సాక్షి, విశాఖపట్నం : మున్సిపల్ ఎన్నికలు ముగిసి ఐదు రోజులైంది. ఈ నెల 9న కౌంటింగ్ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. కౌంటింగ్‌ను నిలిపివేయూలని పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను మే 7వ తేదీ తర్వాత వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మళ్లీ వాయిదా పడితే ఓట్లు నిక్షిప్తమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లను ఎక్కువ రోజులు భద్రపరచాల్సి వస్తుంది. దీంతో ఈవీఎంల సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎం లలో డేటా ఎంతకాలం ఉంటుంది... బ్యాటరీ బ్యాకప్ ఎన్ని గంటలు... బ్యాటరీ డిశ్చార్జి అయితే పరిస్థితి ఏమిటీ.. అనే ప్రశ్నలు పలువురు వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారుల నుంచి ‘సాక్షి’ సేకరించిన వివరాలు..
ఈవీఎంలలో బ్యాటరీ నిరంతరాయంగా 36 నుం చి 48 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు.
ఓటింగ్ సమయంలో, అంతకుముందు మాక్ పో లింగ్ కోసం ఈవీఎంలను పది గంటల పాటు ఉపయోగిస్తారు. ఆ తర్వాత వాటిని స్ట్రాం గ్ రూమ్‌లో భద్రపరుస్తారు. ఉయోగించకుండా ఉంటే ఆయా బ్యాటరీల సామర్థ్యాన్ని బట్టి 45 నుంచి 90 రోజుల వరకు చార్జింగ్ ఉంటుంది.
బ్యాటరీ చార్జింగ్ అయిపోయినా వాటి స్థానంలో కొత్త బ్యాటరీలను పెడితే అందులో సంక్షిప్తమైన డేటాను తెలుసుకోచ్చు.
బ్యాటరీ బ్యాకప్, డేటా బ్యాకప్ విడివిడిగా ఉంటాయి.
డేటా క్లీనర్, అభ్యర్థుల వివరాలను ఫీడ్ చేసిన తర్వాత సీల్ చేస్తారు. ఈ సీలు ఉండగా వాటిని ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదు. ఆ డేటా మళ్లీ మనం క్లీన్ చేసే వరకు ఈవీఎంలో భద్రంగా ఉంటుంది.
డేటాపై డోంట్ వర్రీ
Published Sun, Apr 6 2014 3:00 AM | Last Updated on Fri, Sep 28 2018 7:57 PM
Advertisement
Advertisement