ఆచంట/తాడేపల్లిగూడెం : జిల్లాలోని 16 వేల ఎకరాల అటవీ భూములను డీనోటిఫై చేసి వినియోగంలోకి తెచ్చి పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆదివారం ఆచంట, తాడేపల్లి గూడెంలో జన్మభూమి-మా ఊరు సభల్లో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు యత్నిస్తున్నామన్నారు. అరుుతే సారవంతమైన భూములు ఉండడంతో జిల్లాలో పరిశ్రమల నెలకొల్పడానికి భూసేకరణ సమస్య ఎదురవుతోందని, దీనిని అధిగమించడానికి అటవీ భూములను డీనోటిఫై చేసేందుకు నిర్ణరుుంచామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. మంత్రి మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్ బాపిరాజు ఆయన వెంట ఉన్నారు.
సెల్‌ఫోన్ వాడడం కాదు.. మరుగుదొడ్లు నిర్మించుకోండి
గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేల రూపాయల ఖరీదు చేసే సెల్‌ఫోన్లు కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారని, దానికంటే ముందు మరుగుదొడ్లు నిర్మించుకోవాలని మంత్రి అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు. ఆచంటలో జరిగిన జన్మభూమి-మా ఊరు సభలో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుంటే ప్రజలు రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ్రపభుత్వం రూ.15 వేలు అందిస్తుందని ప్రజలు కూడా సహకరించి ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతు రుణమాఫీలో 85 శాతం రైతులకు న్యాయం జరిగిందని, 10 శాతం రైతులు వారు తీసుకున్న రుణాలు దుర్వినియోగం చేయడంతో వారికి మాఫీ వర్తించలేదని, మరో ఐదు శాతం మంది రైతులకు న్యాయం జరగలేదని వారికి న్యాయం చే స్తామన్నారు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తున్నామని, డ్వాక్రా సంఘాల వడ్డీ మాఫీకే రూ.1,250 కోట్లు విడుదల చేశామన్నారు. సమావేశంలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయుడు పాల్గొన్నారు.
అటవీ భూములను డీనోటిఫై చేస్తాం
Published Mon, Jun 8 2015 1:08 AM | Last Updated on Fri, Sep 28 2018 7:57 PM
Advertisement
Advertisement