్‌గా పేర్కొన్న సంస్థ పనికిమాలినదని అన్నారు. దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఆ పార్టీ సామన్యులకు న్యాయం చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఎం శాసనసభా పక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కర్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి, నాయకులు గట్టికొప్పుల రాంరెడ్డి, డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సచార్ కమిటీ నివేదికను అమలు చేయాలి మిర్యాలగూడ టౌన్ : సచార్ కమిటీ నివేదికను అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డ్డి కోరారు. ఆదివా రం స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన డివిజన్ ఆవాజ్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో పెరుగుతున్న మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ఈనెల 7న మతతత్వానికి వ్యతిరేకంగా నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభను అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. ఆవాజ్ కమిటీ పట్టణ అధ్యక్షుడు ఎంఎం ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంఏ ఘని, మహ్మద్ బిన్ సయీద్, ఎస్కే బాబు, ఎండీ వహీద్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రిజేశ్‌కుమార్ తీర్పుపై స్పందించాలి
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: కృష్ణానది జలాల పంపకంపై బ్రిజేశ్‌కుమార్ ఇచ్చిన తీర్పుపై అధికార పక్షం స్పం దించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నం ద్యాల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్రిజేశ్‌కుమార్ తీర్పు వల్ల రాష్ట్రానికి నష్టం జరగుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరిన్ పీడత ప్రాంతంగా ఉన్న నల్లగొండ జిల్లాకు తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులు పూర్తిగా ఉత్సవ విగ్రహాలుగా మిగులుతాయన్నారు. తాగునీరు కూడ లభించని పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. ఎగువన ఉన్న కర్ణాటక, మహరాష్ట్రలోని ప్రాజెక్టులు నిండితేనే రాష్ట్రానికి నీరొచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీంతో సాగర్ ఆయకట్టులో ఖరీఫ్ సీజన్లో పంటల సాగు ఆలస్యమై దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. రాష్ట్రానికి జీవనదిగా ఉన్న కృష్ణానది జలాలపై ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవడంతోనే నష్టం జరిగిందన్నారు. ఈ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చిం చేందుకు ప్రభుత్వం అఖిలపక్షం సామావేశం ఏర్పాటు చేయాలని, వారిని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ తీర్పుపై అధికార పక్షం నాయకులు నోరుమెదకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా స్పందించాలని కోరారు. ఆయన వెంట సీపీఎం కార్యదర్శీ వర్గ సభ్యుడు అనంతరామశర్మ, తదితరులు ఉన్నారు.