ఉద్యోగులను ఇతర రాష్ట్ర్రాల్లో వైద్యానికి అనుమతించం | Do not allow medicine employees Medical services in other states | Sakshi
Sakshi News home page

ఉద్యోగులను ఇతర రాష్ట్ర్రాల్లో వైద్యానికి అనుమతించం

Published Sun, Jul 2 2017 1:44 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

ఉద్యోగులను ఇతర రాష్ట్ర్రాల్లో వైద్యానికి అనుమతించం - Sakshi

ఉద్యోగులను ఇతర రాష్ట్ర్రాల్లో వైద్యానికి అనుమతించం

మంత్రి కామినేని శ్రీనివాస్‌
 
సాక్షి, అమరావతి: గతంలో మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి వైద్య సేవ కోసం హైదరాబాద్, ఇతర రాష్ట్రాలకు వెళితే అంగీకరించేది లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ చెప్పారు. మన రాష్ట్రంలో సంబంధిత వైద్య సౌకర్యం అందుబాటులో లేనప్పుడు, ఇక్కడి ఆస్పత్రులు ఆ వైద్యానికి నిరాకరించినప్పుడు మాత్రమే ఇతర రాష్ట్రాల్లో వైద్యానికి అనుమతిస్తామన్నారు. శనివారం విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో ఉద్యోగులు, జర్నలిస్టుల సమస్యలపై ఉద్యోగ, జర్నలిస్టు సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ అంశాన్ని మరోసారి పునఃసమీక్షిస్తామన్నారు.

నీట్‌ ర్యాంకుల ఆధారంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులను రేపు నిర్ణయిస్తామన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి అనుమతి ఉంటే డెస్క్‌ జర్నలిస్టులకు హెల్త్‌ కార్డ్‌లు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్‌ కార్డులపై వైద్యం చేయడానికి ఏ ఆస్పత్రి నిరాకరించకూడదని అలాచేస్తే, సంబంధిత ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో 400 సీట్లకు ఎంసీఐ కోత పెట్టిందని, దానిపై తాము చేసేదేమీ లేదన్నారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, అశోక్‌బాబు, జర్నలిస్టు సంఘాల నేతలు పాల్గొన్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement