సాక్షి, అమరావతి: రోజువారీ జీవితంలో మనం తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలే కరోనా నుంచి మనకు కొండంత రక్షణగా నిలుస్తాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం ఎంత ముఖ్యమో ఈ జాగ్రత్తలు పాటించడం కూడా అంతే ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ప్రతి చిన్న విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ స్వీయ రక్షణ చర్యలను పాటించాలని వారు సూచిస్తున్నారు.
► ఇతరుల సెల్‌ఫోన్‌లను మనం ముట్టుకోకపోవడం మంచిది. ఒకరు వాడిన దువ్వెనలు వీలైనంత వరకూ ఇతరులు వాడకూడదు.
► కంప్యూటర్ కీ బోర్డు, మౌస్‌లు ఎవరికి వాళ్లే వాడుకోవాలి. మరొకరి బైక్ వాడినప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవాలి. పాలప్యాకెట్లు తేగానే వాటిని నీళ్లతో కడగడంతో పాటు చేతులను కూడా శానిటైజ్ చేసుకోవాలి.
► ఏదైనా కార్యాలకు వెళ్లినప్పుడు గోడలు, కుర్చీలు వంటివాటి ఉపరితలాలను తాకకుండా జాగ్రత్తపడాలి.
► లిఫ్ట్‌లు, ఏటీఎంలు వంటివి వినియోగించాక, పెంపుడు జంతువులను తాకినా కూడా చేతులను శుభ్రం చేసుకోవడం ఉత్తమం.
► ఇంట్లోంచి బయటికెళ్లి వచ్చినప్పుడు వేడినీళ్లు, సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
గోరంత జాగ్రత్త.. కొండంత రక్ష
Published Tue, Jul 21 2020 4:08 AM | Last Updated on Tue, Jul 21 2020 4:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment