
పొలాల్లోకి దూసుకెళ్లిన దివాకర్ ట్రావెల్స్ బస్సు
ముదిగుబ్బ : మరమ్మతు కోసం మదనపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు గురువారం ముదిగుబ్బ వద్ద అదుపుతప్పింది. కేజీబీవీ పాఠశాల వద్ద చెట్టును ఢీ కొని పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో బస్సుకు ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment