కూచిపూడి, న్యూస్‌లైన్ : ప్రకాశం జిల్లా అద్దంకిలో ఈ నెల 17న నిర్వహించిన ఏపీ అంతర్ జిల్లా గోజోరియో కరాటే ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీల్లో మొవ్వ మండలం కోసూరు, మొవ్వ విద్యార్థులు పలు పతకాలు సాధించారు. కోసూరు విజయశ్రీ సన్‌ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు డి.పి.ఎస్.మణికంఠ అండర్-9 విభాగంలో కటాలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. సీహెచ్.వంశీ కటాలో మూడో స్థానంలో నిలిచాడు.
అండర్-10 కటాలో జె.మోహన్‌చైతన్య మూడో స్థానం, కటాలో డి.మనోజ్‌వర్మ మూడో స్థానంలో నిలిచాడు. అండర్ 11 కటాలో ఎ.దినేష్‌కుమార్, డి.రోహిత్ మూడో స్థానం, అండర్ 12 కటాల్లో సీహెచ్.జితేంద్ర రెండో స్థానం, ఎ.చైతన్య సాయి మూడో స్థానాన్ని పొందారు. వీరిని కరస్పాండెంట్ పున్నంరాజు, ప్రిన్సిపాల్ జోసఫ్ అభినందించారు. అలాగే మొవ్వ హోలీ స్పిరిట్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థి కె.వి.ఎస్.భరత్‌కుమార్ అండర్-14 కటాలో మొదటి స్థానం, కుమితిలో రెండో స్థానం, కటాలో రెండో స్థానం సాధించారు. అండర్-9లో ఎం.రఘురామ్ టీమ్ కటాలో మొదటి స్థానం, కుమితిలో మూడో స్థానం సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ సిస్టర్ ఫిలోమినీ జేమ్స్ అభినందించారు.
‘కొమ్మారెడ్డి’ విద్యార్థులకు పతకాలు
బంటుమిల్లి రూరల్ : అంతర్ జిల్లా గోజో రియో కరాటే ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీలలో బంటుమిల్లిలోని కొమ్మారెడ్డి టాలెంట్ హైస్కూల్ విద్యార్థులు పలు అంశాలలో పతకాలు గెలుపొందినట్లు పాఠశాల డెరైక్టర్ కె.కిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. కటా విభాగంలో ఆర్. చిద్విలాస్, కె.సాయినితిన్, ఎ.రవీనాశ్రీ, కె.బాలాజీ బంగారు పతకాలు, వై. వెంకటరత్నం, పి.సందీప్ రజతపతకాలు, జె.అంజనిబాబు, వై.కార్తికేయవెంకట్ కాంస్య పతకాలు సాధించినట్టు వివరించారు. టీం కటా విభాగంలో వీరు తృతీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. విజేతలను పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, కోచ్ ఎస్. వెంకటేశ్వరరావు, మంగళవారం అభినందించారు.
కరాటేలో జిల్లా విద్యార్థుల ప్రతిభ
Published Wed, Nov 20 2013 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement
Advertisement