అంతర్యుద్ధం!! | District Audit Officer Hari Prasad transfers | Sakshi
Sakshi News home page

అంతర్యుద్ధం!!

Published Sun, Oct 5 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

అంతర్యుద్ధం!!

అంతర్యుద్ధం!!

 జిల్లాలోని అన్ని శాఖల లెక్కలు తేల్చే ఆడిట్ శాఖ లెక్క తప్పుతోంది. ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలించే ఆడిట్ అధికారులు క్షణం తీరిక లేకుండా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కౌన్సెలింగ్‌లో ఉద్యోగులు కోరని ప్రాంతాలను కట్టబెట్టి బలవంతపు బదిలీలకు పాల్పడుతున్నారని రుసరుసలాడుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన బదిలీల అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. దీంతో ఆ శాఖలోని లొల్లి డెరైక్టర్, రీజనల్ డెరైక్టర్ల వరకూ వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే...
 
 విజయనగరం కంటోన్మెంట్ : జిల్లా పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్‌లోని ఆడిట్ శాఖ కార్యాలయంలో జిల్లా ఆడిట్ కార్యాలయంతో పాటు, మండల పరిషత్ ఆడిట్, గ్రామ పంచాయతీ ఆడిట్ విభాగాలున్నాయి. ఇందులో సిబ్బంది మధ్య ఇటీవల తీవ్రమైన అభిప్రాయ బేధాలొచ్చాయి. గత నెల 26న శాఖలో ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్‌లో కొందరు ఉద్యోగులకు కోరని చోటుకు బలవంతంగా జిల్లా ఆడిట్ అధికారివై.హరిప్రసాద్ బదిలీలు చేశారనీ, ఉన్న ఉద్యోగుల్లో బదిలీలను 20 శాతానికి మించి జరపకూడదన్న నిబంధనలు పాటించలేదని సహాయ ఆడిట్ అధికారి ఆర్‌ఎస్ జాన్ డెరైక్టర్, రీజన ల్ డెరైక్టర్లకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. తన కార్యాలయంలో 11 మంది పని చేస్తుండగా ప్రభుత్వ బదిలీల ఉత్తర్వుల జీఓ నంబర్ 186 ప్రకారం కేవలం ఇద్దరినే బదిలీ చేయాల్సి ఉండగా ముగ్గురిని బదిలీ చేశారని ఆ లేఖలో వివరిం చారు.
 
 కార్యాలయంలో పనిచేస్తున్న కె.జానకీరామ్, ప్రసాదరెడ్డి, భాగ్యలక్ష్మి కౌన్సెలింగ్‌కు వెళ్లగా వారు కోరిన బొబ్బిలి ప్రాంతాన్ని కేవలం ఒక్క ప్రసాదరెడ్డికి మాత్రమే బదిలీ చేశారనీ పేర్కొన్నారు. కె.శ్రీనివాసరావు(జూనియర్ ఆడిటర్)ను బొబ్బిలికి అడక్కుండానే బదిలీ చేశారనీ డెరైక్టర్‌కు వివరించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఆడిట్ క్యాంపు నిర్వహణ, టీఏ బిల్లు ల్లో లోపాలున్నాయనీ జిల్లా ఆడిట్ అధికారి వై.హరిప్రసాద్ ఏఏఓలకు మెమోలు జారీ చేశారు. బిల్లులను సరిగా రాయలేదని మెమో జారీ చేశారు. కౌన్సెలింగ్ బోర్డు సభ్యుడు, జిల్లా అడిట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడైన ఆర్‌ఎస్ జాన్ ఈ అభ్యంతరాలపై అధికారిని సూటిగా ప్రశ్నించినట్టు తెల్సింది. బొబ్బిలి నుంచి టి.శ్రీనివాసరావు అనే ఉద్యోగిని ఇక్కడి ఉద్యోగి రిలీవ్ కాకుండానే విజయనగరంలో చేర్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నారనీ జాన్ జిల్లా అధికారిని ప్రశ్నించినట్టు భోగట్టా!  సీనియర్లను వారు కోరిన చోటుకు బదిలీలు చేయాలని నిబంధనలు ఉన్నా అందుకు తగ్గట్టుగా బదిలీలు జరగలేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. దీనిపై శాఖ లో అంతర్లీనంగా వివాదం నడుస్తోందని, దీనిని ఇటువంటప్పుడే తగ్గిం చకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా పై అధికారులకు త ప్పిదాలపై లేఖలు, ఇక్కడున్న అధికారులకు మెమోలు ఇవ్వడం ఇబ్బందికర అంశంగా మారింది.
 
 పారదర్శకంగా బదిలీలు జరగాలి...
 మా కార్యాలయాల్లో అధికారులనుగానీ, సిబ్బందినిగానీ పారదర్శకంగా బదిలీలు చేయమని అడుగుతున్నాం. సక్రమంగా జరగకపోవ డం వల్లనే కొంత మందికి కోరని చోటుకు బదిలీలు జరిగాయి. వారు ఆవేదన చెందుతున్నారు. దీనిపై సమాచారం నిమిత్తం డెరైక్టర్లకు లేఖలు రాశాను. జిల్లా ఆడిట్ అధికారికి కూడా లేఖ రాశాను. నాకు సమాధానం రాలేదు.
 - ఆర్‌ఎస్ జాన్, సహాయ ఆడిట్ అధికారి,
 మండల పరిషత్ ఆడిట్ కార్యాలయం, విజయనగరం.
 
 క్రమశిక్షణ లోపించింది..
 ఆడిట్ కార్యాలయంలోని కొన్ని విభాగాల్లో క్రమశిక్షణ లోపించింది. ఇది చాలా తీవ్రస్థాయికి చేరింది. నేను మీకు వివరిస్తాను. మీరే ఆశ్చర్యపోయేంతగా కార్యాలయంలో క్రమశిక్షణ తప్పింది. నేను తప్పుడు బదిలీలు చేస్తే నాపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు కదా! ఎటువంటి అక్రమాలు లేకుండా బదిలీలు సక్రమంగా, పారదర్శకం గా జరిగాయి. మీకు తప్పుడు సమాచారం వచ్చి ఉంటుంది.
 - వై.హరిప్రసాద్, జిల్లా ఆడిట్ అధికారి, విజయనగరం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement