
విశ్వాసమంటే ఇదేరా!
► నాలుగు రోజులుగా మృతదేహం వద్దనే కాపలా
► విశ్వాసం చాటుకున్న శునకాలు
అయినవాళ్లే అన్నీ మరిచి కాలదన్ని వెళ్తున్న ఈ కాలంలో ఆమె తినగా మిగిలిన నాలుగు మెతుకులు పెట్టి ఆకలి తీర్చిన రుణాన్ని ఓ మూడు శునకాలు మరిచిపోలేకపోయాయి. ఆకలి తీర్చిన మహిళ అవసాన దశలో కూడా తోడునీడగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకున్నాయి. చివరకు ఆమె మరణించగా నాలుగు రోజులుగా మృతదేహం వద్దనే కాపలా ఉండి విశ్వాసమంటే ఇదేరా అని నిరూపించాయి. ఆమె మృతి విషయం తెలుసుకుని గురువారం అక్కడకు వెళ్లిన పోలీసులు, పాత్రికేయులను సైతం శవం వద్దకు రానీయకుండా అడ్డుకున్నాయి.