విగ్రహ విషయంలో వివాదం.. ఘర్షణ
పాలకోడేరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గనగపర్రులో అంబేద్రర్ విగ్రహ ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మధ్య విబేధాలు చోటుచేసుకున్నాయి. గ్రామంలో దళితులు, దళితేతరులు మధ్య ఈ విషయంలో వివాదం తలెత్తింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమను సాంఘిక బహిష్కరణ చేశారని దళితులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కాటమనేని ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. రెండు వర్గాలతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు.
విషయం తెలుసుకున్న దళిత నాయకులు ఛలో గరగపర్రు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గ్రామంలోకి బయట వ్యక్తులు రాకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సారసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగార్జున గరగపర్రు గ్రామానికి బయలుదేరారు. గ్రామంలో అందరం అన్నదమ్ములాగా కలిసి మెలిసి ఉండే వారమని.. ఎవరినీ తక్కువ చూపు చూడడం కానీ, వెలి వేయలేదంటున్న దళితేతర వర్గాలు చెబుతున్నాయి.